Suryaa.co.in

Devotional

శివునికి అర్చన ఎలా చేస్తే ఏమి జరుగుతుంది?

శివలింగార్చన సర్వ పాపాలను హరిస్తుంది.
” బ్రహ్మమురారి సురార్చిత లింగం నిర్మలభాసిత శోబితలింగం
జన్మజ దుఃఖ వినాశక లింగం తత్ర్పణమామి సదాశివలింగం. ”
అంటూ..ఆ శివుని స్మరిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి.

శివుడు నిరాకారుడు. భోళా శంకరుడు. కోరిన కోరికలు తీర్చేవాడు. ఆదుకో శివయ్యా..అని శరణు వేడుకోగానే భక్తులను రక్షించేవాడు.
శివుడు హిందువులు పూజించే దేవుళ్లలో ప్రథముడు. ఆయన పశుపతిగాను, లింగరూపములోననూ సింధు నాగరితక కాలం నుంచే పూజలందుకొంటున్నాడు.
శివుడు అనార్యదేవుడు. కాని తర్వాత వైదిక మతంలో లయకారునిగా స్థానం సంపాదించుకున్నాడు. నేటికి దేశమంతా శివాలయాలే అధిక సంఖ్యలో ఉన్నాయి.
విశ్వమహారూపం శివం, భూకక్ష్య ఎలా ఉంటుందో విశ్వరహస్య మూలాలు ఎలా మొదలయ్యాయో ఆ లయకారక రూపమైన శివలింగం లోనే ఉన్నాయని చెప్తారు పెద్దలు.
నిజానికి శివలింగ రూపం అటు స్పేస్ సైన్స్ నీ, ఇటు తాత్విక విశయాలనీ ఒకే విధంగా తనలో ఇముడ్చ్గుకున్న అద్బుత ఆకారం. విశ్వం లో ఆకర్షణ, వికర్షణ బలాల ని వివరించే విధంగా అండాకారం లో శివలింగం ఉంటుంది.
నిరాకారాన్ని చెబుతూనే తనే ఆకారమంటూ చెప్పే శివతత్వం ఒక మహాద్బుత మోక్ష మార్గం.
అయితే ప్రతీ దైవాన్ని పూజించటానికి భిన్న పద్దతులున్నాయి. ఆకలేస్తుందనీ, నీళ్ళు కావాలనీ, కడుపులో నొప్పిగా ఉందనీ చెప్పటానికి అమ్మకైనా ఒకే సైగతో ఎలా అయితే చెప్పలేమో అదే విధంగా దేవుడికీ అంతే ఒక్కో కోరికకీ ఒక్కో రకమైన ఆరాధనా పద్దతి ఉంది మరి.. అదేమిటో తెలుసుకోండి….
శివార్చన ఎలా చేస్తే ఏమి జరుగుతుంది?

పుష్పోదకము(నీరు,పువ్వులతో అభిషేకిస్తే) చేత అభిషేకించిన భూ’లాభము కలుగును.
ఆవు నెయ్యితో అభిషేకించిన ఐశ్వర్య ప్రాప్తి కలుగును.
మెత్తని చెక్కరతో అభిషేకించిన దుఃఖ నాశనము కలుగును.
అన్నముతో అభిషేకించిన అధికార ప్రాప్తి, మోక్షము మరియు దీర్ఘాయువు లభించును.
రుద్రాక్ష జలాభిషేకము సకల ఐశ్వర్యములనిచ్చును.
బంగారపు నీటితో అభిషేకము వలన ఘోర దారిద్రము నశించును.
తేనెతో అభిషేకించిన తేజోవృద్ది కలుగును.
నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించగలదు.
నీటితో అభిషేకించిన నష్టమైనవి తిరిగి లభించును.
భాస్మాభిషేకంచే మహా పాపాలు నశించును.
మామిడి పండ్ల రసము చేత అభిషేకము ధీర్ఘ వ్యాధులు నశించును.

శివలింగార్చన సర్వ పాపాలను హరిస్తుంది. శివలింగాన్ని వజ్రం నుంచి మట్టి వరకు అనేక అనేక పదార్థాలతో తయారుచేసుకుని పూజించవచ్చు.
స్టీల్, ఇనుముతో మాత్రం చేయకూడదని పండితులు చెబుతారు. లింగం చేసిన పదార్థాన్ని బట్టి వచ్చే ఫలితాలు కూడా అద్భుతంగా ఉంటాయి.
వజ్రంతో చేసిన శివలింగానికి పూజ చేస్తే ఆయువు వృద్ధి చెందుతుంది.
ముత్యంతో చేసిన లింగాన్ని సేవిస్తే రోగాలు నాశనం అవుతాయి.
పుష్యరాగంతో చేసిన శివలింగాన్ని పూజిస్తే కీర్థి లభిస్తుంది.
నీలంరాయితో చేసిన లింగాన్ని సేవిస్తే ఐశ్వర్యం సిద్ధిస్తుంది.
మరకతంతో చేసిన లింగాన్ని పూజించడం వల్ల సుఖమైన జీవితం లభిస్తుంది.
స్ఫటికంతో చేసిన లింగార్చన అన్ని కోరికలను తీరుస్తుంది.
స్త్రీలు గంధంతో చేసిన శివలింగాన్ని పూజిస్తే నిండు నూరేళ్ల సౌభాగ్యం లభిస్తుంది.
ఇత్తడితో చేసిన శివలింగాన్ని పూజించడం వల్ల తేజస్సు దక్కుతుంది.
ధాన్యపు పిండితో చేసిన లింగాన్ని సేవిస్తే అనారోగ్యాలు దరిచేరవు.

– సేకరణ ఆర్కే

LEAVE A RESPONSE