ఇదొక వికృత లక్షణం…
‘ఉగ్రవాదానికి మతం లేదు’ అని అనడం ఒక మానసిక బలహీనత లేదా ఒక మానసిక లోటు లేదా ఒక విధమైన మానసిక జబ్బు కూడా. తాము ఇతరులకన్నా గొప్పవాళ్లం అని ఊహించుకునే అతి మేధావువుల్లో ఈ వికృత లక్షణం (symptom) తెగ ఉబుకుతూంటుంది.
ప్రపంచంలో మతం పేరుతో అత్యంత భయంకరంగా నరమేధాన్ని, ఆస్తి నష్టాన్ని, సాంస్కృతిక ఆధారాలను, కళలను ధ్వంసం చేసింది ఉగ్రవాదం. చరిత్రపై దృష్టి, మామూలు చదువు ఉండే ఎవరికైనా ఈ వాస్తవం తెలుస్తూంటుంది. మతం ఆధారంగా ఈ భూమిపై జరిగిన, జరుగుతున్న మానవ హననం అపరితమైందని చరిత్ర నమోదు చేస్తూనే ఉంది.
క్రైస్తవం, ఇస్లామ్ వంటి మతాల వల్లే కాదు బౌద్ధంవల్ల కూడా పలు దేశాల్లో పెను మారణకాండ జరిగింది. మనదేశంలో తొలి మత నరమేధం బుద్ధ ఉపాసకుడైన అశోకుడివల్ల జరిగింది! ఆజీవిక మతస్థుల్ని బుద్ధ ఉపాసకుడై అశోకుడు ఊచకోత కోశాడు. ఆజీవిక మతాన్ని అతి దారుణంగా అశోకుడు నిర్మూలించాడు. జపాన్, వియత్నాం వంటి పలు దేశాల్లో బౌద్ధం అతి దారుణమైన మారణకాండ జరిపింది.
ఇస్లామ్ మనదేశంలో చేసిన నరమేధం, విధ్వంసం ప్రపంచవ్యాప్తంగా తెలిసిందే. పెర్షియా ఇస్లామీకరణ ఎలా అయింది? హత్యాకాండవల్లే కదా? ఇలా ప్రతి దేశమూ, ప్రతి ఖండమూ మతోగ్రవాదానికి, మతోన్మాదానికి గురైంది; బలైంది.
మత ఉగ్రవాదం తరువాత కమ్యూనిజమ్ ఉగ్రవాదం ప్రపంచాన్ని తీవ్రంగా బాధించింది. రషా(రష్యా)లో కమ్మూనిజమ్ స్థాపనకు జరిగిన నరమేధం, విధ్వంసం మొదటి ప్రపంచ యుద్ధంలో జరిగినదాని కన్నా ఎక్కువ.
ఉగ్రవాదానికి మతం లేదు అని వాకృచ్చేవాళ్లు కమ్యూనిజమ్ కు బాగా దగ్గరగానూ, లేదా కమ్యూనిస్టులుగానూ ఉండడం కూడా మనం చూడచ్చు.
మతోన్మాదులతో, మతోగ్రవాదులతో (కమ్యూనిజమ్ ఉగ్రవాదంతో కూడా) ఎంత జాగ్రత్తగా ఉండాలో ఉగ్రవాదానికి మతం లేదు అంటూ వాచాలత్వంతో తెగ తెగబడే మానసిక వ్యాధిగ్రస్తులతోనూ మానసిక వికలాంగులతోనూ మనం అంత జాగ్రత్తగానూ ఉండాలి.

9444012279