దళితుడి జీవితాన్ని పణంగా పెట్టి జగన్ రెడ్డి తన రాజకీయ ప్రయోజనం నెరవేర్చుకున్నాడు

– హోటల్ ఐలాపురం శ్రీరామినేని ఫంక్షన్ హాల్ లో కోడి కత్తి శ్రీనుకు న్యాయం చేయాలని వారి తల్లి చేస్తున్న ఆమరణ నిరాహారదీక్షకు శనివారం నాడు తెదేపా నేతల బృందంతో కలిసి ఆమె దీక్షకు సంఘీభావం తెలియజేసిన మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య

విజయవాడ : ఇప్పుడు కోర్టుకు హాజరవ్వకుండా శ్రీనును శాశ్వతంగా జైల్లోనే ఉంచే కుట్ర చేస్తున్నాడు జగన్ రెడ్డి. జగన్ రెడ్డి తన స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం దళితుడిని వాడుకున్న తీరు అత్యంత జుగుప్సాకరం. అధికార అండతో అంబేడ్కర్ గారు రాసిన రాజ్యాంగం అమలు చేయకుండా,తాత రాజారెడ్డి ఫ్యాక్షన్ రాజ్యాంగం అమలుచేస్తున్న జగన్‌కి రాజ్యాంగ నిర్మాత విగ్రహాన్ని తాకే అర్హత కూడా లేదు.

ప్రతిపక్షంలో ఉండగా విచారణ జరగాలని గొంతు చించుకుని అరిచిన జగన్ రెడ్డి.. అధికారంలోకి వచ్చి ఐదేళ్లు అవుతున్నా కేసును పట్టించుకోవడం లేదు. బాధితుడైన జగన్ రెడ్డి కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలని కోర్టు చెబుతున్నా. కోర్టుకు హాజరవ్వకుండా మినహాయింపు ఇవ్వాలంటూ కోరడం కేసును నీరుగార్చేందుకు ప్రయత్నించడమే. తన అవినీతి కేసుల్లో కోర్టుకు వెళ్లరు. బాబాయి హత్య కేసులో సీబీఐ విచారణ డిమాండ్ చేసి, తర్వాత వద్దన్నారు. ఇప్పుడు ఆ కేసులో నిందితుల్ని కాపాడుతూ.. చెల్లెలిపైకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

కోడికత్తి కేసులో శ్రీను బెయిల్ పై కూడా బయటకు రాకుండా చేస్తూ.. తల్లితండ్రులకు కుమారుడిని దూరం చేసి వారి కుటుంబాన్ని క్షోభ పెడుతోంది ఈ వైసీపీ ప్రభుత్వం. నాలుగేళ్ల పాటు కనీసం కేసును పట్టించుకోలేదు. నాలుగేళ్ల తర్వాత కేసు విచారణ సరిగా జరగం లేదంటూ కోర్టులో పిటిషన్ వేశారు. సమగ్ర దర్యాప్తు అనంతరం విశాఖ విమానాశ్రయంలో చోటు చేసుకున్న ఘటనలో ఎలాంటి కుట్ర కోణమూ లేదని ఎన్ఐఏ కోర్టు తేల్చి చెప్పింది. వెంటనే కోడి కత్తి శీనుకు , వారి కుటుంబ సభ్యులకు తక్షణమే న్యాయం చేయాలని ప్రధాన ప్రతిపక్షంగా మేము డిమాండ్ చేస్తున్నాం

Leave a Reply