రవివర్మకు అందని అందమా!

ఒకరు మోనాలిసా..
మరి ఇంకొకరు..అప్సరసా..
మోనాలిసాను
మించిన సొగసా..
మోనాలిసా సౌందర్యం
ఓ చరిత్ర..
ప్రపంచం మొత్తం ప్రశంసించే సమ్మోహన రూపం..
మరి ఆ పక్కనే ఆమెను మించిన రూప లావణ్యంతో కనిపిస్తున్న సుందరి బొమ్మ ఎక్కడిదో..
అది మన రవివర్మ ఎంతో అద్భుతంగా రూపు దిద్దిన సజీవ సుందరి..
భారతీయత
ఉట్టిపడుతున్న ముగ్ధ..!

రవివర్మకే అందని ఒకే ఒక అందానివో..
ఊరికే పాట కోసం అలా రాశారు గాని…
రవివర్మకు అందని అందమా..
ప్రతి సుందరి
చందమామను మించిన
సొగసా.. అన్ని శిల్పాలు
అదే వరసా..
చీకటిలో మెరిసే దీపం..
ప్రతి సుందరి అద్భుత రూపం
రవివర్మకే చెల్లిన కౌశలం..
రూపు దిద్దుకున్న ప్రతిసుందరీ..
ఎన్నో అందాలను సృష్టించిన
బ్రహ్మనే అడగదా కుశలం!

ఆ కుంచె విసరదా
విధాతకే సవాలు..
ఊపిరి పోసుకున్న ప్రతి దేవకన్యల ఆనవాలు..
కళ్ళలోనే జీవాలు..
ఎప్పటికీ సజీవాలు!
(రవివర్మకు 175 వసంతాలు)

సురేష్ కుమార్ ఇ
9948546286

Leave a Reply