టీడీపీలో చేరిన పాడేరు నియోజకవర్గ వైసీపీ సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు

అమరావతి :- పాడేరు నియోజకవర్గానికి చెందిన వైసీపీ సర్పంచులు, ఎంపీటీసీలు, వైసీపీ నేతలు చంద్రబాబు నాయుడు సమక్షంలో గురువారం టీడీపీలో చేరారు.

బెన్నవరం సర్పంచ్ బచ్చల సన్యాసమ్మ, దేవరపల్లి సర్పంచ్ సిరబాల బుజ్జిబాబు, ఉపసర్పంచ్ గుమ్మడి రాజుబాబు, లగిశపల్లి సర్పంచ్ లకే పార్వతమ్మ, తుంపాడ సర్పంచ్ తమర్భ సూర్యకాంతం, అన్నవరం ఎంపీటీసీ కిల్లో కృష్ణా, రింతాడ సీపీఐ మాజీ ఎంపీటీసీ సెగ్గ సంజీవ్ రావు, వంతాడపల్లి మాజీ సర్పంచ్ బాకూరు బాలరాజ్, మాజీ సర్పంచులు సాగిన బుంజు పడాల్, మజ్జి బీమేష్, ముట్టడం పెద్దబాబయ్, పాడేరు రైతు సంఘం అధ్యక్షులు ముట్టడం సరబన్న పడాల్, ప్రభుత్వ మాజీ ఉద్యోగి కిల్లు వెంకటరమేష్ నాయుడుతో పాటు పలువురు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.

పార్టీలో చేరిన వారిని చంద్రబాబు సాదరంగా ఆహ్వానించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక స్థానిక సంస్థలు నిర్వీర్యమయ్యాయని, సర్పంచులను ఉత్సవ విగ్రహంలా ప్రభుత్వం మార్చిందని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేశారు. పంచాతీలకు మళ్లీ మహర్ధశ రావాలంటే టీడీపీతోనే అని, పాడేరులో వచ్చే ఎన్నికల్లో టీడీపీని భారీ మెజారిటీతో గెలిపేందుకు కృషి చేయాలని చంద్రబాబు సూచించారు.

Leave a Reply