బాబుతో సత్యకుమార్ భేటీ

హైదరాబాద్: బీజేపీ జాతీయ కార్యద ర్శి, ధర్మవరం బీజేపీ అభ్యర్ధి వై.సత్యకుమార్ యాదవ్ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కూటమి వ్యవహారాలు, ఓట్లు బదిలీ, ప్రచారాంశాలపై చర్చించారు. ధర్మవరంలో పరిటాల శ్రీరాం, వరదాపురం సూరి ఉమ్మడిగా పనిచేస్తున్నారని ఈ సందర్భంగా సత్యకుమార్ చెప్పారు. ఓట్ల బదిలీపై సమిష్టి కృషి జరుగుతోందన్నారు. పరిటాల శ్రీరాం గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి తన విజయం కోసం కృషి చేస్తున్నారని, బీసీ వర్గాల సహకారం లభిస్తోందని వివరించారు. కాగా సత్యకుమార్ విజయం ఖాయమని, టీడీపీ-జనసేన కార్యకర్తలు మీ విజయం కోసం కృషి చేస్తారని, తాను కూడా ఎన్నికల ప్రచారానికి వస్తానని బాబు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వైసీపీ దుష్ప్రచారాన్ని ఏ విధంగా ఎదుర్కొవాలన్న అంశంపై ఇరువురు చర్చించారు.

Leave a Reply