– ఐటీడీఏ పీవోగా ప్రత్యేకంగా ఒక ఐఏఎస్ అధికారిని నియమించాలనిచెంచులు కోరడం తప్పా ?
– మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు
హైదరాబాద్: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నాగర్‌కర్నూలు పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డిని కలిసే ప్రయత్నం చేసిన చెంచు సోదరులను అరెస్టు చేయడాన్ని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. ఇదేనా ప్రజాస్వామ్యం, ఇదేనా మీ సోకాల్డ్ ప్రజాపాలన అని నిలదీశారు.
తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నాగర్‌కర్నూలు పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డిని కలిసే ప్రయత్నం చేసిన చెంచు సోదరులను అరెస్టు చేయడాన్ని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు.
నల్లమల అడవుల నుంచి వచ్చానని గొప్పలు చెప్పుకునే సీఎం రేవంత్ రెడ్డి, అడవి బిడ్డల సంక్షేమం పట్ల మీకు ఉన్న ప్రేమ ఇదేనా అని హరీశ్‌రావు ప్రశ్నించారు. తమ సంక్షేమం కోసం ఐటీడీఏ పీవోగా ప్రత్యేకంగా ఒక ఐఏఎస్ అధికారిని నియమించాలని వారు కోరడం తప్పా అని నిలదీశారు.
గత బీఆర్ఎస్ పాలనలో ఇచ్చిన పోడుపట్టా భూముల్లో సాగు చేసుకోనివ్వడం లేదనే విషయాన్ని మీకు తెలపాలని రావడమే వారు చేసిన తప్పా అని అడిగారు. తమ ఆరాధ్య దైవాల ద్వారా వచ్చే ఆదాయాన్ని తమ బాగు కోసమే ఖర్చు చేయాలని డిమాండ్ చేయడం వారి తప్పా అని ప్రశ్నించారు.
అక్రమంగా అరెస్టు చేసిన చెంచు ప్రతినిధులు మల్లికార్జున్, పద్మ గురువయ్యతోపాటు అమ్రాబాద్ పోలీసు స్టేషన్ లో నిర్బంధించిన చెంచులను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.