కాంగ్రెస్ నేతల పట్ల ఆర్ఎస్ఎస్ విశ్వాసం

1946 నవంబర్లో గురూజీ పంజాబ్ లో పర్యటించినప్పుడు అక్కడి జిల్లా సంఘచాలక్ డాక్టర్ బలదేవ్ బర్మన్ “పాకిస్తాన్ ఏర్పాటు గురించి చర్చి బాగా జరుగుతుంది నిజంగానే దేశ విభజన జరుగుతుందా ? “అంటూ ప్రశ్నించారు. అప్పుడు గురూజీ “నాకు మహాత్మా గాంధీ పట్ల పూర్తి విశ్వాసం ఉంది ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ పాకిస్తాన్ ఏర్పాటు ప్రతిపాదనను అంగీకరించరు. ముస్లింలను సంతోష పెట్టేందుకు ఆయన జిన్నా డిమాండ్లు చాలా మటుకు అంగీకరించవచ్చును. కానీ దేశ విభజనను మాత్రం ఆయన ఒప్పుకోరు” అని అన్నారు గాంధీజీ పట్ల గురూజీకి అంతటి గౌరవం విశ్వాసం ఉండేవి.

కాంగ్రెస్ కు పూర్తి సహకారం
ఆ సమయంలోనే నెహ్రు సింధులోని హైదరాబాద్ పర్యటించారు. నెహ్రూ సభలను అడ్డుకొని హెచ్చరిక జారీ చేయాలని ముస్లిం లీగ్ భావించింది. పాకిస్తాన్ ఏర్పాటు ప్రతిపాదనను నెహ్రూ తప్పక వ్యతిరేకిస్తారని లీగ్ అనుకుంది. అందుకనే ఆయన సభలు అడ్డుకోవాలని నిర్ణయించుకుంది. లీగ్ ఆలోచన తెలుసుకున్న స్థానిక కాంగ్రెస్ నాయకులకు ఆందోళన కలిగింది. వారి ఇద్దరూ సీనియర్ నాయకులు చిమంన్ దాస్ జి. బాబా కిషన్ జి లు నగర సంఘ్ చాలాక్ హెత్ చంద్జీని కలిసి సభ సజావుగా జరిగేందుకు సహాయం అందించవలసిందిగా కోరారు. వారి అభ్యర్థనను సంఘ చాలాక్ పెద్ద మనసుతో అంగీకరించారు .అనేకమంది స్వయం సేవకులు ఆ సభకు హాజరయ్యారు . కాంగ్రెస్ సభలో స్వయంసేవకులను చూసేసరికి లీగ్ గుండాలకు దిక్కుతోచలేదు. పిల్లిని చూసిన ఎలుకల్లా వణికిపోయారు దానితో సభ ఎలాంటి అవాంతరాలు ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా సాగింది.

అమృతసర్ లో జరిగిన దాడిలో స్థానిక కాంగ్రెస్ నాయకుడు రాధాకృష్ణ సేథ్ ఇల్లు తగలబడిపోయింది. అందులో చిక్కుకున్న ఆయన నలుగురు కుమార్తెలను సంఘ స్వయంసేవకులే కాపాడి సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఇంటిని ముస్లింలు గుండాలు చుట్టుముట్టారు. రాధాకృష్ణ ఇతర కుటుంబ సభ్యులు సురక్షితంగా బయటపడినా నలుగురు ఆడపిల్లలు మాత్రం మంటల్లో చిక్కుకున్నారు.

ఆ తరువాత ఈ సంఘటన గురించి నెహ్రూ కు వివరించిన రాధాకృష్ణ సంఘం అల్లరి చిల్లరిగా తిరిగే యువకుల గుంపు కాదు. దేశాన్ని రక్షించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండే దేశభక్తులైన యువకుల సంస్థ అంటూ ప్రశంసించారు. హిందువులంతా అఖండ భారత్ నే కోరుకున్నారు. జిన్నా ప్రత్యక్ష చర్య తరువాత కూడా హిందువులు ఎవరూ దేశ విభజనను అంగీకరించలేదు. కమ్యూనిస్టు పార్టీ మాత్రమే విభజనకు మద్దతు తెలిపి లీగ్ ను సమర్థించింది. బ్రిటిష్ పాలకులు కూడా విభజనకే ప్రణాళికలు వేశారని రంగ హరి వివరించారు.

రాజకీయ ఒప్పందం ప్రకారం 1946 సెప్టెంబర్ లో కాంగ్రెస్ లీగ్ ల ఉమ్మడి ప్రభుత్వం ఢిల్లీలో ఏర్పాటు అయింది.కేంద్ర అసెంబ్లీ( ఇప్పుడు పార్లమెంట్ అంటున్నాం) సమావేశమైంది .కానీ సభ సజావుగా సాగకుండా లీగ్ మొదటి రోజు నుంచే గొడవ ప్రారంభించింది .మొదటి రోజున లీగ్ గుండాలు సభ లోపల బయట గొడవకు దిగారు. లీగ్ అరాచక వ్యవహారం మరోసారి బయటపడింది.

రెండవ రోజు కూడా అదే ధోరణి కొనసాగింది .దీనితో ఢిల్లీ కాంగ్రెస్ నాయకుడు లాలా దేశ బంధు సంఘ కార్యాలానికి వచ్చి ప్రాంత ప్రచారక్ వసంతరావు ఓక్ ను కలిశారు .ఆ తరువాత వందలాది స్వయం సేవకులు అసెంబ్లీ చుట్టూ పక్కల నిలబడి ముస్లింల గుండాలకు సరైన సమాధానం చెప్పారు. తమ పప్పులు వుడకవని గ్రహించిన గూండాలు తోక ముడిచారు. సభ సజావుగా సాగింది. అయినా 1947 జూన్ మూడున దేశ విభజన ప్రకటన వెలువడింది.

ఈ సంఘటనలను బట్టి ఆర్ఎస్ఎస్ ఎప్పుడూ కాంగ్రెస్ తో పోటీ పడటం కానీ శత్రుత్వం వహించడం గాని చేయలేదని స్పష్టమవుతుంది.దేశ స్వాతంత్ర పోరాటంలో అన్ని వర్గాలు ఆలోచన ధోరణులకు కాంగ్రెస్ ప్రాతినిధ్యం,నేతృత్వం వహించింది అని సంఘం భావించింది. కనుకనే ఆ పోరాటానికి పూర్తి మద్దతునిచ్చింది.
( స్వరాజ్య సాధనలో ఆర్ఎస్ఎస్ అనే పుస్తకం ఆధారంగా)

– కరణం భాస్కర్
బిజెపి రాష్ట్ర నాయకులు ,
మొబైల్ నెంబర్ 7386128877

Leave a Reply