– అటువంటి చీప్ ట్రిక్స్ జగన్ చేయరు
– అమరావతిలో ఈ గజదొంగ ప్రతి గజాన్ని దోచేశాడు
– బాబు కడిగిన ముత్యం కాదు.. అవినీతి అనకొండ
– స్కిల్ స్కాంలో లోకేశ్, అచ్చెన్నాయుడుల పాత్ర కూడా ఉంది
– మంత్రి ఆర్కే రోజా
సాక్ష్యాధారాలతో దొరికిపోయిన చంద్రబాబునాయుడును అరెస్ట్‌చేసి రిమాండ్‌కు పంపడాన్ని రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా స్వాగతిస్తున్నారు.న్యాయ దేవత- న్యాయవ్యవస్థపై నమ్మకం పెరిగేలా చేసింది. స్కిల్ అవినీతి కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబును రిమాండ్‌కు పంపిన న్యాయదేవత- ఈ దేశానికి, రాష్ట్రానికి, ముఖ్యంగా భావితరాలకు ఒక గొప్ప సందేశాన్ని అందించింది.
చంద్రబాబును(ఖైదీ నంబర్ 7691) జైలుకు పంపి పోలీసు, న్యాయ వ్యవస్థలు గర్వంగా తలెత్తుకుని తిరుగుతున్నాయి.
ఇది ప్రజాస్వామ్య విజయం.. ఇది రాజ్యాంగం సాధించిన విజయం. రాష్ట్ర చరిత్రలో అతి పెద్ద కుంభకోణం స్కిల్ డెవలెప్‌మెంట్ స్కాం. దీనిలో రూ.241 కోట్లు కొల్లగొట్టి పక్కాగా దొరికి అరెస్టయిన కేసు ఇది. చంద్రబాబును అరెస్ట్ చేసి జైలుకు పంపితే.. ఎంతోకాలంగా తప్పించుకుతిరుగుతున్న దొంగ ఎట్టకేలకు దొరికాడు అని ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు.
కానీ..టీడీపీ వారు, దత్తపుత్రుడు, ఉత్త పుత్రుడు, అనుబంధ సంస్థలు, పచ్చ చానళ్లు మాత్రం గగ్గోలు పెడుతున్నారు.ఇలాంటి సందర్భంలో ప్రజలు చాలా విజ్ఞతగా వ్యవహరించడాన్ని మనస్ఫూర్తిగా అభినందింస్తున్నాను.నేను నిప్పు.. నా అంత నిజాయితీపరుడు లేడంటూ తన పచ్చ మీడియాతో ఇంతకాలం ఏ విధంగా డబ్బాలు కొట్టించుకున్నాడు.. ప్రజల్ని ఏవిధంగా మభ్యపెట్టడానికి ప్రయత్నించాడో ప్రజలంతా చూస్తూనే ఉన్నారు.
చంద్రబాబు- ఎప్పుడూ తాను టెక్నికల్ గా దొరకను.. తనను ఎవరూ ఏమీ పీకలేరు..టచ్ చేయలేరు అని చెప్తుంటాడు.రాత్రుల్లో వారి వీరి కాళ్లు పట్టుకోవడం, వ్యవస్థలను మేనేజ్ చేసుకోవడం, స్టేలు తెచ్చుకోవడం వల్ల తాను చేసిన అవినీతి కేసుల్లో తప్పించుకుంటూనే వస్తున్నాడు. కానీ ఈ రోజు రాష్ట్రంలో నిజాయితీగా పనిచేస్తున్న జగన్ ప్రభుత్వంలో అది కుదరలేదు.
కక్షసాధింపు అంటే సోనియా గాంధీ కాళ్లు పట్టుకుని తెల్లపేపర్‌పై సంతకం పెట్టకుండా ఫిర్యాదు ఇచ్చి, జగన్ గారిని 16 నెలలు జైళ్లో పెట్టించడం కక్షసాధింపు అంటే. అలా ఈ కేసులో ఎక్కడైనా జరిగిందా..? ఈ కేసులో సీఐడీకి విచారణచేయడానికి స్వేచ్ఛనిచ్చాం.
వాళ్లు సాక్షాధారాలతో అరెస్ట్ చేశారు..ఇందులో కక్షసాధింపు ఎక్కడుంది? నిన్న సినిమాలో హీరోలా చంద్రబాబు తన కేసులో తానే వాదించుకున్నాడట. గంట సేపు జనాలకు చెప్పే సోదే చెప్పాడు తప్ప తాను తప్పు చేయలేదని, స్కిల్ లో స్కాం లేదని మాత్రం చెప్పలేదు.