పాకిస్థాన్ నటుడు, సోషల్ మీడియాలో ప్రభావశీలి అయిన షయాన్ అలీ ఇస్లాంను విడిచిపెట్టి హిందూ ధర్మాన్ని స్వీకరించినట్లు ప్రకటించారు. పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు తనను ఇబ్బందులకు గురిచేయడం, దేశం విడిచి వెళ్లాల్సి వచ్చినప్పుడు, ఈ సమయంలో శ్రీకృష్ణుడు తనకు దారి చూపాడాని, త్వరలో భారత్‌కు రావాలని యోచిస్తున్నట్లు షయన్ పేర్కొన్నాడు.
ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో ద్వారా ఘర్ వాపసీని ప్రకటించాడు. గత 2 సంవత్సరాలుగా తనపూర్వీకుల సంస్కృతి, జీవనశైలిని గమనించిన తర్వాత, హిందూ ధర్మాన్ని స్వీకరిస్తున్నట్టు పేర్కొన్నాడు. ఈ సందర్భంగా తనకు ఎల్లవేళల అండగా నిలిచిన ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్ (ఇస్కాన్)కి అలీ కృతజ్ఞతలు తెలిపారు.
2019లో పాకిస్థాన్ ఏజెన్సీలు తనను చిత్రహింసలకు గురిచేయడం, దీంతో దేశం విడిచి వెళ్లేందుకు దారితీసిందని గుర్తు చేసుకున్నారు. తాను డిప్రెషన్‌లోకి జారుకున్నానని, శ్రీకృష్ణుడు జోక్యం చేసుకోవడంతో ధైర్యంగా ఉన్నానని, ఇప్పుడు రుణం తీర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని కూడా ఆయన పేర్కొన్నారు.
“అతి త్వరలో నా మాతృభూమిని సందర్శిస్తాను. అక్కడ నా తాతలు, నా పూర్వీకులందరూ జన్మించారు. నా స్వంత మట్టిలో నా ప్రజలలో నన్ను నేను కలిసిపోతాను. ఎప్పటికైనా మొదటి ఇల్లే అసలైన ఇల్లు (భారత్) అవుతుంది అని” అలీ అన్నారు.
తన ఘర్ వాపసీ ని ప్రకటిస్తూనే, ఒక సనాతనిగా తాను ఏ ఇతర మతంపై ద్వేషంలో భాగం కానని స్పష్టం చేశాడు. తాను ఇతర మతాల విశ్వాసాలను గౌరవిస్తానని, తన విశ్వాసాలపై కూడా అదే ఆశిస్తున్నానని అలీ చెప్పాడు. తన జీవితంలో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించే ముందు ఎవరినైనా ఉద్దేశపూర్వకంగా లేదా అనుకోకుండా బాధపెట్టినందుకు షాయన్ క్షమాపణలు చెప్పాడు. తన మూలాల్లోకి తిరిగి వచ్చినందుకు తాను గర్వపడుతున్నానని, తన పూర్వీకులు కూడా అదే అనుభూతిని కలిగి ఉంటారని ఆశిస్తున్నానని ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నాడు.
ఈ ఏడాది మేలో, షయాన్ అలీ తను పాకిస్తాన్ నుండి పారిపోవడానికి కారణమైన పరిస్థితుల గురించి మొదటి సారి ప్రస్తావించాడు. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ISI, “కశ్మీర్ హోన్ మెయిన్” పేరుతో కాశ్మీర్ పై PR మ్యూజిక్ వీడియో చేయడానికి నిరాకరించిన తర్వాత, ముఖ్యంగా తన జట్టు రంగును(blonde hair) వల్ల అతన్ని యూదు ఏజెంట్, ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ R&AW సభ్యుడిగా అనుమానించడం ప్రారంభించారని తెలిపాడు.
ట్విట్టర్‌లో 25 వేల మంది ఫాలోవర్లను కలిగి ఉన్న, ISI నిరంతర అణచివేత కారణంగా పాకిస్థాన్‌ను శాశ్వతంగా విడిచిపెట్టడం తప్ప తనకు వేరే మార్గం లేదని పేర్కొన్నాడు. తనను హతమార్చేందుకు పాక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కూడా కుట్ర పన్నిందని ఆవేదన వ్యక్తం చేశాడు.
(vsktelangana.org)