బండి సంజయ్ కి బడిత పూజ తప్పదు

– బిఆర్ఎస్ సీనియర్ నాయకులు శ్రీధర్ రెడ్డి

పార్టీ అధ్యక్ష పదవి పోయిన ఫ్రస్టేషన్ లో బండి సంజయ్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని రావుల శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు. ఎంపిగా రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ నీచంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని సాధించి, పదేళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ పై అవాకులు చెవాకులు పేలితే బండి సంజయ్ కి బడితపూజ తప్పదు అన్నారు. బండి సంజయ్ నోరు జారితే, ఇలాంటివి రిపీట్ అయితే మేము చేతికి పని చెప్పాలి ఉంటుందని హెచ్చరించారు.

కేసీఆర్ డిల్లీకి వెళ్తారని పత్రికల్లో వార్తలు వస్తే తప్పు పడుతున్న బండి సంజయ్, ఎంపీగా తను, కిషన్ రెడ్డి ఎందుకు డిల్లీ వెళ్తున్నారో సమాధానం చెప్పాలన్నారు. బిజెపి గ్రూపు తగాదాలు భరించలేక బండి సంజయ్ అసహనం వ్యక్తం చేస్తున్నారన్నారు. పొత్తుల గురించి మాట్లాడుతున్న బండి సంజయ్ ఎవరిని ఉద్దేశించి, ఆ వ్యాఖ్యలు చేశారు చెప్పాలన్నారు, బిజెపితో పొత్తు కావాలని బండి సంజయ్ ను ఎవరు అడిగారో చెప్పాలన్నారు.

Leave a Reply