Suryaa.co.in

Telangana

ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటల్స్‌లో నిత్యం తనిఖీలు

-ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహా

హైదరాబాద్: ప్రభుత్వం నియమించిన టాస్క్‌ఫోర్స్ కమిటీలు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటల్స్‌లో నిత్యం తనిఖీలు జరపాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహా సంబంధిత అధికారులను ఆదేశించారు. తనిఖీల వివరాలను ప్రతి నెలా తనకు నివేదిక రూపంలో అందించాలని సూచించారు.
ఫుడ్ సెక్యూరిటీ అధికారులు ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటళ్లలోని డైట్ క్యాంటీన్లను తనిఖీ చేయాలని మంత్రి ఆదేశించారు.

ఆరోగ్యశాఖలోని అన్ని విభాగాల హెచ్‌వోడీలు నెలకు కనీసం రెండుసార్లు జిల్లాల్లోని హాస్పిటల్స్‌ను విజిట్ చేయాలని మంత్రి సూచించారు.
హాస్పిటల్ హెచ్‌ఆర్, అటెండెన్స్‌, ఎక్విప్‌మెంట్, మెడిసిన్, సానిటేషన్, డైట్ ఇతర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. ఈ మేరకు మంత్రి శనివారం సెక్రటేరియట్‌లోని తన చాంబర్‌‌లో అధికారులతో సమావేశం నిర్వహించారు.

హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తూ, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ వాణి, తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్‌కుమార్, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ రవిందర్ నాయక్, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వ దవాఖాన్లకు వచ్చే పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. అన్ని హాస్పిటళ్లలో అవసరమైన మెడిసిన్‌ అందుబాటులో ఉంచుకోవాలన్నారు.

LEAVE A RESPONSE