– బీజేపీ చీఫ్ స్పోక్స్ పర్సన్ వల్లూరు జయప్రకాష్
విజయవాడ: నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎల్లప్పుడూ పేదల సంక్షేమమే ధ్యేయంగా తీసుకుని ముందుకెళ్తోంది. తాజాగా జీఎస్టీ తగ్గింపు నిర్ణయం వల్ల ప్రతీ పేద, మధ్యతరగతి కుటుంబానికి నేరుగా లాభం చేకూరబోతోందని బీజేపీ చీఫ్ స్పోక్స్ పర్సన్ వల్లూరు జయప్రకాష్ అన్నారు. ఈ మేరకు ఆయన గురువారం విలేఖర్లతో మాట్లాడారు. దినసరి అవసరాల వస్తువులు, గృహ వినియోగ వస్తువులపై ధరలు తగ్గడం వల్ల జీవన వ్యయం గణనీయంగా తగ్గనుంది. పండుగల సమయంలో పేద కుటుంబాలకు ఇది నిజమైన బహుమతి అన్నారు.
కాంగ్రెస్ పాలనలో పెరిగిన ధరలు, పెరిగిన పన్నుల భారం వల్ల ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజలకు మోదీ గారి జీఎస్టీ సంస్కరణలు ఊరట కలిగిస్తున్నాయి. ఇది కేవలం ఆర్థిక ఉపశమనం మాత్రమే కాదు, పేదల అభ్యున్నతి పట్ల మోదీ ప్రభుత్వ నిబద్ధతకు నిలువుటద్దం లాంటిదన్నారు.
దసరా – బతుకమ్మ పండుగకు ముందే పేదలకు మోదీ గిఫ్ట్. పండుగలో పేద కుటుంబాలు కూడా సంతోషంగా కొనుగోలు చేయగలిగేలా..నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎల్లప్పుడూ పేదల సంక్షేమం కోసం కృషి చేస్తోంది. పేద కుటుంబాల రోజువారీ ఖర్చులు తగ్గించడమే లక్ష్యమన్నారు.