Suryaa.co.in

Andhra Pradesh

నందిగామలో అంగన్వాడి ఉద్యమం ఉదృతం

-జాతీయ రహదారిపై బైఠాయించిన అంగన్వాడి కార్మికులు
-అడ్డుకున్న పోలీసులు
-సిఐటియు నాయకులతో పోలీసులు వాగ్వాదం

నందిగామ: అంగన్వాడీ కార్యకర్తల ఉద్యమం నందిగామలో శనివారం ఉద్రిక్తకతకు దారి తీసింది. నందిగామ ఆర్డ్ఓ కార్యాలయం వద్ద నుండి నిరసన ప్రదర్శన తో రైతు పేట లక్ష్మీ ప్రసన్న థియేటర్ వద్ద జాతీయ రహదారిపై బైఠాయించి, అంగన్వాడీ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని రాస్తారోకో నిర్వహించారు. 65వ నెంబర్ జాతీయ రహదారి అంబారుపేట బైపాస్ రోడ్డు వద్దకు వెళ్లి ట్రాఫిక్కును ఆపడానికి అంగన్వాడీ కార్మికుల ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.

రోప్ వే ద్వారా అంగన్వాడీ కార్యకర్తలను ముందుకు సాగనివ్వకుండా తాడులు వేసి అడ్డుకున్నారు.పోలీసులకు, అంగన్వాడీ కార్మికుల మద్య తోపులాట జరిగింది. పెద్ద ఎత్తున మహిళలు రోప్ వేను దాటుకుంటూ పోలీసులను సైతం నెట్టకుంటూ నిరసన ప్రదర్శనలు చేశారు. సిఐ హనీష్, సిఐటియు నాయకులతో సిఐటియు జిల్లా కార్యదర్శి కట్టారపు గోపాల్ తో పోలీసులు వాగ్వివాదానికి దిగారు. నందిగామ కెఎంఆర్ హాస్పటల్ వరకు అంగన్వాడీ కార్యకర్తలు జాతీయ రహదారిపై పరుగులు పెట్టుకుంటూ ముందుకు సాగారు.

నాయకులు చెప్పినా కూడా అంగన్వాడీ కార్యకర్తలు ఏమాత్రం వినకుండా జాతీయ రహదారి ముట్టడించడానికి ముందుకు సాగడం జరిగింది. నందిగామ సిఐ హనీసు ఎస్ఐ పండు దొరలు అంగన్వాడీ కార్యకర్తలతో శాంతియుతంగా మాట్లాడి ఆందోళన విరమించాలని కోరారు ఎట్టకేలకు సిఐటి జిల్లా కార్యదర్శి కటారపు గోపాల్ అంగన్వాడి కార్యకర్తలతో మాట్లాడి ఉద్యమం విరమింప చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీ కార్యకర్తలకు ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ ప్రభుత్వం కంటే వెయ్యి రూపాయలు వేతనం అదనంగా పెంచుతామని ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మహిళా ప్రభుత్వం అని చెప్పుకుంటూ గొప్పలు చెబుతున్న ముఖ్యమంత్రి అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైనరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కోట కళ్యాణ్ కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి చనుమోలు సైదులు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు సయ్యద్ ఖాసిం,సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు లాల్మహమ్మద్ గౌస్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు గోపి నాయక్,జంగా దమోదర్ , ఈ కార్యక్రమంలో అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్ సీనియర్ నందిగామ ప్రాజెక్టు కార్యదర్శి కోల్లి సరళ ,వెంకట్రావమ్మ, మహాలక్ష్మి,వేణు, వాసవి ,సుజాత, వనిత ,మేరి ,పుల్లమ్మ, ఖాచ్యయిని, విజయ , తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE