Suryaa.co.in

Andhra Pradesh

విడదల రజని ఎమ్మెల్యే అయిన తర్వాత రోడ్డు రిజిస్ట్రేషన్

-మంత్రిగా ఉన్నారని బెదిరిస్తున్నారు
-ప్రయాణాలకు అడ్డంగా గోడ కట్టడానికి మీకు బుద్ధి ఉందా?
-మంత్రి అయిన వాళ్లు చేసే పనేనా ఇది?
-ఎవరికీ బెదిరేది లేదు
-నా సభ్యత్వం తొలగిస్తామన్నా బెదిరేది లేదు
-ప్రజల్లోకి వెళ్లి విడదల దుర్మార్గాలు బయటపెడతాం
-తర్వాత రోడ్డుకు అడ్డంగా గోడ కట్టేశారు
-ఆ రోడ్డు రెవిన్యూ రికార్డ్స్ లో రెడ్ మార్క్ గా వుంది
-వైఎస్ఆర్సిపి కౌన్సిలర్ జాలాది సుబ్బారావు
-చిలకలూరిపేటలో మంత్రి రజనిపై వైసీపీ కౌన్సిలర్ తిరుగుబాటు

ఆమె వైసీపీ ఎమ్మెల్యే కాకముందు వరకూ అక్కడ రోడ్డు ఉండేది. రోడ్డంటే అలాంటిలాంటి రోడ్డు కాదు. ఒక గ్రామానికి వెళ్లే రోడ్డది. కానీ ఆమె చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే అయిన తర్వాత, ఎంచక్కా రోడ్డు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారట. అదేంటి? ప్రభుత్వ రికార్డుల్లో అది రోడ్డుగా చూపిస్తున్నారు కదా అని ప్రశ్నించాల్సిన సబ్ రిజిస్ట్రార్ కూడా పరమానందంగా, మంత్రి గారు ముచ్చటపడ్డ ఆ రోడ్డును, ‘విడదల వారి కుటుంబానికి’ పువ్వుల్లో పెట్టి అప్పగించేశారట.

మరి అంత డబ్బు కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత గోడ కట్టకుండా ఉంటారా? యస్. అదే జరిగింది. అక్కడ చక్కగా రోడ్డుకు అడ్డంగా పెద్ద గోడనే కట్టేశారు. దానితో అటుగా వెళ్లే.. అంటే ఆ గ్రామం వైపు వాహనాలన్నీ మరో వైపు మళ్లుతున్నాయట. ఇదీ ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనీ పలుకుబడి. ఈ ఆరోపణలు చేసినవాళ్లేమీ టీడీపీనో, జనసేన నాయకులో అనుకుంటే కచ్చితంగా పప్పులో కాలేసినట్లే.. అచ్చంగా అధికార వైసీపీ కౌన్సిలర్ జాలాది సుబ్బారావు ప్రెస్‌మీట్ పెట్టి మరీ విప్పిన రోడ్డు కబ్జా కథ ఇది. వినితరించండి.

చిలకలూరిపేట : పట్టణంలోని వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ జాలాది సుబ్బారావు అడ్డ రోడ్డు సెంటర్లోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విడదల లక్ష్మి నారాయణ 18.05.2010 న సర్వే నెంబరు : 16/1 లో చిన్న పసుమర్రు గ్రామనికి చెందిన 73 సెంట్లు, రిజిస్ట్రేషన్ దస్తావేజు ద్వారా కట్టా బుచ్చయ్య వద్ద కొనుగోలు చేసినాడు. దానికి దక్షిణం హద్దుగా దస్తావేజులో రోడ్డు అని వ్రాయబడినది.

కట్టా బుచ్చయ్య 16.02.2010 లో కొనుగోలు చేసినప్పుడు, తూబాటి సుబ్బారావు – సుబ్బారెడ్డి ద్వారా కొనుగోలు చేసిన దస్తావేజులో దక్షణం హద్దు రోడ్డుగా చూపించినారు. విడదల లక్ష్మి నారాయణ మరలా 02.07.2010న మరికొంత ఆస్తిని వారి వద్ద నుండి కొనుగోలు చేయడం జరిగినది. ఆ రెండవ దస్తావేజులో కూడా దక్షిణం రోడ్డుగానే ఉన్నది. విడదల లక్ష్మీ నారాయణ ది: 06.04.2011 న తన యొక్క ఆస్తిని, విడదల సుశీల పేరు మీద మార్పు చేయడము జరిగినది. ఆ దస్తావేజులో కూడా దక్షిణం హద్దు రోడ్డుగానే చూపించినారు.

