పేరుకే నేను ఎమ్మెల్యేని కానీ పెత్తనం బైరెడ్డిది

-ఎస్సీ నియెజకవర్గంలో వైసీపీలో రెడ్డి ఇంచార్జి ఉంటారు
-చాలా నియెజకవర్గంలో అదే పరిస్థితి
-నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే అర్ధర్ సంచలన వ్యాఖ్యలు

పేరుకే నేను ఎమ్మెల్యేని కానీ పెత్తనం బైరెడ్డి ది, చాలా నియెజకవర్గంలో అదే పరిస్థితి, అడిగినందుకు నాకు టిక్కెట్ నిరాకరించారు. చాలా దళిత నియెజకవర్గాల్లో ఇదే పరిస్థితి, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారిని కలిసి ఎమ్మెల్యేగా అధికారాలు ఇస్తేనే నాకు టిక్కెట్ ఇవ్వమని చెప్పాను. నాలుగు సంవత్సరాలుగా మిమల్ని నమ్ముకున్నాను, మా మనోభావాలను, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోండి అని అడిగాను.

మాజీ ఐపిఎస్ అధికారి నేను, నా నియెజకవర్గంలో కుడా వేరే వ్యక్తులది పెత్తనం, నేను ఏమి చేయలేని పరిస్దితి. మా జిల్లా కోఆర్డినేటర్, ఐ ప్యాక్ ప్రతినిధి అంతా బానే ఉందన్నారు, వారు నాతో అడ్మినిస్ట్రేషన్ వేరేవారు చూసుకుంటారు, పేరుకు మీరు ఎమ్మెల్యే అని నాకు చెప్పారు. డిసెంబర్ 2022 లోనే నేను సజ్జల రామకృష్ణ రెడ్డి కి చెప్పాను, నావి 20 గ్రామాలు గడప గడపకు పూర్తి కాలేదు. అవి చేయాలంటే నాకు అధికారాలు ఇవ్వమని చెప్పాను.

నన్ను మార్చి వేరేవారికి ఇచ్చే ఉద్దేశం ఉంటే నాకు చెప్పండి వారిని ప్రమోట్ చేస్తానని కూడా చెప్పాను. ఎస్సీ నియెజకవర్గంలో వైసీపీలో రెడ్డి ఇంచార్జి ఉంటారు, సమన్వయకర్త కుడా వారే ఉంటారు. ప్రతి రోజూ ప్రజలతో ఉంటాను, నిన్న టిక్కెట్ ఇవ్వడం లేదని ప్రకటించాక కుడా కార్యకర్తలతో ఉన్నాను

ఐప్యాక్ దివాకర్ రెడ్డి, రామసుబ్బారెడ్డి కి కూడా చెప్పాను, సజ్జల రామకృష్ణ రెడ్డి కి ఇదే విషయం చెప్పాను. నాకు పవర్స్ లేనప్పుడు నేను ఉండలేను అని చెప్పాను. నన్ను నమ్ముకున్న వారికి న్యాయం చేయాలంటే అధికారాలు ఉండాలి. నాకు ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన వారికి ఎదైన చేయాలంటే కనీసం ఎమ్మెల్యేగా నాకు ఉండాల్సిన అధికారాలు ఉండాలి కదా?

Leave a Reply