– తప్పుడు కేసులు బనాయించి నందిగామ సబ్ జైలులో ఉన్న టీడీపీ నేతలను పరామర్శించిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గారు మరియు మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య
నందిగామ: ఐపీఎస్ అధికారులకు తాడేపల్లి కొంప నుండి డిఫ్యాక్టో మినిష్టర్, సకల శాఖామంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి తప్పుడు కేసులు, తప్పుడు సెక్షన్లు పెడుతున్నాడు. సామాన్య మహిళల నుంచి చంద్రబాబు నాయుడు కుటుంబం వరకు కించపరుస్తూ వైసీపీ పేటీఎం బ్యాచ్ అసభ్యకర పోస్టులు పెడుతున్నారు.
వైసీపీ సోషల్ మీడియాకు ఇన్ఛార్జిగా సజ్జల కొడుకు భార్గవ్ రెడ్డి అనే సన్నాసి వచ్చాడు. తాడేపల్లి కొంపలో ఉండి సజ్జల దోచుకున్న డబ్బులు లెక్కపెడుతున్నాడు. ఒక్కో నియోజకవర్గంలో 20వేల నుండి 30వేలు దొంగ ఓట్లు పెట్టడానికి సజ్జల భార్గవ్ రెడ్డి కుట్రలు చేస్తున్నాడు అధికారులందరూ జగన్ ముద్దుగా పిలుచుకునే ధనుంజయ్ రెడ్డి (ధను అన్న) మాట వినాల్సిందే. మళ్లీ తప్పుడు కేసులు పెట్టడానికి చిత్తూరు పోలీసులను పిలిపించారు.. సిట్ అధికారిని రఘురామ్ రెడ్డిని రాజమండ్రిలో కూర్చొబెట్టారు.
మల్లాది అజయ్ కుమార్ తండ్రి పోతురాజు,రెడ్డిగూడెం సర్పంచ్ ఎన్నికల్లో తెలుగుదేశం తరపున పోటీ చేశారు.. బొర్రా వెంకట్రావ్ కంకిపాడు తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుల కుమారులపై 354ఎ, 354కె2, 154ఎ 504, 505/2 కెసులు పెట్టి నందిగామ జైలులో ఉంచారు. ఏది ఏమైనా ఎవరెన్నీ కేసులు పెట్టుకున్నా చంద్రాబాబు నాయుడు కడిగిన ముత్యంలా బయటకొస్తారు