– టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
టార్చ్ బేరర్ జగన్ రెడ్డి గారు అని మీ వందిమాగధులు భజనలు చేస్తున్నారు. మీ టార్చర్..మీరు చూపించే హారర్ సినిమాలు చూడలేక కార్పొరేట్ కంపెనీలు అయ్యబాబోయ్ అంటున్నాయని మీ క్విడ్ప్రోకో ఆస్తి సాక్షి వెల్లడిస్తోంది. మీ దొంగ పత్రిక సాక్షిలో వేసిన గణాంకాలు ప్రకారం ఏపీలో మీ అరాచక పాలన వల్ల కార్పొరేట్ పన్నుల వసూళ్లు 15 శాతం తగ్గాయి. టిడిపి పాలనలో 2018-2019 ఆర్థిక సంవత్సరంలో, రాష్ట్రం నుంచి ప్రత్యక్ష పన్నుల ద్వారా కేంద్రానికి రూ. 22,881 కోట్ల కార్పొరేటు పన్నులు వసూలయ్యాయి. మీ రివర్స్ పాలన ఆరంభమైన 2019-2020లో రూ. 20,928 కోట్లకు తగ్గిన పన్నులు, 2020-2021 నాటికి రూ.17,522 కోట్లకి దిగజారిపోయాయి. మీ హయాంలోని ఈ మూడేళ్లలో ఏపీ నుంచి ప్రత్యక్ష పన్నుల ద్వారా వసూలైన ఆదాయం కూడా గణనీయంగా తగ్గుతూ వస్తోందని కేంద్రమంత్రి పంకజ్ చౌదరి వెల్లడించడం…తమరి నిర్వాకాన్ని, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక-అభివృద్ధి పతనాన్ని సూచిస్తోంది. మీ తెలివైన కోడికత్తి మెదడుకి అర్థం కావాల్సింది ఏంటంటే…కార్పొరేట్ పన్నులు ఏటేటా తగ్గుతున్నాయంటే, రాష్ట్రానికి కొత్త కంపెనీలు రాలేదని, ఉన్నవీ జెండా ఎత్తేస్తున్నాయని, నడుస్తున్న కంపెనీలలో కార్యకలాపాలు తగ్గిపోయాయని ముఖ్యమంత్రి గారూ!