Suryaa.co.in

Andhra Pradesh Telangana

జూన్‌ 1 నుంచి థియేటర్లు బంద్

హైదరాబాద్‌/విజయవాడ: తెలుగు రాష్ట్రాల్లో జూన్‌ 1 నుంచి థియేటర్లు బంద్ చేయాలని సినీ ఎగ్జిబిటర్లు నిర్ణయించారు. రెంటల్‌ బేసిస్‌లో సినిమాలు ప్రదర్శించలేకపోవడంతో ఎగ్జిబిటర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు.

తమకు పర్సంటేజీ రూపంలో చెల్లిస్తేనే సినిమాలు ప్రదర్శిస్తామని ఎగ్జిబిటర్లు స్పష్టం చేశారు. తెలుగు ఫిలిం ఛాంబర్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశానికి నిర్మాతలు దిల్ రాజు, సురేశ్‌ బాబుతోపాటు 60 మంది ఎగ్జిబిటర్లు హాజరయ్యారు. చాలా రోజులుగా పర్సంటేజీలపై ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లకు మధ్య చర్చ నడుస్తోంది.

రెంటల్‌ పద్దతిలో సినిమాలు ప్రదర్శించడం సాధ్యం కాదని ఓ వైపు ఎగ్జిబిటర్లు అంటుండగా, మరోవైపు వారికి పర్సంటేజీలు ఇవ్వలేమని డిస్ట్రిబ్యూటర్లు అంటున్నారు. ఈ వ్యవహారం నిర్మాతలకు ఇబ్బందిగా మారుతోంది. ఈ క్రమంలో ఎగ్జిబిటర్ల జాయింట్ మీటింగ్‌లో పర్సంటేజీ, ప్రభుత్వ విధానాలపై చర్చించారు. నిర్మాతలకు ఇందుకు సంబంధించిన ఓ లేఖ రాయాలని సమావేశంలో తీర్మానించారు.

LEAVE A RESPONSE