Suryaa.co.in

Andhra Pradesh

గత 4-5 ఏళ్లుగా స్కిల్ డెవెలప్మెంట్, ఫైబర్ నెట్ కార్పోరేషన్లు ‘కాగ్’ కు అకౌంట్లు సమర్పించలేదు

– మరి ఏ ఆధారాలతో చంద్రబాబును అరెస్టులు చేస్తారు?
– 50 పైచిలుకు కార్పోరేషన్లు కాగ్ కు అకౌంట్లు ఎందుకు సమర్పించరు?
-తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్

గత 4-5 ఏళ్లుగా స్కిల్ డెవెలప్మెంట్, ఫైబర్ నెట్ కార్పోరేషన్లు ‘కాగ్’ కు అకౌంట్లు సమర్పించలేదని, మరి ఏ ఆధారాలతో చంద్రబాబును అరెస్టులు చేస్తారని, 50 పైచిలుకు కార్పోరేషన్లు కాగ్ కు అకౌంట్లు ఎందుకు సమర్పించలేదో విచారించారా అని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ ప్రశ్నించారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు ..

రాష్ట్రంలో 118 కార్పొరేషన్లు ఉన్నాయి. 97 మాత్రమే చురుగ్గా పనిచేస్తున్నాయి. మనం ఏ వ్యాపారం చేసిన తరువాత సంవత్సరం అకౌంట్స్ ని ఆడిట్ చేస్తాం. రాష్ట్రంలోని సగం కార్పొరేషన్లు దాదాపు నాలుగైదు సంవత్సరాలుగా అకౌంట్స్ ని కాగ్ (కంట్రోలర్ ఆడిటర్ జనరల్)కి సమర్పించలేదు. 97 సంస్థల్లో కేవలం దాదాపు 40 పవర్ సెక్టర్స్ సంస్థలు మాత్రమే పూర్తిస్థాయిలో అకౌంట్స్ సమర్పించాయి.

మిగతా సంస్థలు ఇంతవరకు ఆడిటింగ్ చేయించుకోలేదు. ఈ నాలుగైదు సంవత్సరాల్లో ఒక్క సారి కూడా ఆడిటింగ్ చేయించుకోలేదంటే ఆశ్చర్యం కలుగుతుంది. మేజర్ కార్పొరేషన్ లు కూడా ఆడిటింగ్ చేయించుకోలేదు. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో అవకతవకలు జరిగాయని చంద్రబాబు ను అరెస్టు చేసిన ఈ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో కూడా ఏ రకమైన ఆడిటింగ్ జరగలేదు. మాకు ఎటువంటి ఆడిటింగ్ రిపోర్టు అందలేదని కాగ్ రిపోర్టు ఇచ్చింది.

అలాగే ఫైబర్ నెట్ లో కూడా అవకతవకలు జరిగాయని చంద్రబాబుపై నిందలు మోపుతున్నారు. ఐదు సంవత్సరాల్లో ఈ ఫైబర్ రెట్ లో కూడా ఆడిటింగ్ జరగలేదు. ఎక్సటర్నల్ ఆడిటింగ్ జరగలేదని కాగ్ స్పష్టంగా తెలిపింది. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ అనేక సంవత్సరాలుగా ఆడిటింగ్ జరగలేదని ప్రభత్వం గ్రహించాలి. లాస్ట్ ఆడిటింగ్ ఎప్పుడు జరిగిందో ప్రభుత్వాధికారులుగానీ, వైసీపీ నాయకులుగానీ తెలుపగలరా?

