Home » ల్యాండ్ టైట్లింగ్ యాక్టు రద్దు.. పోలవరం, అమరావతిపై దృష్టి

ల్యాండ్ టైట్లింగ్ యాక్టు రద్దు.. పోలవరం, అమరావతిపై దృష్టి

• సామాజిక సంక్షేమానికి మారుపేరు తెలుగుదేశం
• ఎన్టీఆర్ భరోసా పేరుతో రేపు పెనుమాకలో స్వయంగా సీఎం చంద్రబాబు పెన్షన్లు పంపిణీ
• అధికారంలోకి వచ్చిన వెంటనే 5 హామీలపై చంద్రబాబు సంతకం.. అమల్లోకి పథకాలు
• నిరుద్యోగులకు మెగా డీఎస్సీ, స్కిల్ సెన్సెస్ తో ఉపాధి కల్పన
• వినతులతో టీడీపీ కేంద్ర కార్యాలయానికి పోటెత్తుతున్న జనం.. పరిష్కారానికి టోల్ ఫ్రీ నెంబర్
– పార్టీ ఆఫీసులపై దాడి చేసిన వారికి చట్టపరంగానే బుద్ధిచెబుతాం
• టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు

మంగళగిరి: సమాజిక సంక్షేమానికి టీడీపీ మారుపేరని.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు సీఎం చంద్రబాబు ఐదు సంతకాలు పెట్టారన్నారు. అందుకు అనుగుణంగానే చర్యలకు శ్రీకారం చుట్టారని తెలిపారు. మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. గత ప్రభుత్వం విధ్వంసానికి పాల్పడితే… చంద్రబాబు అభివృద్ధి సంక్షేమంతో ముందుకు వెళ్తున్నారని తెలిపారు.

పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. తెలుగు దేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షునిగా నన్ను నియమించిన జాతీయ అధ్యక్షులు మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ముందుగా నా కృతజ్ఞతలు తెలుపుతున్న. నా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అభినందనలు తెలిపిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు హెచ్ఆర్డీ మంత్రి నారా లోకేష్ కి, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుకి, మంత్రులు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, ఎంపీలందరికి నా కృతజ్ఞతలు. అలాగే యువనాయకత్వానికి, పార్టీ నేతలకు, కార్యకర్తలకు, శ్రేయోభిలాషులకు నాకృతజ్ఞతలు.

శాసన సభ ఎన్నికల్లో మెజార్టీ ఓట్లతో నన్ను రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలబెట్టిన నా గాజువాక ఓటరు దేవుళ్లకు నేను రుణపడి ఉంటా. టీడీపీ పార్టీ అంటే ఒక పవత్రిమైన ఆలోచనతో పెట్టిన పార్టి ఈ పార్టీలో ఉండటం అంటే గొప్పగా భావిస్తున్న. ఒక గోప్ప సంకల్పంతో అన్న ఎన్టీఆర్ పెట్టి పార్టీకి నేడు నేను రాష్ట్ర అధ్యక్ష పదవి చేపట్టడం గొప్ప బాధ్యతగా భావిస్తున్నా.

చంద్రబాబు ఎలక్షన్ కు ముందు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన వేంటనే అమలుచేస్తున్నారు. ఒకే విడతలో పింఛన్ రూ.1000 పెంచిన ముఖ్యమంత్రికి నా కృతజ్ఞతలు. మేని ఫెస్టో హామీ ప్రకారం చంద్రబాబు పింఛన్ రూ. 3000 ల నుండి 4 వేలకు ఒకే దఫా పెంచారు. ఏప్రిల్ నెల నుండి పెంచిన దానిని జత చేసి జులై 1న రూ.7 వేలు ఇవ్వడం దేశంలోనే రికార్డు. జగన్ ఖజానాను లూటీ చేసి రాష్ట్రాన్ని దివాళా తీయిస్తే… పేదల పెన్నిది చంద్రన్న వృద్ధులకు రూ.7 వేల పింఛన్ ఇస్తున్నారు. జగన్ విడతల వారి చేయడం వలన ఒక్కొక్క పింఛన్ దారునికి రూ. 32వేలు నష్టపోయారు.

రేపు మంగళగిరి నియోజకవర్గం పెనుమాక గ్రమంలో సీఎం చంద్రబాబు నేరుగా పింఛన్లు పంపిణీ చేయనున్నారు. అలాగే వారివారి నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు పింఛన్ల పంపిణీలో భాగస్వామ్యం కావాలి. శవ రాజకీయాల కోసం ఎన్నికల సమయంలో అవ్వాతాతలను ఎండల్లో తిప్పి34 మంది మరణాలకు కారణమయ్యాడు జగన్.

