Suryaa.co.in

Andhra Pradesh

జీతాలు వెంటనే చెల్లించాలి

– కేంద్ర ప్రాయాజిత పధకాల్లో పనిచేస్తున్న ఆరోగ్య శాఖ ఉద్యోగులకు నేటికి జీతాలు ఇవ్వకుండా ప్రభుత్వం ఎందుకు తాత్సారం చేస్తోంది?
– బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు డిమాండ్

ఆరువేల మంది ఉద్యోగులకు జీతాలు ఎప్పడు వస్తాయో తెలియని పరిస్ధితిలో కాలం వెళ్లదీస్తున్నారని ఇది చాలా దారుణమైన విషయంగా సోమువీర్రాజు అభివర్ణించారు. ఈ మొత్తం వ్యవహారానికి రాష్ట్రప్రభుత్వం భాద్యత వహించాలి. నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా అమలు జరుగుతున్న పధకాలను పర్యవేక్షించే ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా రాష్ట్రప్రభుత్వం ఎందుకు ఈ శిక్ష విధించిందని సోమువీర్రాజు ప్రశ్నించారు. నిధులు పుష్కలంగా ఉండే ఈ శాఖలోని ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా వారి కుటుంబాల్లో ఎందుకు మన్ను కొడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ విషయంలో ప్రభుత్వం ఒక స్పష్టమైన ప్రకటన చేయాలి కేంద్ర ప్రాయాజిత పధకాలకు సంబందించిన నిధులు పనులు మొదలు కాకుండానే నిధులు ఎనభైశాతం విడుదల చేయడం జరుగుతుంది, మిగిలిన నిధులకు రాష్ట్రప్రభుత్వం పధకాలకు సంబందించిన గణాంకాలు పంపిస్తే మిగిలిన నిధులు రాష్ట్రానికి కేటాయించడం జరుగుతుంది. అయితే ఇంత స్పష్టత ఉన్న ఈ శాఖలో జీతాలు ఇవ్వకుండా పక్షం రోజులుగా ఆయా సంబందించిన ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా పస్తులు ఉంచడం పై రాష్ట్రం వైఖరి ఏంటని ప్రశ్నించారు.

ఉద్యోగుల జీతాలను ప్రభుత్వ ఖజానా నుండే జరపాలని డిమాండ్ చేస్తున్నా. రాష్ట్రప్రభుత్వం పరిపాలన చేయకుండా కాలక్షేపం చేస్తొంది అందువల్లనే ఉధ్యోగులకు జీతాలు అందని పరిస్ధితి ఏర్పడుతోంది. సకాలంలో జీతాలు ఇవ్వాలని ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదన్నది అర్థం అవుతోందన్నారు. ఒక్కోశాఖ పై ఒక్కో విధంగా ప్రభుత్వ తీరు ఉంటోంది ఈవిధంగా జీతాలు నిలిపి వేసి ప్రభుత్వం ఉద్యోగులను గాలికి వదిలేయాలని చూస్తే మాత్రం బిజెపి తీవ్రంగా స్పందిస్తుందని సోమువీర్రాజు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అవసరమైతే ఉద్యోగ సంఘాల నాయకులు తో కలిసి పోరాటానికి సిద్ధం అవుతామన్నారు.

LEAVE A RESPONSE