– బిజెపి తెలంగాణ మహిళా మోర్చా అధ్యక్షురాలు మేకల శిల్పారెడ్డి గారి ఆధ్వర్యంలో సంబురాలు
– కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల పట్ల హర్షం
– బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి చిత్రపటానికి పాలాభిషేకం
హైదరాబాద్: దేశవ్యాప్తంగా సామాన్యులు, రైతులు, పేద, మధ్యతరగతి ప్రజలు, మహిళలు, యువతకు ప్రయోజనం చేకూర్చేలా కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు ప్రకటించిన సందర్భంగా బిజెపి తెలంగాణ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శ్రీమతి మేకల శిల్పారెడ్డి ఆధ్వర్యంలో, పార్టీ రాష్ట్ర కార్యాలయం ఎదుట ఘనంగా సంబురాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి, కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు , మహిళా మోర్చా కార్యకర్తలు, ఇతర నాయకులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జీఎస్టీ రేట్ల తగ్గింపు, ప్రక్రియల సంస్కరణల ద్వారా సామాన్యులు, రైతులు, ఎంఎస్ఎంఈలు, మధ్యతరగతి, మహిళలు, యువతకు నేరుగా ఆర్థిక ఉపశమనం కలిగే విధంగా తీసుకున్న నిర్ణయాలను బిజెపి తెలంగాణ రాష్ట్ర మహిళా మోర్చా ఘనంగా స్వాగతించింది.
జీఎస్టీ స్లాబ్లలో 12% మరియు 28% పన్నులను రద్దు చేయడం, అనేక నిత్యావసర వస్తువులపై పన్నును 5% లేదా జీరోకి తగ్గించడం వంటి నిర్ణయాల ద్వారా పేద, మధ్యతరగతి ప్రజలకు, మహిళలకు, యువతకు నేరుగా లాభం కల్పించడం లక్ష్యంగా ఉంది. పండుగల సీజన్ సమయంలో ఈ నిర్ణయాలు పేద కుటుంబాల జీవితంలో ఆర్థిక ఊరట కల్పిస్తాయి.
బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయం వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ప్రజల సంక్షేమం పట్ల నిబద్ధతను పార్టీ నాయకులు, కార్యకర్తలు వ్యక్తపరిచారు.