Suryaa.co.in

Andhra Pradesh Telangana

ఎస్సీ వర్గీకరణ.. అమలు.. వాస్తవాలు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో & భారతదేశంలో ఎస్సీ వర్గీకరణ నేపధ్యం… కొన్ని మలుపులు & ముఖ్యాంశాలు

ఎస్సీ వర్గీకరణ మొట్టమొదట చేసింది చంద్రబాబు …నాలుగేళ్లు అమలు కూడా అయ్యింది… వైఎస్సార్ ముఖ్యమంత్రి అయ్యాక కేసులు వేయించి పెండింగ్ పెట్టాడు. ఎస్సీఉపకులాలు కు అన్యాయం చేశాడు మేత !ఇకపోతే ఎస్సీ వర్గీకరణ చారిత్రక నేపథ్యం చూస్తే…మాల & మాదిగ వర్గాల (దళితుల) మధ్య అసమానతలు చారిత్రకంగా ఉన్నాయి. బ్రిటీష్ వారి టైంలో మాలలు అభివృద్ధి చెందారు కానీ.. మాదిగల వెనుకబాటుతనం అలానే ఉండిపోయింది అనేది కారణం.
వర్గీకరణపై దళితుల వైఖరి ఏంటి ?

మాదిగలు అనుకూలంగా, మాలలు వ్యతిరేకంగా ఉన్నారు.

వర్గీకరణ డిమాండ్ ఎప్పటినుండి ఉంది ?

1974 కాంగ్రెస్ ప్రభుత్వ జలగం వెంగళరావు టైం నుండీ ఉంది కానీ… నాన్చుడు ధోరణితో ఆగిపోయింది.

వర్గీకరణ అమలులోకి రావడానికి ముందు ఏం జరిగింది & అమలు కావడానికి ఏ ప్రక్రియ అవలంబించారు ?

1996 : మాదిగలు చేసిన పెద్ద ఉద్యమం కారణంగా టీడీపీ ప్రభుత్వం జస్టిస్ రామచంద్ర రాజు కమిషన్ వేశారు.

తరువాత ఏం జరిగింది ?

1997 : వర్గీకరణ అమలుచేశారు, హైకోర్టు చెల్లదని కొట్టేసింది.
1999 : రాష్ట్రపతి నారాయణన్ SC వర్గీకరణ ఆర్డినెన్స్ కు ఆమోదముద్ర వేశారు.
2000 : ఏపీ హైకోర్టు వర్గీకరణకు ఆమోదముద్ర వేసింది.
2004 : సుప్రీంకోర్టు వర్గీకరణను కొట్టేసింది.
2008 : ఎస్సీ కమిషన్ అమలుచెయ్యవచ్చని చెప్పింది.
2020 : సుప్రీంకోర్టు (యూటర్న్) వర్గీకరణ చేసుకోవచ్చని ఆమోదముద్ర వేసింది.
2021 : వర్గీకరణ విషయంలో కేంద్రం ఏపీ తెలంగాణ నిర్ణయం అడిగింది.

ఏపీ కాకుండా మిగిలిన రాష్ట్రాల్లో వర్గీకరణ అమలుచేసారా ?
పంజాబ్, హర్యానా, బీహార్, తమిళనాడు మరియు కర్ణాటక, ఛత్తీస్ఘడ్ అమలుచేసే యోచనలో ఉన్నాయి.

గమనిక :

ఇక్కడ ఎవరినీ తక్కువ చెయ్యడానికి కాదు… కానీ అసలు సమస్యపై సమ్మరీ & ఓవరాల్ ఫోకస్.. ఇవన్నీ గతంలోని వివిధ ఆర్టికల్స్ పరిశీలించి సేకరించిన సమాచారం. చాలాచోట్ల ఇంతకంటే కూడా సమాచారం ఒకేచోట లేదు. కొంత ముఖ్యమైన సమాచారం వాళ్ళకే తెలియదు.. లేదా కేవలం విమర్శించాలి అనే ఉద్దేశ్యంతో రాసిన ఆర్టికల్స్ మాత్రమే ఎక్కువ సర్క్యులేట్ అవ్వడం ఎవరైనా గమనించవచ్చు .

వర్గీకరణ అమలులోకి తెచ్చి.. అమలుచేసిందే తెలుగుదేశం ప్రభుత్వం !
వర్గీకరణ పై జగన్మోహనరెడ్డి స్టాండ్ ఏంటనేది ఇంకా తెలియజేయాల్సి ఉంది !!

– భాగవతుల ప్రదీప్
నందిగామ

 

LEAVE A RESPONSE