ఎన్నికల సమయంలో కీలకంగా పనిచేయాలి

– బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్

ఇప్పటి వరకు పనిచేసిన విధానం ఒక ఎత్తు ఎన్నికల సమయంలో పనిచేయడం మరో ఎత్తు అందుకు అందరు సన్నద్దం కావాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ విస్తారక్ లకు ఉద్భోదించారు. విస్తారక్ ల తో రాష్ట్ర స్ధాయి సమావేశం బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అధ్యక్షతన జరిగిన సమావేశంలో, జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ప్రధాన ప్రసంగం చేశారు.

రాజస్ధాన్ ఎన్నికల్లో ఇంచార్జిగా తాను పనిచేసి ప్రస్తుతం ఏపీ కి ఇంఛార్జిగా పార్టీ నియమించింది అంటే ఇక్కడ పార్టీ ఇచ్చిన ప్రధాన్యత గుర్తించాలన్నారు. అందువల్ల విస్తారక్ లు అందరూ బిజెపి పోటీ చేసే ప్రాంతాలకు పనిచేసే విధంగా సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు.

విస్తారక్ లు పనిచేసే ప్రాంతంలో పొత్తులో ఉన్న పార్టీల తో స్ధానికంగా సమన్వయం చేసుకోవలసిన గురుతర భాద్యత విస్తారక్ ల పై ఉందన్నారు. సమావేశంలో రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్ జీ, జాతీయ సహ సంఘటనా ప్రధాన కార్యదర్శి శివప్రకాష్ జీ, ఎపి ఎన్నికల సహ ఇంచార్జి సిద్దార్ధ్ నాధ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply