ఒకటిన జీతాలొస్తల్లేవ్

-ఉద్యోగాల సంఘాలకు గౌరవం ఇచ్చిన పార్టీ బిఆర్ఎస్
-ఉద్యోగ సంఘాల్లో చీలిక తెచ్చే ప్రయత్నం
-బిఆర్ఎస్ పై కోపం ఉంటే రైతుల పై తీర్చుకోకండి
-బీ ఆర్ ఎస్ నేత ,ఉద్యోగ సంఘాల జే ఏసీ మాజీ చైర్మన్ దేవి ప్రసాద్

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 100 రోజులు కావస్తున్నా … ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదు. అనేక హామీలు ఇచ్చి అర చేతిలో వైకుంఠం చూపించారు. మొన్న జరిగిన కేబినెట్ లో ఉద్యోగాలకు సంబంధించి చర్చించలేదు . బి ఆర్ ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగస్తులకు ఒక DA ఇచ్చేందుకు కేబినెట్లో నిర్ణయించింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తరువాత పట్టించుకున్న పాపాన పోలేదు .

ఒకటో తారీఖు జీతాలు ఇస్తున్నామని గొప్పలు చెప్తున్నారు. చాలా మందికి ఫస్టు నాడు జీతాలు రావడం లేదు. కొంత మంది ఉద్యోగస్తులకు మాత్రామే ఒకటో తారీఖు నాడు జీతాలు ఇస్తున్నారు. రైతులకు కావాల్సిన సౌకర్యాలు కల్పించిన ఘనత బిఆర్ఎస్ ప్రభుత్వానిది ఇవాళ రైతుల పరిస్థితి చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయి. నాగార్జున సాగర్ ఎడమ కాల్వ క్రింద పంటలు ఎండిపోతున్నాయి.

కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన పై దృష్టి పెట్టడం లేదు ..సీఎం ,మంత్రులు కేసీఆర్ పై దుమ్ము ఎత్తి పోస్తున్నారు. బిఆర్ఎస్ పై కోపం ఉంటే రైతుల పై తీర్చుకోకండి . నీళ్ళ గురించి దేవుడికి మొక్కుకోవాలని ఓ మంత్రి మాట్లాడుతున్నాడు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా వేళఎకరాలకు సాగునీరు ఇచ్చాం. మంత్రులు కేసీఆర్ ను తిట్టడంలో పోటీ పడుతున్నారు .తిట్టడం మానేసి తెలంగాణను అబివృద్ధి వైపు తీసుకెళ్లేందుకు పోటీ పడండి.

ఉద్యోగ సంఘాల్లో చీలిక తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఉద్యోగ సంఘాల్లో మితిమీరిన జోక్యం చేసుకుంటున్నారు. దయచేసి జోక్యం మానుకోండని హెచ్చరిక చేస్తున్నా తక్షణమే ఉద్యోగులు ఇతర వర్గాల సమస్యలు పరిష్కరించాలి. పార్లమెంట్ ఎన్నికల కోడ్ రాకముందే సీఎం రేవంత్ ఉద్యోగుల డీ ఏ ఇతర సమస్యల పై స్పందించాలి ఉద్యోగాల సంఘాలకు గౌరవం ఇచ్చిన పార్టీ బి ఆర్ ఎస్.

తాగునీటి విషయం లో బెంగుళూరు లాగా హైదరాబాద్ కాకూడదని హై కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని చాల సీరియస్ గా హెచ్చరించింది. నీటి సమస్య రాకుండా చూడాలి. పకృతి వైపరీత్యం వల్ల కరువు రావొచ్చు…ప్రత్యామ్నాయం సిద్ధం చేసుకోవాలి. పార్లమెంటు ఎన్నికల్లో ఎవరిని గెలిపించాలో నిర్ణయించేది ప్రజలు .కాంగ్రెస్ నేతలు కాదు

Leave a Reply