Suryaa.co.in

Andhra Pradesh

ఇక మీ మాయ మాటలు,రోత రాతలు బీసీలు పట్టించుకోరు

– బీసీలు చైతన్యవంతులయ్యారు…మీ ఉచ్చులో ఇక ఎన్నటికీ పడరు.
– 2024లో బీసీలే మరోసారి టీడీపీకి గుణపాఠం చెప్పబోతున్నారు.
– సామాజిక న్యాయానికి అర్ధం, పరమార్ధం చెప్పింది వైఎస్‌ జగన్‌
రాష్ట్ర బీసీ సంక్షేమం,సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ

జగన్‌ నిర్ణయాలతో టీడీపీ వెన్నులో వణుకు:
– జగన్‌ నిర్ణయాల వల్ల ప్రజల్లో లభిస్తున్న ఆదరణ చూసి టీడీపీ బెంబేలెత్తుతోంది..ఆ పార్టీ నాయకులు కంపిస్తున్నారు.
– దానికి నిదర్శనమే ఈ రోజు ఈనాడులో ‘పెత్తందారి పోకడ’ అనే శీర్షికతో వచ్చిన వార్తే.
– బీసీ వర్గాలను బానిస వర్గాలు చూసిన పెత్తందార్లు టీడీపీ, చంద్రబాబు అండ్ కో..నే.
– ఎన్టీఆర్‌ పార్టీ పెట్టినప్పుడు కొంత మంది బీసీలు ఆయన పట్ల ఆకర్షితులైన మాట వాస్తవం.
– ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుడిగా చేసిన సందర్భంలో చంద్రబాబుకు మద్దతు పలికిన ప్రతి ఒక్క నాయకుడూ చంద్రబాబు వెన్నుపోటులో వాటాదారేలే.
– యనమల, అయ్యన్నపాత్రుడు, బండారు సత్యనారాయణ వంటి నేతలంతా ఆ మోసంలో వాటాదారులు.
– ఇంత కాలం బలహీనవర్గాలను పలువిధాలుగా మోసం చేసి, మీరు చేసిన మోసాన్ని ప్రత్యర్థులపై నెట్టి, ప్రజల దృష్టిని మరల్చి అధికారం పొందిన సందర్భాలున్నాయి.
– కానీ ఈ రోజు అది సాధ్యం కాదని చంద్రబాబుకు కూడా తెలిసిపోయింది. ఎందుకంటే బీసీలు అంత బలంగా ఉన్నారు. చంద్రబాబు మోసాన్ని బీసీలు గ్రహించారు.
– రాజకీయ వ్యూహంలో భాగంగా, జగన్‌ గారు తీసుకుంటున్న నిర్ణయాలకు టీడీపీలో భయం పుట్టిందనేది వాస్తవం.
– అందుకే వారు ప్రజాస్వామ్య వాదులు బాధపడేలా తమ భాషను వాడుతున్నారు.
– సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వ్యక్తిపై బండారు సత్యనారాయణ, అచ్చెన్నాయుడులు వాడిన భాషను ఎవరూ హర్షించరు.

LEAVE A RESPONSE