Suryaa.co.in

Crime News National

కోల్ కతా వైద్యురాలిపై రేప్, హత్య,కు ముందు కొన్ని నిజాలు..?

-దాడికి ముందు రెడ్‎లైట్ ఏరియాలో తిరిగిన నిందితుడు

కోల్ కతాలో జూనియర్ వైద్యురాలిపై అత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు స్రుష్టిస్తూనే ఉంది. నిందితుడికి సంబంధించి తాజాగా మరో విషయం వెలుగులోకి వచ్చింది.

నిందితుడు సంజయ్ రాయ్ బాధితురాలిపై హత్యాచారా నికి ముందు కోల్ కతాలోని రెండు రెడ్ లైట్ ఏరియాలకు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన ఆగస్టు 8వ తేదీ రాత్రి పూట అప్పటికే మద్యం తాగి ఉన్న రాయ్…అసుపత్రికి చెందిన మరో సివిక్ వాలంటీర్ తో కలిసి రెడ్ లైట్ ఏరియాలకు వెళ్లినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.

వీరిద్దరు కలిసి ఓ టూవీలర్ ను అద్దెకు తీసుకుని మొద ట సోనాగచికి అర్థరాత్రి సమయంలో వెళ్లినట్లు గుర్తించారు. అక్కడ రాయ్ బయట ఉండగా..అతని మిత్రుడు లోపలికి వెళ్లాడు. అనంతరం రాత్రి 2గంటల సమయంలో దక్షిణ కోల్ కతాలోని మరో వ్యభిచార గ్రుహానికి వెళ్లారు.

ఆ సమయంలో రోడ్డుపై వెళ్తున్న ఓ మహిళలకు రాయ్ ఇబ్బంది పెట్టాడు. మద్యంమత్తులో ఉన్న అతను ఆమె నగ్న చిత్రాలు కావాలని అడిగినట్లు చెప్పారు. ఉదయం 3.50 గంటల సమయంలో రాయ్ ఆర్జీకార్ ఆసుపత్రికి చేరు కుని..మొదట ఆపరేషన్ థియేటర్ డోర్ ను పగలకొట్టాడు.

4.03 సమయంలో ఎమర్జెన్సీ విభాగంలోకి వెళ్లాడు. తర్వాత థర్డ్ ఫ్లోర్ ఉన్న సెమినార్ గదిలోకి వెళ్లాడు. ఆ సమయంలో బాధితురాలు సెమినార్ హాల్లో గాఢ నిద్రలో ఉంది. ఆమెపై రాయ్ దాడికి పాల్పడ్డారు.

అదే రోజు రాత్రి 11గంటల సమయంలో అదే ఆసుపత్రి వెనక వైపు వెళ్లి రాయ్ మద్యం తాగినట్లు కొంత మంది చెప్పారు. ఆ సమ యంలో పోర్న్ వీడియోలు చూసినట్లు తెలిపారు. మద్యం తాగాక ఆసుపత్రి ప్రాంగణంలో చక్కర్లు కొట్టినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.

బాధితురాలు మరణించిన విషయ ఉదయం వెలుగు లోకి వచ్చింది. ఈ విష యాన్ని ఉదయం 10.53 నిమిషాలకు బాధితురాలికి తల్లికి సిబ్బంది సమాచారం అందజేశారు. తర్వాత ఇది హత్యగా తేలింది.

బాధితురాలు మరణించిన సెమినార్ హాల్లోకి నింది తుడు వెళ్లినట్లు సీసీటీవీ కెమెరాల ఆధారంగా కోల్ కతా పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.

ఈ కేసు సంబంధించి నిరసనలు వ్యక్తం అవు తున్న వేళ సుప్రీంకోర్టు సుమోటోటా స్వీకరించి విచారణ చేపట్టింది. ఆర్జీకార్ కాలేజీ ప్రిన్సిపాల్ తీరుపై సీరియస్ అయ్యింది. బాధితురాలు ఆత్మహత్య చేసుకున్నట్లు ఎలా చెప్పారంటూ ప్రశ్నించింది

LEAVE A RESPONSE