Suryaa.co.in

Telangana

మాదిగలపై మాలలను రెచ్చగొడుతున్న రేవంత్

– అనుకూలం అంటూనే వర్గీకరణకు రేవంత్ అడ్డుపుల్ల
– కాంగ్రెస్ వర్గీకరణకు అనుకూలంగా ఉంటే వివేక్ వ్యతిరేక సభ ఎలా పెడతారు?
– ఎమ్మెల్యే వివేక్ కుటుంబం డబ్బుందనే అహంకారం తో ఛానల్ ,పత్రిక ను అడ్డుపెట్టుకుని వర్గీకరణను ఆపాలని చూస్తోంది
– ఖర్గే ,కొప్పుల రాజు వర్గీకరణకు అడ్డు
– రేవంత్ మంత్రివర్గం లో మాదిగలకు చోటే లేదు
– ఎస్సీ వర్గీకరణకు అండగా నిలిచిన నేత కేసీఆర్
– ఫిబ్రవరి 10 లోగా ఎస్సీ వర్గీకరణను అమలు చేయకపోతే కార్యాచరణ
– మాజీ డిప్యూటీ సీఎం డాక్టర్ తాటికొండ రాజయ్య

హైదరాబాద్ సుప్రీంకోర్టు తీర్పు వచ్చి ఆరు నెలలు గడచిపోయింది. చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఎస్సీల వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇచ్చారు. తీర్పు వచ్చిన రోజే సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ ను అమలు చేస్తామని ప్రకటించారు. మాదిగల వల్లే తాను రాజకీయంగా ఎదిగానని ఆ రోజు రేవంత్ రెడ్డి చెప్పారు. ఏ వర్గం సహకరించుకున్నా మాదిగలు తనకు సహకరించారని రేవంత్ చెప్పుకొచ్చారు.

సీఎం రేవంత్ మాటలకు చేతలకు పొంతన లేదు. వంద రోజుల్లో వర్గీకరణ పూర్తి చేస్తామన్న మోడీ కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే , కొప్పుల రాజు వర్గీకరణకు అడ్డుపడుతున్నారు. వారిని కాదని వర్గీకరణ చేస్తే తన పదవి ఊడుతుందని రేవంత్ రెడ్డి భయపడుతున్నారు. పైకి మాదిగలకు మద్దతు ఇస్తూ తెరవెనక మాలలను రేవంత్ రెచ్చగొడుతున్నారు.

రేవంత్ రెడ్డి తీరు వల్ల మాదిగ బిడ్డలు ఉద్యోగ నియామకాల్లో నష్టపోయారు. ఆర్డినెన్స్ తీసుకొచ్చయినా నోటిఫికేషన్లలో ఏబీసీడీ వర్గీకరణ అమలు చేస్తామని రేవంత్ అసెంబ్లీ లో చెప్పి మాట తప్పారు. మొదట్నుంచి ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉన్నది బీ ఆర్ ఎస్ మాత్రమే. ఉద్యమంలోనూ ,తెలంగాణ రాష్ట్రం లోనూ ఎస్సీ వర్గీకరణకు అండగా నిలిచిన నేత కేసీఆర్. రెండు సార్లు వర్గీకరణ కు అనుకూలంగా అసెంబ్లీ లో కేసీఆర్ ప్రభుత్వం తీర్మానం చేసింది. రెండు సార్లు కేసీఆర్ నేతృత్వం లోని బీ ఆర్ ఎస్ బృందం మోడీ ని కలిసి, ఎస్సీ వర్గీకరణ ను అమలు చేయాలని కోరింది.

కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ కుటుంబం డబ్బుందనే అహంకారం తో ఛానల్ ,పత్రిక ను అడ్డుపెట్టుకుని వర్గీకరణను ఆపాలని చూస్తోంది. కాంగ్రెస్ వర్గీకరణకు అనుకూలంగా ఉంటే వివేక్ వ్యతిరేక సభ ఎలా పెడతారు? తెలంగాణ ఉద్యమం లో ఆటతో పాటతో ప్రజలను చైతన్య పరిచింది మాదిగ కళాకారులే. ఎస్సీ వర్గీకరణ ఎంత ఆలస్యం జరిగితే మాదిగ జాతి ఆంత నష్టపోతుంది.

భవిష్యత్ లో మరింత నష్టం జరగకుండా ఉండాలంటే వర్గీకరణ అమలు చేయాలి. కమిటీల పేరు తో కాలయాపన చేయడం కాంగ్రెస్ కు అలవాటే. రేవంత్ మంత్రివర్గం లో మాదిగలకు చోటే లేదు. నామినేటెడ్ పోస్టుల్లో కూడా మాదిగలకు అన్యాయం జరిగింది. ఫిబ్రవరి 10 లోగా ఎస్సీ వర్గీకరణను అమలు చేయకపోతే బీ ఆర్ ఎస్ తరపున కార్యాచరణ ప్రకటిస్తాం.

ప్రెస్ మీట్ లో ఎమ్మెల్యే విజయుడు , మాజీ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్  గువ్వల బాలరాజు ,చిరుమర్తి లింగయ్య ,డాక్టర్ మెతుకు ఆనంద్ ,సుంకే రవిశంకర్ ,పార్టీ నేతలు డాక్టర్ ఆర్ .ఎస్ .ప్రవీణ్ కుమార్ ,ఎర్రోళ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.

LEAVE A RESPONSE