Suryaa.co.in

Telangana

కాళోజీ సత్యవాది అయితే.. రేవంత్ రెడ్డి అసత్యవాది

– ఏం ఉద్దరించారని ఏడాది పాలన సంబరాలు?
– కాంగ్రెస్ జరపాల్సింది విశ్వాస ఘాతుక సభలు
– ఏ పథకాలకు కోత వేస్తున్నారో సీఎం రేవంత్ చెప్పాలి
– కేసీఆర్ ను తక్కువ చేసి చూపడం తప్ప రేవంత్ ప్రభుత్వానికి ఏదీ చేత కావడం లేదు
– శాసనమండలి ప్రతిపక్ష నేత ఎస్ .మధుసూధనా చారి ,సోమ భరత్ కుమార్ ,డాక్టర్ ఆంజనేయ గౌడ్ ,పల్లె రవికుమార్ ,ఆలకుంట హరి

హైదరాబాద్: వరంగల్ లో కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ సభ జరుపుకుంటోంది. కాళోజీ కళా మందిరాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించ బోతున్నారు. కాళోజీ సత్యవాది అయితే రేవంత్ రెడ్డి అసత్యవాది. రేవంత్ ఆ కళా మందిరము ప్రారంభిస్తే కాళోజి ఆత్మ ఘోషిస్తుంది. ఏడాది పాలన లో ఏం ఉద్దరించారని సంబరాలు జరుపుతున్నారు ? కాంగ్రెస్ జరపాల్సింది విశ్వాస ఘాతుక సభలు ,విద్వంస సభలు.

వరంగల్ రైతు డిక్లరేషన్ ను అమలు చేయని కాంగ్రెస్ కు వరంగల్ లో సభ పెట్టే హక్కు ఎక్కడిది? రైతు డిక్లరేషన్ లో ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా కాంగ్రెస్ విశ్వాస ఘాతుకానికి పాల్పడింది . రైతులను వంచించింది. రైతు రుణ మాఫీ అయిందా? పెంచిన రైతు భరోసా మొత్తం ఇచ్చారా ? కౌలు రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చారా? ఏ ఒక్క వర్గం కూడా ఈ ఏడాది పాలన లో సంతోషంగా లేదు.

పెట్టుకుంటే కాంగ్రెస్ విద్వేష సభలు పెట్టుకోవచ్చు. సీఎం రేవంత్ రెడ్డి ఈ ఏడాది కాలం లో విద్వేషం పెంచారే తప్ప ఏ ఒక్క మంచి పని చేయలేదు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి సీఎం వెళ్లి తెలంగాణ లో తమ పాలన చూసి కాంగ్రెస్ కు ఓట్లేయాలని అభ్యర్థిస్తున్నారు.

తెలంగాణ లో చేసిన మోసాలు మహారాష్ట్ర లో చేయాలని ప్రజలు కాంగ్రెస్ కు ఓట్లేయాలా లగ చర్ల ఘటన రాష్ట్రం లో ఉన్న అప్రకటిత ఎమర్జెన్సీ వాతావరణాన్ని మరొ సారి చాటింది. గ్యారంటీలు అమలయ్యాయని సీఎం రేవంత్ అసత్యాలు చెబుతుంటే నవ్వాలో ఏడవాలో తెలియడం లేదు.

సీఎం సీటు లో కూర్చుని రేవంత్ ఇంత పచ్చిగా అబద్దాలు ఆడుతారా ? ఏడాది కాలం లో ఒక్క ఇల్లయినా కట్టారా? మండలానికో ఇంటర్నేషనల్ స్కూల్ అన్నారు. ఏడాదికి అలాంటి 200 స్కూళ్లు కట్టాలి ..ఇప్పటి వరకు ఒక్కటి కట్టలేదు. ఐదు లక్షల విద్యా భరోసా కార్డు ప్రస్తావనే లేదు. ఆసరా ఫించన్లను నెలకు నాలుగు వేల రూపాయలకు పెంచుతామన్నారు. పెంచలేదు కదా ..ఉన్న పించను సరిగా ఇవ్వడం లేదు.

వృద్ధుల ఉసురు రేవంత్ కు కచ్చితంగా తగులుతుంది. నెలకు 30 వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తేనే బండి సాఫీగా నడుస్తుందని సీఎం అంటున్నారు. నెలకు పద్దెనిమిది వేల కోట్లే ఆదాయంగా వస్తుందని సీఎం చెబుతున్నారు. మరి ఏ పథకాలకు కోత వేస్తున్నారో సీఎం రేవంత్ చెప్పాలి. కేసీఆర్ ను తక్కువ చేసి చూపడం తప్ప రేవంత్ ప్రభుత్వానికి ఏదీ చేత కావడం లేదు. తెలంగాణ ప్రతిష్టను కేసీఆర్ హిమాలయాల ఎత్తు కు తీసుకెళ్లారు.

LEAVE A RESPONSE