Suryaa.co.in

Andhra Pradesh

బాధితులకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ వందనాలు

-వరద పంపు గ్రామాల్లోనీ ప్రజలకు ప్రభుత్వ నిత్యవసర సరుకులు పంపిణీ
-మండలంలోని పునరావాస కేంద్రాల పరిశీలన

-ఎమ్మెల్యే వెనిగండ్ల రాము

నందివాడ11: విపత్కర పరిస్థితుల్లో చరిత్ర చూడని విధంగా వచ్చిన వరద ప్రభావంతో నష్టపోయిన బాధితులకు ప్రభుత్వం అందిస్తున్న సహాయానికి తోడుగా చేయూతనందించిన దాతలు….. స్వచ్ఛంద సంస్థలకు గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము చేతులెత్తి ధన్యవాదాలు తెలియజేశారు. నందివాడ మండలంలో వరద ముంపు గ్రామాల్లో ఎమ్మెల్యే రాము ప్రభుత్వం అందించిన నిత్యవసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన తమిరిశ గ్రామంలో నిత్యవసర సరుకుల కిట్లను ప్రజలకు అందజేశారు.

అనంతరం మండలంలోని ప్రభుత్వ పునరావాస కేంద్రాల్లో పర్యటించిన ఎమ్మెల్యే రాము…… కేంద్రంలో అందిస్తున్న వసతులను పరిశీలించి, ప్రజలకు భోజనం వడ్డించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ ప్రకృతి కోపానికి నష్టపోయిన ప్రజలకు కూటమి నేతలు అందిస్తున్న సేవలు నిరూపమానమని కొనియాడారు. ప్రజలకు మేమున్నామంటూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అందించిన భరోసాకు అనుగుణంగా కూటమి నేతలు ప్రజలకు చేయూతను అందించేలా చేసిన సేవలు ఎనలేనివన్నారు.

నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకునేలా ప్రభుత్వం నుండి మెరుగైన పరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ ఇంచార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, మండల టిడిపి అధ్యక్షుడు దానేటి సన్యాసిరావు, బిజెపి ఇంచార్జ్ దావులూరి సురేంద్రబాబు, టిడిపి నేతలు కొల్లి పెద్దబాబు,పిల్లా సాల్మన్ రాజు, ఆర్.ఐ గణేష్, సివిల్ సప్లై డిటి వెంకటేశ్వరరావు, వీఆర్వో రవి, టిడిపి నేతలు చాట్రగడ్డ రవి,తోట నాగరాజు,దారం కరుణాకర్, తోట శీను, సత్తిబాబు పలు ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE