– అదే యుపిలో జరిగిఉంటే గుండెలుబాదుకునేవారు
– కోర్టు వ్యాఖ్యానించినా స్పందించని సెక్కులర్ పార్టీలు
– బెంగాల్‌లో ఇంత అవినీతి ఎప్పుడూ జరగలేదన్న హైకోర్టు
– అయినా నవరంధ్రాలూ మూసుకున్న రాజకీయ పార్టీలు
పశ్చిమ బెంగాల్ లో 2016లో రిక్రూట్ అయిన 36,000 మంది ‘అన్ ట్రైన్డ్’ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల నియామకాలని కలకత్తా హై కోర్ట్ రద్దు చేసింది. జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ్‌తో కూడిన సింగిల్ జడ్జి బెంచ్ , “పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఇంతటి అవినీతి ఎప్పుడూ జరగలేదు” అని వ్యాఖ్యానించారు.
2016లో బోర్డ్ నిర్వహించిన రిక్రూట్‌మెంట్ విధానం మొత్తం వ్యవహారాన్ని ఒక స్థానిక క్లబ్‌కు సంబంధించిన వ్యవహారంలా బోర్డు నిర్వహించింది, అంతేకాకుండా పోస్టులు అమ్ముకున్నట్టు ఇప్పుడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ద్వారా క్రమంగా వెలుగులోకి వస్తోంది అని కోర్ట్ పేర్కొంది..
ఇప్పుడు దీనికి సంబంధించిన భారీ డబ్బు లావాదేవీకి సంబంధించి బోర్డు మాజీ ప్రెసిడెంట్‌తో సహా దాని అధికారులు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కస్టడీలో ఉన్నారు.
దీనిపై హై కోర్ట్ వివరణ ఇస్తూ.. 2016 రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో పాల్గొన్న అభ్యర్థులకు మూడు నెలల్లోగా కొత్త రిక్రూట్‌మెంట్ ప్రక్రియను నిర్వహించాలని పశ్చిమ బెంగాల్ బోర్డ్ ఆఫ్ ప్రైమరీ ఎడ్యుకేషన్‌ను కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశించిన ఈ రిక్రూట్‌మెంట్ పరీక్షలో పాల్గొనడానికి కొత్త లేదా ఇతర అభ్యర్థులు అనుమతించబడరు.
ఎగ్జామినీలందరూ ఇంటర్వ్యూ మరియు ఆప్టిట్యూడ్ టెస్ట్ రెండింటినీ నిర్వహించాలి మరియు మొత్తం ఇంటర్వ్యూ ప్రక్రియను వీడియోగ్రాఫర్ ద్వారా పూర్తిగా రికార్డ్ చేయాలి అని కోర్టు ఆదేశించింది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష 2014 (TET 2014)లో అర్హత సాధించిన 140 మంది పిటిషనర్లు తాము 2016 రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో పాల్గొని, ఇంటర్వ్యూలకు అటెండ్ అయినా, నియామకం కాలేదు అని హై కోర్ట్ లో వేసిన పిటిషన్స్ పై విచారణ జరుగుతోంది.
SC, ST, OBC వంటి వివిధ కేటగిరీల నుండి చివరిగా ఎన్నుకోబడిన అభ్యర్థుల మార్కులను ఇవ్వాలి అని బోర్డుని కోరినా, వాటిపై కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ వాటిని సమర్పించడంలో బోర్డు విఫలమైంది అని కోర్ట్ పేర్కొంది.
“ఈ కొత్త ప్రక్రియ ద్వారా ఎవరైనా ఎంపిక కాబడి మళ్లీ బోర్డుచే సిఫార్సు చేయబడితే, ఆ అభ్యర్థులు ప్రస్తుతం పనిచేస్తున్న పాఠశాలల్లో పని చేస్తారు, కానీ వారి సీనియారిటీ మరియు జీతం నుండి ఎటువంటి ద్రవ్య ప్రయోజనం పొందరు అని కోర్టు పేర్కొంది.
ప్రస్తుతం ఉద్యోగంలో ఉన్న అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో విజయం సాధించని వారి సేవలను “తొలగించబడతాయని” కోర్టు ఆదేశించింది. 2016 రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో హాజరైన అభ్యర్థులెవరైనా ఈ మధ్యకాలంలో వయస్సు బార్‌ను దాటినా కొత్త ఎంపిక ప్రక్రియ లో పాల్గొవచ్చు అని జడ్జి పేర్కొన్నారు. చివరగా, న్యాయమూర్తి ఇలా అన్నారు, “2016 నియామక ప్రక్రియ ఒక బయటి ఏజెన్సీ ద్వారా జరిగింది, బోర్డులో సభ్యుడు కాని మూడవ పక్షానికి బోర్డు యొక్క రహస్య విభాగాన్ని అప్పగించారు. ఇది రిక్రూట్‌మెంట్ నిబంధనలను స్పష్టంగా ఉల్లంఘిస్తోంది. దీనిపై బోర్డు పూర్తిగా మౌనంగా ఉంది అని కోర్టు విమర్శించింది. 36,000 ఉద్యోగ నియామకాలు రద్దు చిన్న విషయం కాదు. కొన్ని వందల కోట్ల అవినీతి జరిగింది. కనీస విద్యార్హతలు లేని వాళ్లకు కూడా డబ్బులు తీసుకుని ఘనమైన టీచర్ ఉద్యోగాలు ఇచ్చేసారు.
ఈ స్కాం సెక్యూలర్ సామ్రాజ్యం లో సెక్యూలర్ మహారాణి పాలిస్తున్న బెంగాల్ జరిగింది కాబట్టి టివి డిబేట్లు ఉండవు, మీడియాలో భారీ ప్రచారం లేదు, 40%కమిషన్ కబుర్లు ఉండవు, మేధావుల నవరంధ్రాలు పనిచేయవు. ఇదే ఏ యుపి లోనో అయి ఉంటే?