– ఎకరాకు రూ.25 వేల బకాయిలు ఇచ్చే వరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలను రానివ్వవద్దు
– రైతులకు ఒక్కో ఎకరాకు రేవంత్ రెడ్డి రూ.25 వేలు బాకీ
– రైతుల ఉసురు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కు తగలక తప్పదు
– మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలు తప్పనిసరి పరిస్థితుల్లో ఓట్ల కోసం రైతు భరోసా పేరిట నాటకానికి తెరతీశారు. రేవంత్ రెడ్డి బజారు రౌడీ కన్నా హీనంగా మాట్లాడుతున్నారు. రైతు భరోసా స్థానిక సంస్థల స్టంట్ మాత్రమే. కేసీఆర్ హయాంలో రైతు భరోసా ఎలా వచ్చేదో, ఇప్పుడు ఎలా వస్తోందో రైతులు ఆలోచించుకోవాలి.
గ్రామాలు వల్లకాడు అయ్యాయి. కాంగ్రెస్ మంత్రులు, ప్రజాప్రతినిధులు ఏ మొహం పెట్టుకొని వెళ్తారు? అన్ని రకాలుగా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ ఓట్లు ఎలా అడుగుతుంది? స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే కాంగ్రెస్ నేతలను అడుగడుగునా నిలదీయాలి. ఎకరాకు రూ.25 వేల బకాయిలు ఇచ్చే వరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలను రానివ్వవద్దు.
కేసీఆర్ నాట్లకు… నాట్లకు మధ్య రైతుబంధు ఇచ్చే వారు. రేవంత్ రెడ్డి ఓట్లకు… ఓట్లకు మధ్య రైతు భరోసా ఇస్తున్నారు. రైతులకు ఒక్కో ఎకరాకు రేవంత్ రెడ్డి రూ.25 వేలు బాకీ ఉన్నారు. సర్పంచుల పాత బిల్లులకు తమకు సంబంధం లేదని సీఎం రేవంత్ రెడ్డి విడ్డూరంగా మాట్లాడారు.కేసీఆర్ ప్రాణాన్ని పణంగా పెట్టి తీసుకొచ్చిన తెలంగాణతో, ఆయన కట్టిన సచివాలయంతో రేవంత్ రెడ్డికి ఏం సంబంధం?
రేవంత్ రెడ్డి తెలంగాణ పాలకుడు కాదు. కాజాలరు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పేది శుద్ధ తప్పు. పంటల కొనుగోళ్లు విషయంలో రైతులు ఈసారి పడిన ఇబ్బందులు ఎప్పుడూ లేదు. పంటల కొనుగోళ్ల పేరిట కాంగ్రెస్ కార్యకర్తలు రైతుల నుంచి దోపిడీకి పాల్పడ్డారు.
కొనుగోలు కేంద్రాల నిర్వహణ పేరిట రూ.1500 కోట్ల దోపిడీకి కాంగ్రెస్ పాల్పడింది. అణువణువునా కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేస్తోంది. ఈ పంట కాలంలో రైతులకు ఒక్క క్వింటాలుకు కూడా బోనస్ ఇవ్వకుండా బోగస్ చేశారు. ధ్యానం టెండర్ల కుంభకోణంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కడుపు నిండా తినడంతో పాటు ఢిల్లీకి కూడా పంపారు.
హైకోర్టులో నేను పిల్ దాఖలు చేస్తే, ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకుండా తప్పించుకుంటోంది. తప్పు చేయకపోతే ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకుండా 16 వాయిదాలు ఎందుకు తీసుకొంది? రైతుల ఉసురు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కు తగలక తప్పదు
రేవంత్ అర్ధం లేకుండా మాట్లాడాడు : మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
రైతు భరోసా అంటే మొదటగా గుర్తొచ్చేది కేసీఆర్. నిన్న రేవంత్ రెడ్డి అర్ధం లేకుండా మాట్లాడాడు. మేనిఫెస్టోలో పెట్టకుండా రైతు భరోసా ఇచ్చిన ఘనత కేసీఆర్ కు దక్కుతుంది. మేనిఫెస్టో లో పెట్టీ హామీలు నెరవేర్చడం లేదు మీరు. గ్రామ పంచాయతీల్లో డీజిల్ కి డబ్బులు లేక ట్రాక్టర్లు అప్పచెప్తున్నారు. అనవసర కేసులు పెట్టడం కాదు ప్రభుత్వాన్ని ఎలా నడపాలి అనే దానిపై రేవంత్ రెడ్డి దృష్టి పెట్టాలి. ప్రెస్ మీట్ లో మాజీ ఎమ్మెల్యే హనుమంతు షిండే ,కార్పొరేషన్ మాజీ చైర్మన్లు కె .వాసుదేవ రెడ్డి ,గాంధీ నాయక్ పాల్గొన్నారు.