హైదరాబాద్: బీజేపీ జాతీయ కార్యద ర్శి, ధర్మవరం బీజేపీ అభ్యర్ధి వై.సత్యకుమార్ యాదవ్ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కూటమి వ్యవహారాలు, ఓట్లు బదిలీ, ప్రచారాంశాలపై చర్చించారు. ధర్మవరంలో పరిటాల శ్రీరాం, వరదాపురం సూరి ఉమ్మడిగా పనిచేస్తున్నారని ఈ సందర్భంగా సత్యకుమార్ చెప్పారు. ఓట్ల బదిలీపై సమిష్టి కృషి జరుగుతోందన్నారు. పరిటాల శ్రీరాం గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి తన విజయం కోసం కృషి చేస్తున్నారని, బీసీ వర్గాల సహకారం లభిస్తోందని వివరించారు. కాగా సత్యకుమార్ విజయం ఖాయమని, టీడీపీ-జనసేన కార్యకర్తలు మీ విజయం కోసం కృషి చేస్తారని, తాను కూడా ఎన్నికల ప్రచారానికి వస్తానని బాబు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వైసీపీ దుష్ప్రచారాన్ని ఏ విధంగా ఎదుర్కొవాలన్న అంశంపై ఇరువురు చర్చించారు.
Devotional
శివుడిని ఆవుపాలతో అభిషేకిస్తే సర్వ సుఖాలు
ఆవుపాలు.. శివుడిని ఈ రోజున ఆవుపాలతో అభిషేకిస్తే.. వారు సర్వ సుఖాలు అనుభవించువారవుతారని శాస్త్రం చెప్తోంది. ఆవు పెరుగు.. స్వచ్ఛమైన ఆవుపెరుగునను శివుడి అభిషేకంలో వాడితే వారు పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా మారతారు. బలం చేకూరుతుంది. ఆవు నెయ్యి.. ఆవునెయ్యితో అభిషేకించిన వారు ఐశ్వర్యాభివృద్ధితో తులతూగుతారు. చెరకు రసం.. జీవితం దుఃఖమయంగా మారి ఎటు చూసినా అవమానాలే…
హనుమంతుడు వివాహితుడా? అవివాహితుడా?
హనుమంతుడు అవివాహతుడనే చాలామందికి తెలుసు. ఆయన బ్రహ్మచారి అన్నది లోకం నమ్మిక. కానీ ఆయన వివాహితుడేనని శాస్త్రం చెబుతోంది. మరి హతుమంతుడు వివాహితుడా? అవివాహితుడా? ఓసారి చూద్దాం! ఆయనను సువర్చలా సహిత హనుమ అని పిలుస్తారు. సువర్చలా సహిత హనుమకు కళ్యాణం చేయడం శాస్త్రంలో అంగీకరించారు. ఎందుకంటే గృహస్థాశ్రమంలోకి వెళ్ళకుంటే పెద్దలైనటువంటివారు తరించరు. శాస్త్రంలో హనుమకు…
Sports
ఉప్పల్ స్టేడియానికి కొత్త రూపు
* రూ.5 కోట్ల వ్యయంతో ముస్తాబు * వేగంగా జరుగుతున్న ఆధునీకరణ పనులు * హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు నేతృత్వంలో మైదానం మొత్తం పరిశీలించిన బీసీసీఐ, ఎస్ఆర్హెచ్ ప్రతినిధులు హైదరాబాద్: ఉప్పల్ స్టేడియం ఆధునీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్ మోహన్ రావు ప్రకటించారు. బుధవారం…
భారత ఖోఖో జట్లకు శాప్ ఛైర్మన్ అభినందన
ఢిల్లీ వేదికగా జరిగిన ఖోఖో పురుషుల, మహిళల ప్రపంచకప్లో భారత జట్లు విజేతగా నిలవడం గర్వించదగ్గ విషయమని, ప్రపంచ వ్యాప్తంగా మహిళల విభాగంలో 23 దేశాల జట్లు, పురుషుల విభాగంలో 19 దేశాల జట్లు తలపడగా భారత జట్లు ప్రదర్శించిన ప్రతిభ అద్భుతమని ఏపీ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ అనిమిని రవినాయుడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా…