– వైసీపీ సర్కారు తప్పుడు లెక్కలను కేంద్రం ఆమోదించాలా?
ఆంధ్ర రాష్ట్రంలో ఒక కోటి 48 లక్షల తెల్ల రేషన్ కార్డులు ప్రభుత్వ లెక్కలు ఉండి, ప్రతినెల దానికి ఇవ్వవలసిన బియ్యము ఇతర సదుపాయాలు ఇస్తూనే ఉన్నారు . ఒకసారి వివరాల్లోకి వెళ్దాం . ఈ రాష్ట్రంలో జనాభా ఐదు కోట్ల మందని లెక్కలు చెబుతున్నాయి. ఒక కుటుంబానికి నలుగురు మనుషులు అనుకుంటే, అందరికీ వైట్ రేషన్ కార్డులు ఇచ్చాము అనుకుంటే, ఒక కోటి 25 లక్షల రేషన్ కార్డులు ఉండాలి .
ఇంకొక లెక్క చూద్దాం.. ఈ రాష్ట్రంలో ఒక కోటి 50 లక్షల కుటుంబాలనుకుంటే వాటిలో చిన్న ,పెద్ద ఉద్యోగస్తులు 16 లక్షల మంది ఉన్నారు . ప్రభుత్వం నుండి పెన్షన్ తీసుకుంటున్న వారు, ఐదు లక్షల మంది ఉన్నారు . వీరు కాకుండా ఆర్థికంగా బలంగా ఉన్న కుటుంబాలు, ఏ లెక్కకు రానివారు ఐదు లక్షలు కుటుంబాలు ఉంటాయి. (చిన్న పెద్ద రాజకీయ నాయకులు, మోతుబరి రైతులు ,పెద్దపెద్ద వ్యాపారస్తులు, తదితరులు ) వీరు ప్రెస్టేజ్ కోసం వైట్ రేషన్ కార్డు తీసుకోరు .ఎందుకంటే వారికి అవసరం కూడా ఉండదు. ఈ రాష్ట్రంలో ఇన్కమ్ టాక్స్ కట్టేవారు 12 లక్షల మంది ఉన్నారు . వీరందరినీ కలుపుకుంటే 38 లక్షలు వచ్చారు. అంటే ఈ కేటగిరీ కాకుండా మిగతా అందరికీ వైట్ రేషన్ కార్డు ఇచ్చినా కూడా, ఈ లెక్క కూడా తప్పే .మరి ఎక్కడ లెక్క తప్పు ఉంది ఎవరు సరి చేయాలి ?
జగనన్న రేషన్ కార్డు లలో ఇన్ని లోపాలు పెట్టుకొని, ఈ నెల నాలుగో తారీఖున నరేంద్ర మోడీ భీమవరం మీటింగ్ కు వచ్చినప్పుడు, మీరు 56 లక్షల కుటుంబాలకు మాత్రమే బియ్యం ఇస్తున్నారు. మా లెక్క ప్రకారం కోటి నలభై ఎనిమిది లక్షల కుటుంబాలు ఉన్నాయి. వాటన్నిటికీ బియ్యం సరఫరా చేయమని అని వ్రాత పూర్వకంగా ప్రధానమంత్రి గారిని అభ్యర్థించడం జరిగింది.
అంటే మీరు తప్పుడు లెక్కలు సమర్పిస్తే, కేంద్రం కూడా అదే విధంగా చేయాలా? కేంద్రం దగ్గర బిలో పావర్టీలైన్ కు ఎవరు అర్హులో, ఎవరు కాదో పక్కా సమాచారం,లెక్కా ఉంది. మీలాగా కళ్ళు మూసుకుని ప్రజల డబ్బును విచ్చలవిడిగా ఇష్ట ప్రకారం, ఓట్ల కోసం వాడుకునే ప్రభుత్వం కాదు . ఒక కేజీ బియ్యానికి 33 రూపాయలు కేంద్రం ఖర్చు పెడుతుంది .
అంటే మీ ఉద్దేశం.. మీరు తప్పుడు లెక్కలు సమర్పిస్తే , ఆ లెక్కల ప్రకారం మీకు కేంద్ర సహాయం చేయాలా ? ఇన్కమ్ టాక్స్ కట్టేవారు, ప్రభుత్వ ఉద్యోగస్తులు ,ప్రభుత్వ పెన్షనర్లు ,వైట్ రేషన్ కార్డుకు అనర్హులు. ఇటువంటివారు 38 లక్షల కుటుంబాలు ఉన్నాయి .కానీ లెక్కల ప్రకారం ప్రస్తుతం ఒక కోటి 48 లక్షల కార్డులు ఉన్నాయి.
ఇది సామాన్య ప్రజలు రకరకాల పన్నుల పేరుతో ఇటువంటి లోపాలన్నీ ఉన్నప్పటికీ ,తెలిసినప్పటికీ ఇష్టం లేక ,కష్టంతో ,విధిలేక కట్టే డబ్బుతో నడుస్తున్న ప్రభుత్వాలు. ఏ ప్రభుత్వం అయినా ప్రజల డబ్బుకు వాచ్ డాగ్ లాగా ఉండాలి. కానీ ఇష్టప్రకారం ఓట్ల కోసం మీ ఇష్ట ప్రకారం దోచిపెట్టడం సమంజసం కాదు .
ప్రజలు అడగడం లేదని మీరు ఓట్ల కోసం అడిగిన వారికి ,అడగని వారికి అవసరం ఉన్నవారికి, లేనివారికి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనే ఒక ముద్దు పేరుతో, ప్రజల సొమ్మును మీ రాజకీయ స్వలాభం కోసం మీరు వ్యవహారం చేస్తున్నారు . తిరగబడడానికి.. ధ్వంసం చేయడానికి, పక్క దేశం శ్రీలంక లో ఏమి జరుగుతుందొ చూస్తూనే ఉన్నాం.
నేను చెప్పిన ఈ లెక్కంతా కూడా, మీరు మీ మీ స్థాయిల్లో గూగుల్ లోకి వెళ్లి సెర్చ్ చేసుకొని అవగాహన పెంచుకోండి. కష్టపడి సంపాదించిన డబ్బు అవసరం లేకుండా, పరుల పాలు కావడం ఎవరికి ఇష్టం ఉండదు. ఆ బాధ కష్టపడి సంపాదించిన వారికే తెలుస్తుంది. ఇలాంటి డబ్బు చట్ట ప్రకారం దేనికి ఖర్చు పెట్టాలో దానికి ఖర్చు పెడితే, ఈ రాష్ట్రం ఎంత ముందుకు పోతుందో ఒక్కసారి ఆలోచిద్దాం .
ప్రజలారా… ఇటువంటి లెక్కలేని ప్రభుత్వ డబ్బును నీళ్లప్రాయంగా ఖర్చు పెడుతున్న ప్రభుత్వాన్ని సాగనంపి, నిజాయితీకి మారుపేరైన బిజెపి + జనసేన పార్టీలను రాబోయే ఎన్నికలలో, డబుల్ ఇంజన్ సర్కార్ ను అధికారం లొకీ తెచ్చుకొనే దానికోసం మన వంతు పని మనం చేద్దాం .
– కరణం భాస్కర్
బిజెపి ,
మొబైల్ నెంబర్ 7386128877 .