53 కార్పొరేషన్లు బాకీ ఉన్నాయి. 44 కార్పొరేషన్ లు 3నుంచి 6 సంవత్సరాల వరకు సెప్టెంబర్ 22 నాటికి బాకి ఉన్నాయి. డిస్కమ్ సెక్టర్ లు నష్టం వస్తున్నా ఆడిటింగ్ చేసి బాకీలు చెల్లిస్తున్నాయి. 6 సంస్థలు పెట్టినప్పటి నుంచి ఇప్పటిదాక ఆడిటింగ్ సమర్పించలేదని కాగ్ చెబుతోంది. కాగ్ అడుగుతున్నా ఇస్తామని చెబుతున్నారే గాని చెల్లించడంలేదు. 97 కార్పొరేషన్లలో కాగ్ కి అనేక సంవత్సరాలుగా అకౌంట్స్ నివేదిక రావాల్సి ఉంది. కార్పొరేషన్ల ద్వారా రుణాలు పొందడం సులభతరమైంది. సంస్థలు కాగ్ కు ఆడిట్ రిపోర్టు సమర్పించకపోతే ఏదో జరుగుతోందని అనుమానం కలుగుతుంది.

ఆడిటింగ్ జరగకపోతే అవకతవకలు జరిగాయని ఎలా తెలుస్తుంది?. గత మూడు సంవత్సరాలుగా స్కిల్ డెవలప్ మెంట్, ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ లలో ఆడిటింగ్ జరగకుండానే అవకతవకలు జరిగాయని చంద్రబాబుపై కేసు ఎలా పెట్టారు? ఎక్స్టర్నల్ ఆడిటింగ్ రిపోర్టు కాగ్ కు ఎందుకు సమర్పించలేదు? 1920లో అయితే కోవిడ్ అన్నారు. కోవిడ్ తరువాత ఎందుకు ఆడిట్ చేయలేదు.

కోవిడ్ పోయి మూడేళ్లవుతోంది. ఈ మూడేళ్లలో పాత ఆడిట్ ఎందుకు చేయలేదు. 3,400 కోట్లన్నారు 27 కోట్లకు వచ్చారు. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో ఏం జరుగుతోందో ఎవరూ చూడలేదు. 2018-19 నాటికి అకౌంట్స్ సమర్పించారు. తెలుగుదేశం ప్రభుత్వం చివరి సంవత్సరం అకౌంట్స్ కూడా 2017-18, 2018-19 అకౌంట్స్ కూడా అకౌంట్స్ సమర్పించినట్లు కాగ్ చెబుతోంది. దాని తరువాత ఇంతవరకు కాగ్ కు ఆడిట్ రిపోర్టులు ఎందుకు సమర్పించలేదు. 2019-20, 2020-21, 2021-22, 2022-23 ఈ నాలుగు సంవత్సరాలు స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఎందుకు కాగ్ కు ఆడిట్ సబ్ మిట్ చేయలేదు. ఎందుకు భయపడుతున్నారు. ప్రభుత్వం మాకు సంబంధం లేదు అన్నట్లుగా వదిలేసింది.

తప్పు ప్రభుత్వంలో పెట్టుకుని చంద్రబాబుపై మోపారు. టీడీపీ కాగ్ కు సమర్పించిన అకౌంట్స్ సీఐడీ పరిశీలించిందా? 2018-19 దాక ఇచ్చిన అకౌంట్లను సీఐడీ పరిశీలించాలి. మౌలిక సదుపాయాల కోసం అయిన ఖర్చు, డిజైన్ టెక్ కు అయిన ఖర్చు, సెంట్రల్ ఆఫ్ ఎక్స్ లెన్స్ వివరాలు, అక్కడ అమర్చిన యంత్రాలు, వాటికి సమర్పించిన సాఫ్ట్ వేర్ రేట్లు, హార్డ్ వేర్ రేట్లు ఇవన్నీ సీఐడీ తెలుసుకోవాల్సిన అవసరముంది.

స్కిల్ డెవలప్ మెంట్, ఫైబర్ నెట్ కార్పోరేషన్ల అకౌంట్లు ఆడిటింగ్ చేసి కాగ్ కు సమర్పించలేదా, లేక అసలు ఆడిటింగ్ చేయలేదా అనేది ప్రభుత్వం ఇప్పుడు చేసిన అరెస్ట్ల నేపధ్యము లో జవాభు చెప్పాల్సిన ప్రశ్న. కాగ్ చెప్పిన 60 పైచిలుకు కార్పోరేషన్ల గురించి మనము ఇక్కడ చర్చించలేము కానీ, స్కిల్, మరియు ఫైబర్ తో పాటుగా ఆశ్చర్యం కలిగించేవి, అనుమానం కలిగించే కొన్ని కార్పోరేశ్నల అకౌంట్లు కాగ్ కు సమర్పించక పోవడం గమనార్హం.

SKILL DEVELOPMENT CORPORATION 07-10-2014న ప్రారంభించారు. కాగ్ ప్రకారం చివరి సారిగా 2018-19 అకౌంట్లను కాగ్ కు సమర్పించారు. అంటే, తెలుగుదేశం ప్రభుత్వపు చివరి సంవత్సరం అకౌంట్లను కూడా తనకు ఇవ్వబడింది అని కాగ్ చెబుతోంది. మరి ఆ తర్వాత అకౌంట్లను ఎందుకు ఆడిటింగ్ చేయించలేదు. 2019-20., 2020-21, 2021-22, 2022 -23 కు సమర్పించలేదని కాగ్ నివేదిక చెబుతోంది. ప్రభుత్వం ఎందుకు ఆ తర్వాతా సంవత్సరాల్లో కాగ్కు అకౌంట్లను ఇవ్వలేదు ?

అసలు కాగ్ కు ఇచ్చిన అకౌంట్ల నివేదిక ను సీఐడీ పరిశీలించిందా? మరి దానిలో అన్నీ మౌలిక సౌకర్యాలు ఏర్పాట్లకు అయిన ఖర్చులు, డిజైన్ టెక్ పెట్టిన ఖర్చులు, సెంటర్ల వివరాలు, COE ల వివరాలు, అక్కడ అమర్చబడిన యంత్ర పరికరాలు, వాటికి సీమెన్స్ చార్జ్ చేసిన రెట్లు, సాఫ్ట్ వేర్ రెట్లు, హార్డ్ వేర్ రేట్లు అన్నీ వుంటాయి, వుండాలి కదా? కార్పరేషన్ కాబట్టి మొత్తం తన ఆదాయ వ్యయాలు ఇవ్వాలి కదా?

నెట్ వర్త్ ఎంతో చెప్పాలి కదా? అసలు 2018-19 కి అకౌంట్లను కాగ్ కి అకౌంట్లను ఇచ్చినప్పుడు, ఇక వేరే “థర్డ్ పార్టీ” పరిశీలన ఎందుకు వచ్చింది? భారత దేశం లో కాగ్ సుప్రీం ఆడిటింగ్ అథారిటీ కదా…? మరి ఆ అ తర్వాత సంవత్సరాల్లో ఎందుకు ఆడిటింగ్ వివరాలను కాగ్ కు ఇవ్వలేదు? లేదా అసలు అకౌంట్ల ఆడింగ్ చేయించాలేదా?

FIBRE NET CORPORATION. Andhra Pradesh State Fibernet Limited ను 12-10-2015 న ప్రారంభించారు . 2017-18 వరకు అకౌంట్లను సమర్పించారు అని కాగ్ చెబుతోంది. అంటే, తెలుగు దేశం చివరి సంవత్సరం 2018-19 అకౌంట్లను 2019 జూన్ 30 కి సమర్పించాలి. అప్పటికే కొత్త ప్రభుత్వం వచ్చేసింది, వాళ్ళు ఇవ్వలేదు. అప్పటి నుంచి 2021-22 వరకు – అంటే 4 సంవత్సరాలుగా అకౌంట్లను ఇవ్వలేదు అని కాగ్ చెబుతోంది.

ఈ సంవత్సరం అంటే, 2022-23 కూడా వేసుకొంటే, 5 ఏళ్ళు. అయిదేళ్లుగా అకౌట్లను కాగ్ కు ఇవ్వకుండా, దాంట్లో ఏదో జరిగిపోయిందని కేసులు మాత్రం పెట్టారు. ఆడిటింగ్ చేసి ఏమీ లేదు కాబట్టి వివరాలను తొక్కి పట్టడానికి కాగ్ కు నివేదిక అయిదేళ్లుగా ఇవ్వలేదా? లేదా గత అయిదేళ్లుగా ఫైబర్ నెట్ కార్పోరేషన్ అకౌంట్స్ ఫైనలైజేషణ్ లేకుండా గడిపెస్తోందా?

