Suryaa.co.in

Telangana

ఫిబ్రవరి 28 లేదా మార్చి మొదటివారంలో పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్

-మందకృష్ణ మాదిగకు టికెట్ అంటూ బేస్ లెస్ న్యూస్
-ఎంపీ అభ్యర్థులను ముందుగానే ప్రకటిస్తాం
-తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరితో పొత్తు ఉండబోదు
-ఫామ్ హౌజ్ లో కేసీఆర్.. ప్రగతి భవన్ లో కాంగ్రెస్
-కేసీఆర్ ను అయోధ్యకు ఆహ్వానించారో లేదో తెలియదు
-బీఆర్ఎస్ కు ఓటు వేసి ఎం లాభం?
-కేంద్రమంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుకిషన్ రెడ్డి

కేవలం బీజేపీని విమర్శించేందుకే కొందరు ట్విట్టర్ వాడుతున్నారు.హ్యాండిల్స్ ను క్రియేట్ చేసి కావాలని చేస్తున్నారు.అసలు తల, తోక లేని వ్యక్తుల హ్యాండిల్స్ ద్వారా అవి వస్తున్నాయి.అన్ని ఆలయాల్లో ప్రాణ ప్రతిష్ట లైవ్ కార్యక్రమం ఉంటుంది.షర్మిల పార్టీ విలీనంపై మనమేం కామెంట్స్ చేస్తాం? ఎల్కే అద్వానీ అనారోగ్య కారణాల దృష్ట్యా వారికి స్పెషల్ ఫ్లయిట్ పెట్టాం.రామ మందిరం నిర్మాణాన్ని వ్యతిరేకించిన వారిని కూడా ప్రాణ ప్రతిష్టకు ఆహ్వానించాం.సీతారాం ఏచూరి పేరులో సీత ఉంది రాముడు ఉన్నారు.. ఆయన కూడా విమర్శలు చేస్తున్నారు.ఆయనకు వాళ్ళ పేరెంట్స్ ఆ పేరు ఎలా పెట్టారో ఏంటో?

సీపీఐ, సీపీఎం నేతల విమర్శలు కూడా మాకు ప్లస్ అవుతున్నాయి.ఈనెల 7, 8 తేదీల్లో స్టేట్ ఎలక్షన్ టీమ్ సమావేశం జరగనుంది.ఈ పార్లమెంట్ ఎన్నికల కోసమే.ఈ నెలాఖరులోగా పార్లమెంట్ సెగ్మెంట్లతో కార్యాలయాలు ప్రారంభంకావాలి. దానికోసమే ఈ నెల 7న సమావేశం.జాతీయ స్థాయి నేతలు వస్తున్నారు. నలుగురు సిట్టింగులకు సీట్లు కన్ఫర్మ్ అని ఎవరు చెప్పారు?దానికి సంబంధించిన ఎలాంటి చర్చ అసలు జరగలేదు.నేను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నాను.. కానీ పార్టీ వద్దనడంతో ఊరుకున్నాను.

మందకృష్ణ మాదిగకు టికెట్ అంటూ బేస్ లెస్ న్యూస్ వస్తోంది.. ఆ ప్రచారం కరెక్ట్ కాదు.ఎస్సి రిజర్వేషన్ల అంశాన్ని అసెంబ్లీ ఎన్నికల కోసం తెరపైకి తేలేదు.అమిత్ షా మొన్న రావడం ఆలస్యం కావడంతో బీజేపీ ఎల్పీ ప్రకటన అవ్వలేదు.త్వరలోనే అబ్జర్వర్లు వస్తారు.గెలిచిన ఎమ్మెల్యేలను కలవాలని అనుకున్నారు.. కానీ కలవలేదు.ఇదే అంశాన్ని నేరుగా ఎమ్మెల్యేల వద్దకే వెళ్లి చెప్పారు.. మళ్ళీ కలుస్తానని అన్నారు. ప్రోగ్రామ్ కమిటీ, టూర్స్ కమిటీ, స్క్రీనింగ్ కమిటీ వేస్తాం.

జిల్లా అధ్యక్షుల మార్పుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.మా ఫోకస్ మొత్తం లోక్ సభ ఎన్నికలపైనే ఉంది.అసెంబ్లీ ఎన్నికల్లో 100 శాతం ఓటు షేర్ పొందిన ఏకైక పార్టీ బీజేపీ.లోక్ సభలో కూడా బీసీలకు ఎక్కువ సీట్లు ఇస్తాం.మహిళలకు కూడా ఇస్తాం.ఎంపీ అభ్యర్థులను ముందుగానే ప్రకటిస్తాం. 50 శాతం లోక్ సభ స్థానాలకు అభ్యర్థులు ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్నారు.ఫిబ్రవరి 28 లేదా మార్చి మొదటివారంలో పార్లమెంట్ ఎన్నికలకు షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది.

కేసీఆర్ ను అయోధ్యకు ఆహ్వానించారో లేదో తెలియదు.. ఆయనను ఆహ్వానిస్తే ఎంఐఎం ఎలా ఫీలవుతుందో మరి. పార్లమెంట్ ఎన్నికల కోసమే కాంగ్రెస్ దరఖాస్తుల ప్రక్రియను స్టార్ట్ చేసింది.పార్టీలో జాయినింగ్స్ ఉంటాయి.. కానీ లోక్ సభ సీట్లు ఆశించి చేరేవారు ఎవరూ లేరు.నిజమైన కార్యకర్త అయితే.. సోషల్ మీడియాలో విమర్శలు చేయరు. వచ్చి.. మాతో మాట్లాడి.. సమస్య పరిష్కరించుకుంటారు. 2047 లో ఎవరు, ఏ పార్టీ వారు ఎర్రకోటపై జెండా ఎగురవేస్తారన్నది కాదు.. అప్పటి వరకు భారత్ అభివృద్ధి చెందిన దేశంగా చూడాలన్నది మా కల.

వచ్చే ఐదేళ్లలో కఠినమైన, ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు ఉంటాయి.వచ్చే ఐదేళ్లలో భారత్ కు మంచి రోజులు రాబోతున్నాయి.ఫామ్ హౌజ్ లో కేసీఆర్.. ప్రగతి భవన్ లో కాంగ్రెస్.ఈ పార్టీల మధ్య ఒప్పందం జరిగింది. మీరు మాజోలికి రావద్దు.. మేము మీ జోలికి రాబోమని ఒప్పందం కుదిరింది. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరితో పొత్తు ఉండబోదు. స్వతంత్రంగా పోటీ చేయబోతున్నాం. పొత్తుపై ఎలాంటి చర్చ జరగలేదు.

ఎన్డీయేలో పెద్ద పార్టీగా అందరినీ కలిసి వెళ్ళాలని నిర్ణయించుకున్నాం.. అందుకే జనసేనతో పొత్తు పెట్టుకున్నాం.పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ బీజేపీ, కాంగ్రెస్ కు మధ్యనే. బీఆర్ఎస్ కు ఓటు వేసి ఎం లాభం? కాంగ్రెస్ లో ఎంపీ క్యాండిడేట్ ఎవరో కూడా తెలియదు.

LEAVE A RESPONSE