Suryaa.co.in

Features

ఇక స్మార్ట్ ఫోన్లు కనుమరుగు

– వచ్చేస్తోంది ఏఐ పిన్
– మీ దుస్తులకు అతికించుకోవచ్చు
ప్రస్తుతం ఈ పరికరం అమెరికాలో మాత్రమే పరిమితం

ప్రస్తుతం మనం స్మార్ట్ యుగంలో ఉన్నాం. అందివస్తున్న సాంకేతికత మనిషికి అనేక సౌకర్యాలను అందిస్తోంది. అనేక గ్యాడ్జెట్లను పరిచయంచేస్తోంది. ఒకప్పుడు ఫోన్ అంటే ల్యాండ్ లైన్ కనెక్షన్ ఉండేది. వైర్డ్ కనెక్షన్ ఉండేది. కానీ వాటి స్థానంలో వైర్ లెస్ ఫోన్లు వచ్చాయి. ఆ తర్వాత స్మార్ట్ ఫోన్లు, 4జీ, 5జీ నెట్ వర్క్ సపోర్టుతో అత్యాధునిక ఫీచర్లతో మనిషిని తన అరచేతికి కట్టేస్తున్నాయి.

వీటిని చేయలేని పనంటూ ఏది ఉండటం లేదు. అలాంటి స్మార్ట్ ఫోన్ కూడా అవసరం లేకుండా.. దానిని ప్రత్యేకంగా మీరు మోసుకెళ్లే పని లేకుండా.. ఓ కొత్త టెక్ గ్యాడ్జెట్లో ప్రపంచంలో సంచలనం సృష్టిస్తోంది. చాలా చిన్నగా, క్యూట్ గా ఉన్న ఆ బుల్లి డివైజ్ ను ప్రత్యేకంగా చేతితో పట్టుకోవాల్సిన అవసరం లేదు. కేవలం మీ దుస్తులకు అటాచ్ చేసుకోవచ్చు. దీనిలో విశేషమేమిటంటే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే ఈ డివైజ్ సాయంతో.. స్మార్ట్ ఫోన్ తో చేయగలిగే అన్ని పనులు చేసుకోవచ్చని చెబుతున్నారు. ఇంతకీ ఏంటా డివైజ్? దానిని ఎవరూ కనిపెట్టారు? దానిని వినియోగించడం ఎలా తెలుసుకుందాం రండి..

హ్యుమన్ ఏఐ పిన్..

స్మార్ట్ ఫోన్ తరహాలోనే పనిచేసే ఈ చిన్న టెక్ గ్యాడ్జెట్ పేరు ఏఐ పిన్. దీనిని అమెరికాకు చెందిన హ్యూమేన్ అనే స్టార్టప్ తయారుచేసింది. యాపిల్ సంస్థలో పనిచేసిన ఇద్దరు మాజీ ఇంజినీర్లు ఈ కంపెనీని స్థాపించారు. దీనిలో ఎలాంటి స్క్రీన్ ఉండదు. పరిమాణంలో చాలా చిన్నదిగా ఉంటుంది. బరువు గా లైట్ గా ఉంటుంది. ఇది మీ వస్త్రాలకు ఎక్కడైనా అతికించుకోవచ్చు.

హ్యూమేన్ ఏఐ పిన్ ఎలా పనిచేస్తుందంటే..

హ్యూమేన్ కంపెనీ నుంచి వస్తున్న ఏఐ పిన్ స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ తో ఆధారంగా పనిచేస్తుంది. దీంతో కెమెరా, మైక్రోఫోన్, యాక్సెలరోమీటర్ వంటి అత్యాధునిక సెన్సార్లు ఉంటాయి. ఈ గ్యాడ్జెట్తో మీరు సెల్ ఫోన్ లాగాకాల్స్ చేయొచ్చు, మెసేజ్ లు పెట్టొచ్చు. ఫొటోలు చేయొచ్చు. వీడియో కూడా రికార్డు చేయొచ్చు. పైగా దీనిలో ఎలాంటి యాప్స్ కూడా అసవరం ఉండదు. అంతేకాక దీనిలో ఇన్ బిల్ట్ ప్రాజెక్టర్ ఉంంటుంది. దీని సాయంతో మీరు ఏదైనా వస్తువు, లేదా గోడపై, లేదా మీ చేతితో డిస్ ప్లే చూడొచ్చు.