రెండు కార్పోరేషన్ల కింద అవకతవకలు అంటూ కేసు పెట్టి అరెస్టులు చేస్తే , రెండు కార్పోరేషన్లలో ఆడిటింగ్ రిపోర్ట్లు తనకు రాలేదు అని కాగ్ నివేదిన ఇచ్చిందంటే, ప్రజలు ఏమని భావించాలి? ప్రభుత్వం జవాభు చెప్పాలి?

రైతు సాధికార సంస్థ
17-10-2014 లో ప్రారంభింప బడి, 2017-18 దాకా కరెక్టుగా ఆడిటింగ్ రిపోర్ట్లను ఇచ్చిందని కాగ్ చెబుతోంది. 2018-19 to 2021-22, మొన్న అయిన ఆర్ధిక సంవత్సరం 2022-23 కూడా కలిపితే – 5 ఏళ్ళు? NO Report TO CAG? ఇక్కడ ఇంకో చిత్రమేమిటంటే , ఈ కార్పోరేషన్ ద్వారా మేము OFF BUDGET BORROWING అంటే బయట మార్కెట్ లోన్లు తీసుకొన్నామని ప్రభుత్వమే కాగ్ కి 2023 జనవరిలో ఇచ్చిన సమాచారం వుందని కాగ్ చెబుతోంది.

కాగ్ ప్రకారం ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆఫ్ మార్కెట్ borrowings గురించి ఇచ్చిన నివేదికలో 2020 నాటికి రూ. 2000 కోట్లు, 2021 నాటికి రూ. 979 కోట్లు, 2022 మార్చి నాటికి రూ. 895 కోట్లు లోన్లు వీటి ద్వారా తీసుకోన్నారట. అసలు గత 5 సంవత్సరాలుగా కాగ్ కు ఆడిటింగ్ అకౌంట్లను సమర్పించలేదు – కానీ వందల కోట్లు లోన్లు మాత్రం తీసుకొన్నారు?

Andhra Pradesh Drinking Water Supply Corporation Limited
10-11-2017న ప్రారంభం చేసారు. మొదటి రిపోర్ట్ 2018 మార్చ్ కి ఇచ్చి వుండాలి. నాలుగు నెలలే కాబట్టి మొత్తం ఒకే సారి ఇస్తాము అనుకోన్నారేమో. 2017-18 నుంచి 2022 -23 దాకా 6 సంవత్సరాలు గడచి పొయ్యాయి. కానీ ఒక్కసారి కూడా కాగ్ కి ఆడిట్ రిపోర్ట్ ఇవ్వలేదు.

ఇంకా చిత్రమేమిటంటే, ఈ కార్పోరేషన్ కి ఏ రకమైన ఆస్తులు లేకపోయినా అప్పులు మాత్రం వున్నాయి. ప్రభుత్వం గారెంటీ ఇచ్చి మరీ అప్పులు తీసుకొంది. ఆఫ్ బడ్జెట్ borrowing కింద.
2022 మార్చ్ నాటికి ఈ కార్పోరేషన్కి రూ. 640 కోట్ల అప్పులు వున్నాయి. దీనికి గానూ, ప్రభుత్వం రూ.5,330. కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులను గారెంటీ గా చూపించింది. ఇన్ని కోట్లు అప్పులు తీసుకొని కూడా కనీసం కాగ్ కి ఆడిట్ / అకౌంట్స్ ఇవ్వకుండా వుండటం ఆశ్చర్యకరం.

