-అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్
-కూచిపూడి సంజీవని వైద్యాలయంలో ధన్వంతరి వార్డ్ ప్రారంభం
-ముఖ్య అతిధిగా విచ్చేసిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్
కూచిపూడి: సంజీవని వైద్యాలయం పేదలకు అపర సంజీవనిలా నిలుస్తోందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. శనివారం పామర్రు నియోజకవర్గం మొవ్వ మండలం కూచిపూడిలో ఉన్న రవిప్రకాష్ సిలికానాంధ్ర సంజీవని వైద్యాలయంలో నూతనంగా ధన్వంతరీ వార్డ్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది.
ముఖ్య అతిధిగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, సభాధ్యక్షులుగా పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా, ఆత్మీయ అతిధులుగా అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి డాక్టర్ గీతాభాయ్ విచ్చేసి నూతన ధన్వంతరి వార్డ్ ప్రారంభించారు.
సంజీవని వైద్యాలయం వ్యవస్థాపకులు, సిలికానాంధ్ర వ్యవస్థాపకులు కూచిభొట్ల ఆనంద్, ప్రముఖ జర్నలిస్ట్ రవిప్రకాష్ పర్యవేక్షణలో జరిగిన ఈ ప్రారంభ మహోత్సవానికి వచ్చిన అతిధులు అందరూ ఆసుపత్రిని సందర్శించారు