హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసిన సౌభాగ్యం

తన భర్త దారపనేని నరేంద్ర అక్రమ అరెస్టుపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసిన సౌభాగ్యం

12 వ తేదీ రాత్రి 7 మంది గుర్తుతెలియని వ్యక్తులు నా భర్తను అక్రమంగా తీసుకెళ్లారు. బలవంతంగా ఎందుకు తీసుకెళ్తున్నారని అడిగగా మేము సిఐడి పోలీసులు అని చెప్పారు. చేతిరాతతో రాసిన ఒక లేఖపై నా చేత సంతకం తీసుకున్నారు. అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న కొంతమంది పోలీసు అధికారులు నా భర్తను కిడ్నాప్ చేశారు. నేను నా పిల్లలు తీవ్ర భయాందోళనలో ఉన్నాం. ఎవరు ఏమిటో చెప్పకుండా మా ఇంటిలోకి చొరబడి నా భర్తను ఏ విధంగా అరెస్ట్ చేస్తారు?

నా భర్త చేసిన తప్పేంటి? సెక్షన్ 41ఏ ప్రకారం నా భర్తకు నోటీసు ఎందుకివ్వలేదు? ఆర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసులో సుప్రీం కోర్టు ఆదేశాలను సీఐడీ పోలీసులు ఎందుకు పాటించలేదు? నా భర్త ఆరోగ్యానికి, ఆయన ప్రాణాలకు గ్యారెంటీ ఎవరు? అర్థ రాత్రులు ఎవరి ఇంటిలోకైన చొరవబడే హక్కు పోలీసులకు ఉందా? *రాష్ట్రంలో శాంతి భద్రతలు ఈ విధంగానే పనిచేస్తున్నాయా? రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులను పోలీసులు ఉల్లంఘించారు. నా భర్తకు ఏదైనా జరిగితే దానికి సీఐడీ పోలీసులదే భాధ్యత. సీఐడీ పోలీసులు దుశ్చర్యల పై తమరు కలుగజేసుకోండి. నా భర్తను అక్రమంగా కిడ్నాప్ చేసిన సీఐడీ పోలీసులపై కటిన చర్యలు తీసుకోండి.

Leave a Reply