Andhra Pradesh Technology Services Limited: ఎప్పుడో 17-01-1985 న ప్రారంభం చేసిన కార్పోరేషన్కొ న్ని వేల కోట్ల లావాదేవీలు జరిపే కార్పోరేషన్. రెండు మూడు రోజుల క్రితమే బైజూస్ ప్రోగ్రాం కోసం పాటశాల విద్యార్ధుల కోసం రూ. 720 కోట్ల TABS కాంట్రాక్ట్ వివాదాస్పదం కూడా అయింది.. మరి ఇన్ని లావాదేవీలు జరిపే APTS లో అకౌంట్లు ఫైనలేజేషణ్ ఎప్పుడు చేసారో తెలుసా…? 2019-20 లో చివరి సారిగా కాగ్ కు అకౌంట్స్ ఇచ్చారు. 2020-21, 2021-22 కి ఇవ్వలేదు. ఈ సంవత్సరం అంటే, 2022-23 కూడా వేసుకొంటే, 3 ఏళ్ళు

Andhra Pradesh Brahmin Welfare Corporation : 05-12-2014 తేదీన ప్రారంభం చేసారు. 2018-19 దాకా అంటే తెలుగు దేశం చివరి సంవత్సరంలో కూడా జూన్ కి అకౌంట్లను కాగ్ కి ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం వచ్చింది మొదలు – అకౌంట్లు హుష్ కాకీ. 2019-20 to 2021-22, 2022-23 కూడా కలుపుకొంటే నాలుగేళ్ళు ఏమైంది ఈ నగరానికి అన్నట్టు……ఏమయిందీ కార్పరేషన్లకు?

Swachha Andhra Corporation : 01-05-2015న ప్రారభం చేసారు. 2018-19 దాకా అంటే తెలుగు దేశం చివరి సంవత్సరంలో కూడా జూన్ కి అకౌంట్లను కాగ్ కి ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం వచ్చింది మొదలు – అకౌంట్లు హుష్ కాకీ. 2019-20, 2020-21 to 2021-22, 2022-23 కూడా కలుపుకొంటే నాలుగేళ్ళు. ఎందుకు స్వచ్చత కోల్పోయింది ఈ స్వచ్చాంధ్ర కార్పోరేషన్ ?

Andhra Pradesh Airports Development Corporation Limited: 03-08-2015 నా ప్రారంభం చేసారు 2017-18 వరకు అకౌంట్లను సమర్పించారు అని కాగ్ చెబుతోంది. అంటే, తెలుగు దేశం చివరి సంవత్సరం 2018-19 అకౌంట్లను 2019 జూన్ 30 కి సమర్పించాలి. అప్పటికే కొత్త ప్రభుత్వం వచ్చేసింది, వాళ్ళు ఇవ్వలేదు. అప్పటి నుంచి 2021-22 వరకు – అంటే 4 సంవత్సరాలుగా అకౌంట్లను ఇవ్వలేదు అని కాగ్ చెబుతోంది. ఈ సంవత్సరం అంటే, 2022-23 కూడా వేసుకొంటే, 5 ఏళ్ళు. గాల్లో కలిసిపోయాయి అకౌంట్లు !!!

Andhra Pradesh Digital Corporation Limited: 29-11-2018 ప్రారంభం చేసారు,. 2019-20 కు అకౌంట్లు ఇచ్చారు. 2020-21 and 2021-22, ఈ సంవత్సరం అంటే, 2022-23 కూడా వేసుకొంటే, 3 ఏళ్ళు. ఏమిటో ? అంతా విచిత్రమే

Andhra Pradesh State Development Corporation limited: వైసీ పీ వచ్చిన తర్వాతా ఏర్పరిచిన అత్యంత controversial కార్పరేషన్ ఇది. కేవలం అప్పులు తేవడం కోసమే పెట్టిన కార్పరేషన్. 05-09-2020 న ప్రారంభం చేసారు. మార్చ్ 2020-21 రూ. 18, 500 కోట్లు లోన్లు ఈ కార్పోరేషన్ ద్వారా తీసుకొన్నామని ప్రభుత్వమే కాగ్ కు నివేదిక ఇచ్చింది. 2021-22, రూ. 22, 504 కొట్లట , తీసుకొన్న అప్పులు. కానీ అకౌంట్లు మాత్రం ఇవ్వలేదు. ఈ సంవత్సరం అంటే, 2022-23 కూడా వేసుకొంటే, 2 ఏళ్ళు. ఏమిటో ? అంతా చిత్ర విచిత్రమే