ఏఐ-పిన్ ఎలా పని చేస్తుంది?

మీరు ఈ పరికరాన్ని మీ చొక్కా లేదా జాకెట్‌లో ధరించవచ్చు. ఇందులో 13ఎంపీ కెమెరా ఉంది. త్వరలో వీడియోను రికార్డ్ చేసే ఆప్షన్ కూడా ఇందులో అందుబాటులోకి రానుందని కంపెనీ తెలిపింది. ఇది ఓపెన్ ఏఐ, మైక్రోసాఫ్ట్ సాంకేతికతపై ఆధారపడిన ఏఐ పిన్ వర్చువల్ అసిస్టెంట్‌తో వస్తుంది. ఇది బ్లూటూత్ ఫీచర్‌ను కూడా కలిగి ఉంటుంది. కాబట్టి మీరు దీన్ని ఇయర్‌బడ్‌లతో సులభంగా కనెక్ట్ చేయవచ్చు.

ఈ ఏఐ పిన్ హ్యూమేన్ ఓఎస్ తో పనిచేస్తుంది. అందులో ఎలాంటి యాప్‌లు లేదా స్క్రీన్‌లను పొందలేరు. పరికరానికి ఏదైనా కమాండ్ ఇవ్వడానికి, మీరు దానిలో ఉన్న స్లయిడర్‌ను స్లైడ్ చేయాలి. ఇది సమాచారాన్ని తెలియజేయడానికి ఒక బీకాన్‌తో వస్తుంది. కాంటాక్ట్‌ల నుంచి సందేశం లేదా ఆహారం లేదా ఇన్‌కమింగ్ క్యాబ్, డెలివరీ స్థితి వంటి ఏదైనా అప్‌డేట్ ఇవ్వవలసి వచ్చినప్పుడు, అది దాని ద్వారా వినియోగదారులకు నవీకరణను అందిస్తుంది.

దీని ధర..

కంపెనీ ప్రకారం, ఏఐ పిన్‌లో యాప్‌లు లేదా స్క్రీన్‌లు లేవు. వినియోగదారులు చేతి కదలికలు, లేజర్ ప్రొజెక్టర్లు, స్లయిడ్ బటన్లు, వాయిస్ ద్వారా దానితో పరస్పర చర్య చేయవచ్చు. ఇది స్వతంత్ర పరికరం, దీని సాఫ్ట్‌వేర్ ఏఐ తో తయారు చేశామనిని తయారీదారులు తెలిపారు. మీరు ఈ ఏఐ పిన్‌ని ఎక్లిప్స్, లూనార్, ఈక్వినాక్స్ కలర్ ఆప్షన్‌లలో కొనుగోలు చేయవచ్చు. ఈ గ్యాడ్జెట్ ధర గురించి చెప్పాలంటే, అమెరికాలో దీని ధర $ 699 (సుమారు రూ. 58,212). దీనిని నెలవారీ ఈఎంఐ కావాలంటే $ 25 (సుమారు రూ. 2,082) కూడా కొనుగోలు చేయొచ్చు. వస్తుంది. సబ్‌స్క్రిప్షన్ తీసుకోవడం ద్వారా మీరు కాంటాక్ట్, డేటా కవరేజీని పొందుతారు. ప్రస్తుతం ఈ పరికరం అమెరికాలో మాత్రమే పరిమితం.

– శ్రీనివాస్

LEAVE A RESPONSE