Suryaa.co.in

Telangana

ఆర్థిక సర్వే రిపోర్ట్ బోగస్ ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ కు చెంపపెట్టు

– మాజీ మంత్రి హరీష్ రావు

హైదరాబాద్: కేంద్రం విడుదల చేసిన ఎకనమిక్ సర్వే 2024-25 నివేదిక బీఆర్ఎస్ పదేళ్ల పాలనపై అడ్డగోలుగా వ్యాఖ్యలు చేసే కాంగ్రెస్ కు చెంపపెట్టు లాంటి సమాధానం. 15 పెద్ద రాష్ట్రాలతో పోల్చితే 88శాతం సొంత పన్నుల రాబడుల్లో అగ్రస్థానంలో నిలిచిన తెలంగాణ, రాష్ట్ర ఆర్థిక పరిపుష్టిని చాటింది. మిషన్ భగీరథ పై చేస్తున్న కాంగ్రెస్ దుష్ర్పచారాన్ని పటాపంచలు చేస్తూ 100శాతం రూరల్ డ్రింకింగ్ వాటర్ సప్లై కలిగిన రాష్ట్రంగా తెలంగాణ ఘనత సాధించింది.

ఐటీ లో తెలంగాణ మేటి అని మరోసారి తేల్చి చెప్పిన ఎకనిమిక్ సర్వే.. కర్ణాటకతో పాటు తెలంగాణ అద్భుత ప్రగతి సాధించిందని వెల్లడించింది. కాళేశ్వరం సహా, తెలంగాణ నీటి పారుదల వ్యవస్థపై కాంగ్రెస్ చేస్తున్న గోబెల్స్ ప్రచారం శుద్ద తప్పు అని నివేదిక తేల్చి చెప్పింది.

అత్యధిక ఇరిగేటెడ్ ఏరియాతో దేశంలోనే తెలంగాణ నాలుగో స్థానంలో నిలిచి, దేశానికి ఆదర్శంగా నిలిచిందని తేటతెల్లం చేసింది.

మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడంలో వి హబ్ దేశానికి రోల్ మోడల్ గా నిలిచిందని పేర్కొంది. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ఆర్థిక, ఐటీ, నీటి పారుదల, మహిళా సాధికారతలో సాధించిన ఘనతను ఆర్థిక సర్వే లెక్కలతో సహా వివరించింది. ఎకనమిక్ సర్వే రిపోర్టు కాంగ్రెస్ చేస్తున్న తప్పుడు ప్రచారం బోగస్ అని పేర్కొంది.

LEAVE A RESPONSE