AP Drones Corporation Private Limited: 12-11-2018 న ప్రారంభించారు. మొదటి అకౌంట్స్ ఆడిట్ నివేదిక 2019 జూన్ 30 కి ఇవ్వాలి . అంటే, తెలుగు దేశం చివరి సంవత్సరం 2018-19 అకౌంట్లను 2019 జూన్ 30 కి సమర్పించాలి. అప్పటికే కొత్త ప్రభుత్వం వచ్చేసింది, వాళ్ళు ఇవ్వలేదు.

అప్పటి నుంచి 2021-22 వరకు – అంటే 4 సంవత్సరాలుగా అకౌంట్లను ఇవ్వలేదు అని కాగ్ చెబుతోంది. ఈ సంవత్సరం అంటే, 2022-23 కూడా వేసుకొంటే, 5 ఏళ్ళు. అంటే “ఒక్కసారి” కూడా అకౌంట్ల ఆడిట్ నివేదిక కాగ్ కు ఇవ్వకుండానే 5 ఏళ్ళు గాల్లో కలిసిపోయాయి అకౌంట్లు !!

Andhra Pradesh Mahila Sadhikara Samstha : 30-03-2015న ప్రారంభం చేసారు. 2017-18 వరకు అకౌంట్లను సమర్పించారు అని కాగ్ చెబుతోంది. అంటే, తెలుగు దేశం చివరి సంవత్సరం 2018-19 అకౌంట్లను 2019 జూన్ 30 కి సమర్పించాలి. అప్పటికే కొత్త ప్రభుత్వం వచ్చేసింది, వాళ్ళు ఇవ్వలేదు. 2018-19 to 2021-22 – అంటే 4 సంవత్సరాలుగా అకౌంట్లను ఇవ్వలేదు అని కాగ్ చెబుతోంది. ఈ సంవత్సరం అంటే, 2022-23 కూడా వేసుకొంటే, 5 ఏళ్ళు. ఇలా చూస్తూ పోతే చాలా వున్నాయి.

Andhra ప్రదేశ్ State Transport Corporation: ప్రభుత్వంలో విలీనం చేసారు. కానీ 2018-19, 2019-20, 2020-21, నివేదికలు ఎవరిస్తారు?

Andhra Pradesh Forest Development Corporation Limited: 2015-16 2016-17 to 2022-23 దాకా7 ఏళ్ళు .దీనిలో తెలుగు దేశం హయాములో 3 ఏళ్ళు కూడా కలిసి వున్నాయి
Andhra Pradesh State Police Housing Corporation Limited : 29-05-1971 . 2018-19 – చివరి ఆడిటింగ్ నివేదిక
2019-20 to 2022-23 – 4 ఏళ్ళు
Andhra Pradesh Mineral Development Corporation Limited : 24-02-1961 – started
2016-17 – లాస్ట్ ఆడిట్ రిపోర్ట్ to cag. 2017-18 to 2022 -23 6 ఏళ్ళు. దీనిలో తెలుగు దేశం హయాములో ఒక సంవత్సరం కూడా కలిసి వుంది. నిజాలు నిగ్గు తేల్చే సంస్థ అయిన కాగ్ కే నివేదికలు సమర్పించకపోతే ఎలా? చంద్రబాబునాయుడుపైనే కేసులు పెట్టి జైలుకు పంపిన వారు మీపై కేసులు పెట్టి జైళ్లకు పంపరనే గ్యారంటీ ఎంటి?

రాగల 5 నెలల్లో రాష్ట్ర ప్రజలు ఓట్లు వేయాల్సి వస్తుంది. నాయకులను ఎన్నుకునే ముందు ఆలోచించాలి. మనకు తెలియకుండా ఎన్ని జరుగుతున్నాయో ఒక సారి ఆలోచించి నాయకులను ఎన్నుకోవాలని టీడీపీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ తెలిపారు.

LEAVE A RESPONSE