– ఉపాధి హామీ కింద మెటీరియల్ కాంపోనెంట్
– విడుదల చేసిన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ
గుంటూరు : గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ చూపిన చొరవ ఫలితాన్నిచ్చింది. ఉపాధి హామీ పనుల కింద ఏపీకి రూ. 665 కోట్లు విలువైన మెటీరియల్ కాంపోనెంట్ ను కేంద్ర ప్రభుత్వం ద్వారా బుధవారం మంజూరు అయింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మెటీరియల్ కాంపోనెంట్‌కు సంబంధించి కేంద్రం ఈ రూ. 665 కోట్ల నిధులను విడుదల చేశారు.
ఈ నిధులు రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టే పనుల మెటీరియల్ ఖర్చులకు ఉపయోగపడనున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఉపాధి హామీ పథకం కింద జరుగుతున్న పనులలో భాగంగా అవసరమైన మెటీరియల్ నిమిత్తం ఈ కాంపోనెంటును గ్రామీణాభివృద్ధి శాఖ కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విడుదల చేశారు. ఏడాదిన్నర కాలంగా ఏపీలో ఉపాధి హామీ పథకం కింద పనులు చేయించిన వ్యక్తులకు ఈ మెటీరియల్ కాంపోనెంట్ విడుదల దోహదపడుతుంది.
ఇందుకు సహకరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ కి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కి ఈ సందర్భంగా పెమ్మసాని ధన్యవాదాలు తెలిపారు.