– మీ టీడీపీ నాయకుడే మహిళను చెట్టుకు కట్టేసి కొట్టడం దారుణం
– ఇది ప్రజాస్వామ్యమా లేక రెడ్ బుక్ రాజ్యాంగమా?
– మహిళను చెట్టుకు కట్టేసి కొట్టడం ఎక్కడైనా చూశామా?
– హోంమంత్రి కనీసం అక్కడికి వెళ్ళి పరామర్శించిందా?
– కుప్పం నియోజకవర్గంలో మహిళను చెట్టుకు కట్టేసిన టీడీపీ కార్యకర్త ఘటనపై మాజీ మంత్రి ఆర్ కే రోజా
నగరి: కుప్పంలో జరిగిన ఘటన బాధాకరం. చంద్రబాబు సొంత నియోజకవర్గంలో ఇలా జరుగుతుందంటే రాష్ట్రంలో మహిళా భద్రత ఎలా ఉందో అర్ధమవుతోంది
ఇది ప్రజాస్వామ్యమా లేక రెడ్ బుక్ రాజ్యాంగమా? ఏ రాష్ట్రంలోనైనా ఇలా జరుగుతుందా? ఒక మహిళను చెట్టుకు కట్టేసి కొట్టడం ఎక్కడైనా చూశామా?
హోంమంత్రి అనిత గారు చూస్తున్నారా? మాటలు మాత్రమేనా చేతలు లేవా?
చంద్రబాబు మహిళలపై అఘాయిత్యాలు చేస్తే ,వాళ్ళకు అదే చివరి రోజు అంటారు కదా మీ సొంత నియోజకవర్గంలో ఇలా జరిగితే ఇప్పుడేం సమాధానం చెబుతారు?
పవన్ కళ్యాణ్.. చూస్తున్నారా, మహిళా రక్షణ ఇదేనా? మీ టీడీపీ నాయకుడే మహిళను చెట్టుకు కట్టేసి కొట్టడం అత్యంత దారుణం. రాష్ట్రవ్యాప్తంగా అరాచకం సృష్టిస్తున్నారు. ఒక మహిళ హోంమంత్రిగా ఉన్న రాష్ట్రంలో ఇలా జరుగుతుంటే ఆమె కనీసం అక్కడికి వెళ్ళి పరామర్శించిందా?
అనిత మీరు సెల్‌ఫోన్ లో వీడియో కాల్ చేసి పరామర్శించడం ఏంటి, అంత బిజీగా ఉన్నారా, మహిళలను కాపాడలేని మీరు అంతకంటే బిజీగా ఉన్నారా, వీడియో కాల్ చేసి పరామర్శించడం ఎక్కడైనా ఉంటుందా? సీఎం, డిప్యూటీ సీఎం, హోంమంత్రి అందరి వైఫల్యం కాదా? మహిళల భద్రత గురించి అసలు ఏనాడైనా మీరు చర్చించారా, మీకెందుకు అంత చిన్నచూపు?
చంద్రబాబు, పవన్, లోకేష్, అనిత ఇప్పటికైనా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పక్కనపెట్టి ఆడబిడ్డలను కాపాడండి. తప్పుచేసిన వారిని కఠినంగా శిక్షించండి. జగన్ ని తిట్టడానికి, సాక్షిపై కేసులు పెట్టి వేధించడానికి టైం ఉన్న మీరు నేరస్తులను శిక్షించడంపై దృష్టి పెట్టండి.