ది 05.09.2019 న సర్వే నెంబరు : 16/1 లో మొత్తము విస్తీర్ణం 150 సెంట్లు, దాంట్లో 73 సెంట్లు విడదల లక్ష్మీ నారాయణ కొనుగోలు చేశారు. మిగతా భూమి 77 సెంట్లు రెవిన్యూ రికార్డ్స్ ప్రకారము రెడ్ మార్క్ గా నమోదు చేయబడినది. ఆ 7 సెంట్లే రోడ్డు. ఆ రోడ్డు రెవిన్యూ రికార్డ్స్ లో రెడ్ మార్క్ గా వుంది. కాబట్టి రిజిస్ట్రేషన్ జరగదు. కాబట్టి సర్వే నెంబరు: 16/1 లో నిషేదము వుంటే దానిని సర్వే నెం 16/1ఎ ఉన్నట్లు చూపించిది: 05.09.2019 న పూర్వము ఈ భూమి కంతేటి పద్మావతి వాళ్ళదని చెప్పి, వాళ్ళ దగ్గర నుండి ది: 05.09.2019 న విడదల లక్ష్మి నారాయణ రోడ్డుగా వదిలి పెట్టిన భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.
మరలా ఇది విడదల లక్ష్మి నారాయణ ది: 25.01.2021 న రోడ్డుని తన ద్వితీయ కుమారుడు అయిన విడదల రామ చంద్ర ప్రసాద్ పేరు మీదకు రిజిస్ట్రేషన్ దస్తావేజు ద్వారా ట్రాన్స్ఫర్ చేసినాడు. ఇక్కడ గమనించవలసిన అంశము.. విడదల లక్ష్మి నారాయణ 2010 లో కొన్నప్పుడు దేనినయితే రోడ్డుగా చూపించాడో, ఆ రోడ్డునే 2019 సెప్టెంబరు మాసములో తన కోడలు విడదల రజని చిలకలూరిపేట నియోజక వర్గానికి యం.యల్.య.గా ఎన్నికైన తర్వాత, నిషేదిత జాబితాలో ఉన్నప్పటికి దానిని సబ్ డివిజన్ చేయించి రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగినది.

2021 లో తన కొడుకైన రామ చంద్ర ప్రసాద్ కు ట్రాన్స్ఫర్ చేసిన తరువాత , 2022 లో ఈ రోడ్డుకు అడ్డంగా గోడ నిర్మాణము చేసి, రాకపోకలు లేకుండా అడ్డంకులు కల్పించినారు. దీనికి పూర్వము 100 సంవత్సరములు పైబడి , అ నేషనల్ హైవే కి తూర్పు వైపున ఉన్నటువంటి ఈ రోడ్డు ద్వారా, పసుమర్రు గ్రామనికి రాకపోకలు జరుగుచున్నాయి. 2005 – 2006 సంవత్సరములో పసుమర్రు బ్రిడ్జి నిర్మాణములో వుండగా, చిలకలూరిపేటకు రాకపోకలకు ఇబ్బందులు కలుగుట వలన.. ప్రభుత్వ నిధులతో సుమారు 30 లక్షలు వెచ్చించి బ్రిడ్జి నిర్మాణము పూర్తి అయ్యే వరకు, చిలకలూరిపేట నుండి చీరాల వరకు పొయే వచ్చేపోయే వాహనాలు బస్సులు, లారీలు, ట్రాక్టర్లు అన్నీ కూడా ఈ రోడ్డు నుండి ప్రయాణము చేయడము జరిగినది.

రోడ్డు అని తెలిసి తను కొనుక్కున దస్తావేజులోనే రోడ్డుగా చూపించి, అదే రోడ్డుని తన కోడలు యం.యల్.ఏ. గా అయిన తరువత రోడ్డుని రిజిస్ట్రేషన్ చేపించుకొని రోడ్డుకు అడ్డముగ గోడ కట్టడము.. అదేమని అడిగితే మేము కొనుగోలు చేశామని చెప్పి బుకాయించడం, దీనికి ఒకాయన మేము 15 సంవత్సరముల క్రితము గోడ కట్టుకొనియున్నాము, ఇంకో అతను అవగాన లేకుండా, తెలుసుకోకుండా మాట్లాడిన వారి విజ్ఞతకు వదిలివస్తాము.

