Suryaa.co.in

Andhra Pradesh

కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రికే సుస్తీ

-సేవలు అందించడాని డాక్టర్ల కొరత…
-సదుపాయాలను విస్మరించిన జగన్ ప్రభుత్వం…
-స్థానిక ఎమ్మెల్యే అయినా పేదల వైద్యంపై దృష్టి సారించరేం
-మాజీ ఎమ్మెల్యే సత్యానందరావు

కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రికే సుస్తీ చేసిందా అన్న రీతిలో ఆసుపత్రి మారిందని మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి ఆయన పేదలకు సరైన వైద్యం అందించడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందని అన్నారు.

1996 సంవత్సరంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అప్పటి స్పీకర్ గా వున్న యనమల రామకృష్ణుడు చేతులమీదుగా కొత్తపేటలో 50 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేస్తే,1999 వ సంవత్సరంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేతుల మీదుగా ప్రారంభం చేశారని గుర్తు చేశారు.అప్పటి నుండి వైద్య సేవలు అందిస్తున్న ఆసుపత్రి నేడు వసతులు లేక ధీన స్థితిలో వుందని ఆవేదన వ్యక్తం చేశారు.

స్థానిక ఎమ్మెల్యే విప్ అయినా గాని ప్రజా వైద్యాన్ని పట్టించుకోవడం లేదని ఆరోపించారు.తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సేవలలో మొదటి స్థానంలో వుండేదని ఆయన గుర్తుచేశారు.డాక్టర్ల కొరత,వైద్య సదుపాయాల కొరత కొట్టొచ్చినట్టు కనిపిస్తుందని తెలిపారు.కొత్తపేట నియోజకవర్గం నుండి కాక ఇతర ప్రాంతాల నుండి వచ్చే వైద్యం చేయించుకునే పరిస్థితి తమ ప్రభుత్వంలో వుండేదని అన్నారు.

ప్రసూతి వైద్యులు ఒకరు మెటర్నిటీ సెలవులపై వుంటే మరో పోస్ట్ ఖాళీగా వుందని అన్నారు.జనరల్ మెడిసిల్ లేదని,సదుపాయాలు సరిగా లేక ఆసుపత్రిలో వైద్యం కోసం వచ్చే వారు తీవ్ర ఇబ్బందులు పడటం చూసి మనసు చెలించిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. జనరేటర్ వున్నా వాడలేని పరిస్థితి నెలకొనడంతో ఆసుపత్రికి వచ్చే రోగులు వెతలు తీర్చలేనివని అన్నారు.

వంట షెడ్డు పరిస్థితి ఇక చెప్పవలసిన అవసరమే లేదన్నట్టుగా వుందని తెలిపారు.ఎవరైనా చనిపోతే ముక్తి పోందారు అనుకుంటారు కాని కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రికి శవ పంచనామాకి వస్తే మాత్రం మార్చురి పరిస్థితి చూసి ముక్తి పొందటం కష్టం అన్నట్టుగా అక్కడ పరిస్థితులలు వున్నాయని బాధను వ్యక్తం చేశారు.అరకోర వసతులతో వైద్య సేవలు అందక ప్రజలు పడుతున్న ఇబ్బందులను తీర్చాలనే స్థానిక అధికార పార్టీ నాయకులకు కూడా పట్టకపోవడం వారి పాలనా రాహిత్యానికి నిదర్శనమని సత్యానందరావు తెలిపారు.

ఫ్యామిలీ డాక్టర్ అని,కార్పోరేట్ వైద్యం,ప్రజారోగ్య దేవుడని గొప్పలు చెప్పుకునే ముఖ్యమంత్రి జగన్,వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రజని,స్థానిక ఎమ్మెల్యే జగ్గరెడ్డి పేదల వైద్యం దృష్టి సారించాలని సరైన వైద్యం అందేలా చూడాలని అన్నారు.ప్రజలు పడుతున్న ఇబ్బందులను ముఖ్యమంత్రి,ఆరోగ్య శాఖ మంత్రి,ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్తాని వారు సమస్యలను పరిష్కరించకపోతే పోరాటానికి సిద్దం అవుతానని సత్యానందరావు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE