Suryaa.co.in

Andhra Pradesh

శహభాష్.. లోకేష్!

– మోదీ మనసు గెలిచిన నారా లోకేష్
– ప్రధాని మోదీ ప్రశంసలు
– నారా లోకేష్ విజన్, నిబద్ధతకు నిదర్శనం

“శభాష్ నారా లోకేష్!” అంటూ ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా అభినందించడం, నేటి యోగా దినోత్సవ కార్యక్రమం విజయవంతం కావడంలో మంత్రి నారా లోకేష్ కృషికి లభించిన గొప్ప గుర్తింపు.

“యోగాను కేవలం ఒక దినోత్సవంగా కాకుండా, అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేస్తూ ఒక సామాజిక ఉత్సవంగా తీర్చిదిద్దాలనే లోకేష్ ఆలోచన, దాన్ని ఆచరణలో పెట్టేందుకు గత నెలన్నర రోజులుగా ఆయన చేసిన అవిశ్రాంత కృషి అభినందనీయం. ఇటువంటి బృహత్తర సామాజిక కార్యక్రమాన్ని ఇంత సమర్థవంతంగా నిర్వహించి, దేశ ప్రజలందరికీ ఒక ఆదర్శ నమూనాగా నిలపడం లోకేష్ కార్యదక్షతకు నిదర్శనం.” అని ప్రధాని నరేంద్ర మోడీ లోకేష్ ను ప్రశంసించారు.

లోకేష్ దార్శనికత: విశాఖకు ప్రపంచ ఖ్యాతి, పెట్టుబడుల ఆకర్షణ

నారా లోకేష్ విజన్ కేవలం యోగా దినోత్సవం విజయంతో ఆగిపోదని స్పష్టమవుతోంది. ఆయన ఇప్పటికే ప్రముఖ ఐటీ దిగ్గజాలను విశాఖకు తీసుకువచ్చి, నగరాన్ని సాంకేతిక కేంద్రంగా తీర్చిదిద్దే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇప్పుడు యోగా డేను ఒక అవకాశంగా మలుచుకుని, దాని ద్వారా విశాఖను దేశవిదేశాల్లో దృష్టిలో పడేలా చేశారు.

యోగా డే గిన్నిస్ రికార్డు ప్రయత్నం ద్వారా వైజాగ్ బ్రాండ్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందనుంది. ఇది కేవలం ప్రచారం మాత్రమే కాదు, విశాఖకు అనేక పెట్టుబడులను ఆకర్షించే బృహత్తర లక్ష్యంతో లోకేష్ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. ఆయన నిబద్ధత, దార్శనికత విశాఖ భవిష్యత్తుకు శుభసూచకం.

యోగాంధ్ర కార్యక్రమాన్ని నెల క్రితం ప్లాన్ చేశారు. అసాధ్యమైన దీనిని సుసాధ్యం చేసి చరిత్ర సృష్టించారు!

యోగా దినోత్సవం రోజు విశాఖలో 3.01 లక్షల మందితో లోకేష్ సారధ్యంలో జరిగిన ‘యోగాంధ్ర’ గిన్నిస్ రికార్డు నెలకొల్పింది. గతంలో సూరత్ రికార్డు (1.47 లక్షలు) బద్దలైంది. నెలన్నర రోజులుగా నిద్రలేని రాత్రులు గడిపి, ప్రతి అంగుళాన్ని పర్యవేక్షించి, అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేయడంలో లోకేష్ అకుంఠిత దీక్ష కనిపించింది.

ప్రధాని మోడీ ప్రశంసలు: “ఈ కార్యక్రమం విజయానికి లోకేష్ కృషి అపారం. యోగాను సామాజిక ఉత్సవంగా ఎలా మార్చాలో, ప్రజలందరినీ ఎలా ఏకం చేయాలో ఆయన చేసి చూపించారు. ఈ కార్యక్రమం దేశానికే ఆదర్శం. లోకేశ్ ఆదర్శనీయుడు అని పదే పదే మోడీ గారు లోకేశ్ పేరును ప్రస్తావించారు.
రామకృష్ణ బీచ్ నుండి భీమిలి వరకు లక్షల మంది ఒకేసారి యోగాసనాలు వేసి చరిత్ర లిఖించారు. ఇది కేవలం రికార్డు కాదు, లోకేష్ దూరదృష్టి, అతని బృందం అవిశ్రాంత కృషి, మరియు ప్రజల సంకల్పం కలిపి సాధించిన అద్భుతం!

LEAVE A RESPONSE