కోవూరు: భారత మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధా కృష్ణన్ సేవలు చిరస్మరణీయమని కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. శుక్రవారం జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నగరంలోని విపిఆర్ నివాసంలో డాక్టర్ సర్వేపల్లి రాధా కృష్ణన్ గారి చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ సేవలను గుర్తు చేసుకున్నారు. విశిష్ట తత్వవేత్త, విద్యావేత్త, రాజనీతిజ్ఞుడిగా భారతీయ తత్వశాస్త్రాన్ని ప్రపంచానికి చాటిన గొప్పవ్యక్తి అని కొనియాడారు.