ప్రజా జీవితములో ఉన్న వారు ఎవరైనా రోడ్డు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే అభ్యంతరము చెప్పి.. ఆ రోడ్డును కాపాడవలసిన వారు.. ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడవలసిన భాధ్యతాయుతమైన పదవులో ఉన్నవంటి వారు.. రోడ్లు రిజిస్ట్రేషన్ చేయించుకోవడం, ఇంతకంటే ఏమైన దుర్మార్గము ఉందా? ప్రజలే ఆలోచించుకోవాలి. 100 సంవత్సరముల నుండి రాకపోకలు చేస్తున్న రోడ్లను మీరు అధికారములో లేకపోతే, మీరు యం.యల్.ఎ. కాకపోతే రిజిస్ట్రేషన్ చేసుకునేవాళ్ళా? రోడ్డు అడ్డంగా గోడ కట్టివాళ్ళా?

2.6 కిలో మీటర్లు నేషనల్ హైవే నుండి పసుమర్రు వరకు ఉన్న రోడ్డులో పసుమర్లు నుండి వీళ్ళు కట్టినంటి గోడ వరకు వచ్చి అగిపోయినది. అంటే అది చూసివాళ్ళు రోడ్డుకి గోడ కట్టినారని ఎవరైనా చెప్పగలరు. పదవిలో ఉన్నామని 10 మందిని పోగేసి మాట్లాడితే అబద్దాలు నిజాలు కావు. మీ దస్తావేజులోనే దక్షిణము వైపున రోడ్డు అని ఉంది అని రుజువు చేయుటకు, దానికి ఏ సాక్ష్యము ఆధారాలు. అవసరము లేదు. దస్తావేజులు చాలు.

విడదల లక్ష్మి నారాయణ కి 2010 లో అమ్మినవారి దస్తావేజులు చూడండి. దానికి దక్షిణము ఏముంటుందో చూడండి . ఎవరి పిలుస్తే వాళ్ళ తరుపున మాట్లాడేటప్పుడు మీ పరువు ఏమైపోతుంది ఒక్కసారి ఆలోచించుకోండి? గోడ ఎప్పుడు కట్టారో మీకు తెలియదా? తప్పు ఎవరైనా చేస్తే సరిదిద్దవలసిన పదవులో ఉన్న మీరే తప్పు చేయడము, రోడ్డు రిజిస్ట్రేషన్ చేపించుకోవడము, గోడ కట్టడం, దానికి మీరు తానాతందాన అనడము.. మిమ్ములను చూసి జాలిపడుతున్నాము.

ఆ రోడ్డులో వ్యాపార సంస్థలు వచ్చినవి, చాలా మంది ఇల్లు నిర్మించు కున్నారు. రాకపోకలకు చీరాల నుండి మద్దూరు వైపుకు.. మేదరమెట్ల వైపునకు వెళ్ళుటకు మంచి రహదాని ఉన్నది. కాబట్టి దీని మీద తప్పని సరిగ్గా పోరాటము చేస్తాము, చర్యలు తీసుకుంటాము. ఉన్నది వాస్తవము మాట్లాడితే మంత్రి మామ- మంత్రి అండతో రోడ్డు రిజిస్ట్రేషన్చేయిస్తాం . నా సభ్యతము రద్దు చేస్తామని మాట్లాడుతున్నారు.

మీకు చేతనైనది చేసుకోండి. రోడ్డు రిజిస్ట్రేషన్ చేయించుకుని తప్పు చేస్తే చూస్తూ ఊరుకోము, మిడిమిడి జ్ఞానం తో మాట్లాడిన ఆర్.కె. కి చెబుతున్నా.. వాస్తవాలు తెలుసుకోని మాట్లాడు. 2006 లో 25 లక్షలు పెట్టి రోడ్డు వేస్తే .. ట్రాఫిక్ అంతా 2021 వరకు ఆ రోడ్డు గుండా ట్రాఫిక్ అంతా వెళ్ళితే, 15 సంవతరముల క్రితము గోడ కట్టారని చెబు తున్నారు, నీ అంత అజ్ఞాని ఎవరు వుండరు. దీనిని ప్రజల దృష్టికి తీసుకొని వెళ్తాము. మీరు చేసిన దుర్మార్గాలు ఎండగడతాము, గ్రామ ప్రజల తరఫున పోరాడుతాము.

LEAVE A RESPONSE