Suryaa.co.in

Telangana

రేవంత్ రెడ్డి ద్వంద్వ విధానం బట్టబయలు

-మాజీ మంత్రి హరీష్ రావు ట్వీట్

హైదరాబాద్: పీఎం ఫసల్ బీమా యోజన పూర్తిగా విఫలమైందని, ప్రైవేట్ బీమా కంపెనీలకు లబ్ది చేకూర్చడానికే దాన్ని వాడుకుంటున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ జైరామ్ రమేశ్ విమర్శించారు.అయితే రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అదే పథకానికి రెడ్ కార్పెట్ పరిచి అమలు చేయడానికి రెడీగా ఉండడం గమనార్హం.

బీజేపీ అదానీకి దోచిపెడుతోందని రాహుల్ గాంధీ అంటున్నారు.రేవంత్ రెడ్డి ప్రభుత్వం అదానీతో వేల కోట్ల ఒప్పందాలు కుదుర్చుకుంటున్నది.ఏది వాస్తవమో కాంగ్రెస్ స్పష్టత ఇవ్వాలి. ఢిల్లీ కాంగ్రెస్ చెబుతున్నది నిజమా, తెలంగాణ గల్లీ కాంగ్రెస్ చెబుతున్నది నిజమా?

LEAVE A RESPONSE