పేదలకు కడుపు నింపేందుకు అన్నక్యాంటీన్ ఏర్పాటు, నిరుద్యోగులకోసం మెగా డీఎస్సీ, పింఛన్ ల పెంపుపై చంద్రబాబు అధికారంలోకి వచచిన వెంటనే సంతకం పెట్టారు. పేదల ఆస్తులు కబ్జా కాకుండ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు. యువతకు ఉపాధి కల్పించేందుకు స్కిల్ సెన్సెప్ పై సంతకం పెట్టారు.

రివర్స్ టెండర్ పేరుతో పోలవరం పై వైసీపీ చేసిన విధ్వంసంలో రూ. 70 వేల కోట్లు నష్టపోయాం. పక్క రాష్ట్రల ప్రయోజనాలకోసం పోలవరాన్ని గోదాట్లో ముంచాడు జగన్ రెడ్డి. త్వరగా పోలవరాన్ని పూర్తి చేసి రాష్ట్రాన్ని సస్యశామలం చేస్తాం. అమరావతిని ఒక కులానికి అంటగట్టి విశాఖ రాజధాని పేరుతో దోచుకుని అమరావతిని నిర్వీర్యం చేశారు.

అమరావతి పూర్తి చేసి ప్రపంచంలో మేటైన రాజధానిగా తీర్చుదిద్దుతాం. విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తాం. అమరావతి ఒక కులానికి చెందిందికాదు ఎసీ, ఎస్టీలు, మైనార్టీలు అందరూ ఉన్నారు ఇక్కడ. మంత్రివర్గ విస్తర్ణలో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం టీడీపీకి బీసీల పట్ల చిత్తశుద్ధిని తెలియజేస్తుంది. అలాగే రాష్ట్ర డిజీపీ, టీటీడీ ఈఓ, సీఎం కార్యదర్శి బీసీలకు చెందిన వారే టీడీపీకి రాష్ట్ర అధ్యక్షుడిగా నన్ను నియమించారంటే బీసీలంటే చంద్రబాబకు ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవచ్చు.

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నన్ను నియమించినందుకు బీసీ వర్గానికి వన్నె తెచ్చేలా నేను ముందుకు వెళ్తా.. చంద్రబాబు నాయుడు నమ్మకాన్ని నిలబెడతా. సీఎంను కలిసేందుకు ఎక్కువ మంది ప్రజలు టీడీపీ కేంద్ర కార్యాలయానికి వస్తున్నారు. దీంతో సమస్యలపై వస్తున్న ప్రజలకు కాస్త ఇబ్బంది కలుగుతుంది కనుక వీరికి ఇబ్బంది కలుగకుండా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తున్నాం.

ఆ నెంబర్ కు కాల్ చేస్తే వారికి ప్రయార్టీ కల్పించి సీఎంను కలిచే ఏర్పాటు చేస్తాం. నెంబర్ 7306299999 కు కాల్ చేయాలి. 500 మంది గ్రివెన్స్ కు హాజరయ్యేలా ఉంటే ప్రజలకు ఇబ్బంది ఉండదు. స్థానికంగా మంత్రులు, ఎమ్మెల్యేల వద్ద పరిష్కారం కాని సమస్యలు ఉన్నప్పుడే టీడీపీ కేంద్ర కార్యాలయానికి వేస్తే మేలు. ఫోటోలు తీసుకోవడానికి వస్తున్న యువత, జనం వలన.. సమస్యలు కోసం వస్తున్న వారు కొందరు ఇబ్బంది పడుతున్నారు. అందుకే గ్రీవెన్స్ ను సక్రమంగా నిర్వహించేందుకు టోల్ నెంబర్ పెడుతున్నాం.

దురుద్దేశంతో టీడీపీ నేతలపై పెట్టిన కేసులను తొలగించేందుకు కృషి చేస్తున్న అదే నా ప్రధాన కర్తవ్యం. కొర్టుల్లో ఉన్న కేసులను సంవత్సరకాలంలో మాఫీ అయ్యేలా కృషి చేస్తా. కార్యకర్తలు సిద్ధాంతపరమైన ఆలోచనతో అధినాయకత్వం, యువనాయకత్వంపై నమ్మకంతో కూటమిని అధికారంలోకి తీసుకొచ్చారు. వారిపై ఉన్న కేసులను ప్రాధాన్యత పరంగా మూడు నెలలల్లో తీయించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఎవరైతే టీడీపీ కార్యాలయాలపై దాడి చేశారో.. చట్టాలు కాలరాశారో వారికి ప్రజాస్వామ్య బద్ధంగా బుద్ధి చెబుతాం

Leave a Reply