Suryaa.co.in

Andhra Pradesh

కేంద్రం సొమ్ముతో జగన్ సర్కారు సోకు

-ఆంధ్రా అభివృద్ధి అంతా మోదీ పుణ్యమే
-రోడ్లకు నయాపైసా ఇవ్వని జగన్ సర్కారు
-కేంద్రం డబ్బులిస్తే జగన్ స్టిక్కర్లు వేసుకుంటున్నారు
-వేల గ్రామాల్లో గాంవ్ ఛలో కార్యక్రమం
-వైసీపీ సర్కార్ పై నిప్పులు చెరిగిన బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి

పామర్రు నియోజక వర్గం: పల్లెకు పోదాం కార్యక్రమాన్ని పామర్రు నియోజకవర్గం నుండి బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా పల్లెకుపోదాం కార్యక్రమం విజయవంతంగా ప్రారంభమైంది. కృష్ణా జిల్లా నిమ్మకూరు నుండి పురందేశ్వరి ప్రారంభించారు. నిమ్మకూరు గ్రామస్తులు తో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ముచ్చటించారు

కోసూరు గ్రామం లో పంటపొలాల్లో ఉన్న రైతులు తో సంభాషించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి వారి సమస్యలు అడిగి తెలుసుకున్న తరువాత,కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం రైతు ల కు పురంధేశ్వరి స్వయంగా వివరించారు.

పల్లెకు పోదాం కార్యక్రమం లో భాగంగా కోసూరు లో గ్రామస్తులు కు కరపత్రాలు పంపిణీ చేసిన బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఈ సందర్భంగా రాష్ట్రం అభివృద్ధిలో కేంద్రం ప్రభుత్వం ఇస్తున్న నిధులు గురించి వివరించారు.

కోసూరు గ్రామం లో రామాలయంలో దర్శనం అనంతరం, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి న బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి మన్యం వీరుడ్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు

వైసీపీ సర్కార్ యువతకు ఉపాధి లేకుండా చేసిందని తీవ్రస్వరంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.రాష్ట్రంలో విధ్వంసకర, విద్వేషపూరిత, కక్షపూరిత పరిపాలన సాగుతున్నడంతో… ఒక పెట్టుబడి కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. ఈ తరుణంలో ఇక్కడ పిల్లలకు ఉపాధి లేకుండా పోయిందన్నారు. రాష్ట్రంలో, గ్రామాల్లో అంతర్గత రహదారులు బాగుండలేదని, కేంద్ర ప్రభుత్వం నిర్మించిన రహదారులు మాత్రమే సవ్యంగా, బ్రహ్మాండంగా ఉన్నాయన్నారు.

కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి గ్రామాల అభివృద్ధికి ఇచ్చిన నిధులు పక్కదారి పట్టించిందని విమర్శించారు.రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో కనీసం రోడ్ల నిర్మాణం కూడా చేయలేని దుస్థితిలో ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు టిడ్కో ఇల్లు ఇవ్వకుండా రాష్ట్రాన్ని రాష్ట్రంలో ఉన్న ప్రజలను మోసం చేసింది అన్నారు. నిరుద్యోగులు కూడా ప్రభుత్వం మోసం చేసింది అన్నారు.

రాష్ట్రంలో ఆక్వారైతులను కూడా మభ్యపెట్టి విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని చెప్పి మోసం చేసిన విషయాన్ని గుర్తు చేశారు . మద్యపాన నిషేధం అని చెప్పి… నేడు అధిక రేట్లకు మద్యాన్ని పారిస్తున్నారన్నారు. మెగా డిఎస్సీ ప్రతి సంవత్సరం ప్రకటిస్తామని , ఎలక్షన్ కు ముందు ఈ విషయాన్ని తీసుకువచ్చారన్నారు. గడిచిన నాలుగేళ్లలో ఒక డీఎస్సీ పోస్ట్ కూడా విడుదల చేయకుండా, నిరుద్యోగులను మోసం చేసిన విషయాన్ని యువత గుర్తిస్తున్నారు. ఎలక్షన్ దగ్గరికి వస్తున్న తరుణంలో 6 వేల టీచర్ల పోస్టులు భర్తీ చేస్తామని మభ్యపెడుతున్నారు.

మా తండ్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు ప్రతి పేదవానికి సొంత ఇల్లు ఉండాలని ఎంత ఉంది పేదలకు పక్కా ఇల్లు నిర్మించారన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులు రూ.550 కోట్లతో మచిలీపట్నంలో మెడికల్ కళాశాల నిర్మాణానికి మంజూరు చేసిందని చెప్పారు. మచిలీపట్నంలో హార్బర్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 500 కోట్లు నిధులు మంజూరు చేసిన విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం పామర్రు నియోజకవర్గంలో జల జీవన్ మెషిన్ కింద 29, 220 మంచినీటి కు ళాయి కనెక్షన్లు ఇచ్చిందన్నారు. గుడివాడ – మచిలీపట్నం 36 కి.మీలకు రూ.150 కోట్లు మంజూరు చేసిందన్నారు

మచిలీపట్నం టౌన్ నుంచి – మచిలీపట్నం పోర్టు వరకు 25 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి నిధులు మంజూరు చేసిందని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ ఒక ఏడాది క్రితం దేశంలో 10 లక్షల మందికి ఉపాధి కల్పిస్తానని చెప్పి.. ఎనిమిది లక్షల మందికి ఉపాధి కల్పించారు అన్నారు.

కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మట్టా ప్రసాద్, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురుపాటి కుమార స్వామి, మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ జిల్లా బిజెపి అధ్యక్షుడు రాజబాబు, జిల్లా కార్యదర్శి గాజుల సిద్దార్ధ కుమార్ పామర్రు నియోజకవర్గ కన్వీనర్ పొట్లూరు కృష్ణ బాబు తదితరులు పాల్గొన్నారు

LEAVE A RESPONSE