ప్రణాళికాబద్ధంగా చదవండి

– మంచి ఆరోగ్య ఆహార అలవాట్లు పెంపొందించుకోండి
– సమకాలీన అంశాలపై దృష్టి పెట్టండి
– పూర్వ కాలేజియేట్ మరియు ఇంటర్ బోర్డు కమిషనర్ డా దిట్టకవి చక్రపాణి

స్థానిక గవర్నమెంటు కళాశాలలో ఈ రోజు విద్యార్థులు అధ్యాపకులకు ఓరియెంటేషన్ తరగతులు ప్రారంభ సభలో ఇంటర్మీడియెట్ మరియు కాలేజియేట్ మాజీ కమిషినర్ డా దిట్టకవి చక్రపాణి, జస్టిస్ పి. శంకరనారాయణ వక్తలుగా, ప్రజాసైన్స్ వేదిక రాష్ట్ర అధ్యక్షులు డా యం.సురేష్ బాబు తదితరులు ప్రసంగించారు .

డా చక్రపాణి ప్రసంగిస్తూ ప్రధాన పోటీ పరీక్షలకు నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో విద్యార్థులు బోర్డు పరీక్షల కోసం సన్నద్ధమవుతున్నారు. పూర్తి సిలబస్‌ చదవడానికి సరైన ప్రణాళికతో సిద్ధంగా ఉండాలి. ముఖ్యంగా టైం మేనేజ్‌మెంట్ టెక్నిక్స్, సరైన షెడ్యూలింగ్‌తో పరీక్షలకు సన్నద్ధమైతే మంచి స్కోర్ సాధించే అవకాశం ఉంది. వీటితో పాటు మరికొన్ని టిప్స్ పాటిస్తే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చు. విద్యార్థులు పరీక్షల కోసం మొత్తం సిలబస్ చదవాల్సి ఉంటుంది. దీంతో వర్క్‌లోడ్ పెరిగి మానసికంగా ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. దీన్ని నివారించాలంటే ప్రిపరేషన్‌కు సరైన ప్రణాళికలు వేసుకోవాలి. దీంతో పాఠ్యాంశాల్లో వేటికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలో తెలుస్తుంది. వాటికి అనుగుణంగా సమయం కేటాయించడానికి వీలు కలుగుతుంది.

ఈ నోట్ టేకింగ్ టెక్నిక్ వాస్తవానికి 1960లో ప్రముఖ రచయిత, విద్యా నిపుణుడు టోనీ బుజాన్ అభివృద్ధి చేశారు. గత కొన్నేళ్ల నుంచి సాంకేతికంగా అత్యంత ప్రభావవంతమైన విజువల్ లెర్నింగ్ సాధనాల్లో ఇది ఒకటిగా పేరుగాంచింది. ఈ పద్ధతి ద్వారా పాఠాలను సులభంగా గుర్తుంచుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం చదివే అంశాన్ని విజువల్ రూపంలో గుర్తుకు తెచ్చుకునే విధంగా చేయడమే మైండ్ మ్యాపింగ్. 3 నుంచి 6 నెలల పాటు మ్యాప్ మ్యాపింగ్ ప్రక్రియను ఉపయోగించడం వల్ల సంక్లిష్ట పాఠాలను గుర్తుంచుకోవడంలో గణనీయమైన ప్రయోజనాలు ఉన్నాయని అధ్యయనాల్లో తేలిందన్నారు. కార్నెల్ నోట్‌టేకింగ్ సిస్టమ్ విద్యార్థులు వాడుక చేసుకోవాలి. ఈ టెక్నిక్‌ను 1950లో కార్నెల్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ వాల్టర్ పాక్ డెవలప్ చేశారు. పాఠాలు వినే సమయంలో నోట్ పక్కన ఖాళీ కాలమ్‌ను ఉంచుతూ యాక్టివ్ నోట్-టేకింగ్‌ను ప్రోత్సహిస్తుంది. ఈ కాలమ్ వల్ల తరువాత మరోసారి సమాచారాన్ని గ్రహించడానికి, తిరిగి రివైజ్ చేసుకోవడానికి స్వయంగా విద్యార్థులే టెస్ట్ చేసుకోవచ్చు. స్టడీ మెటీరియల్‌ని చురుగ్గా చడవడం, రివైజ్ చేసుకోవడం, స్వయంగా టెస్ట్ చేసుకోవచ్చు. దీంతో సబ్జెక్ట్‌ భావనపై అవగాహనలో వ్యత్యాసం ఎక్కువ ఉందో అంచనా వేయడానికి నోట్-టేకింగ్ పద్ధతి సహాయపడుతుందని తెలిపారు.

సమకాలీన అంశాలతో పాటు విద్యార్థులు భావప్రకటన నైపుణ్యాలు పెంపొందించుకోవాలని అలాగే టైం మేనేజిమెంట్, స్ట్రెస్ మేనేజిమెంట్, టీనేజ్ మేనేజ్మెంట్, కాన్ఫ్లిక్ట్ మేనేజిమెంట్ మంచి ఆరోగ్య ఆహార అలవాట్లపై దృష్టి పెట్టాలని డా సురేష్ బాబు తెలిపారు. కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా ఏ దివాకరరెడ్డి, కామర్స్ విభాగాధిపతి డా రంగనాథ్, వైస్ ప్రిన్సిపాల్ డా శశాంక్ మౌళి, ఎన్నికల నిఘా వేదిక జిల్లా కన్వీనర్ వైష్ణవ శ్రీనాథ్, లయన్ బాయినేని నాగేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply