Suryaa.co.in

Andhra Pradesh

ముందు ఈ మూడేళ్లలో తన ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై నిగ్గుతేల్చాలి

– అవినీతి యాప్ లతో ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తున్న ముఖ్యమంత్రి, . సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపించి, తన నిజాయితీని నిరూపించుకోవాలి
– సొంతపార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల అవినీతిని కట్టడిచేయలేని జగన్మోహన్ రెడ్డి, అవినీతిపేరుతో అధికారుల్ని బలిపశువుల్ని చేాయాలని చూడటం సిగ్గుచేటు.
• అధికారపార్టీ అవినీతిని కప్పిపుచ్చడానికే ముఖ్యమంత్రి కంటితుడుపు చర్యగా యాప్ తీసుకొచ్చారు.
• మద్యం, ఇసుక, గనుల తవ్వకాల్లో జరిగిన అవినీతిని మించింది దేశంలో ఇంకేమైనా ఉందా?
• ముఖ్యమంత్రి కుటుంబమే మద్యం, ఇసుక, సిలికాన్, గనుల్ని దోపిడీచేస్తుంటే, కిందిస్థాయి అధికారుల అవినీతిని ఎత్తిచూపుతారా?
– టీడీపీ పొలిట్ బ్యూరోభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

తన ప్రభుత్వంలో జరిగే అవినీతిపై ఫిర్యాదు చేయడానికి యాప్ లు తీసుకొచ్చి, బటన్లు నొక్కి మరీ ఫిర్యాదుచేయమంటున్న ముఖ్యమంత్రి, ముందు ఈమూడేళ్లపాలనలోతన మంత్రులు, ఎమ్మెల్యేలు చేసిన అవినీతిని నిగ్గుతేల్చాలని, దానికోసం ఆయనతక్షణమే రిటైర్డ్ సిట్టింగ్ జడ్జీతో విచారణకు ఆదేశించాలని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు.
గురువారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు . ఆ వివరాలు క్లుప్తంగా ఆయన మాటల్లోనే …

“లంచం ఇవ్వడం, తీసుకోవడం నేరమని, అడిగేవారిపై ఫిర్యాదుకు బటన్ నొక్కాలంటూ ప్రభుత్వం పత్రికల్లోప్రకటనలిచ్చింది. 14400 నంబర్ కి కాల్ చేయండి అంటూ ఇచ్చిన ప్రకటనచూస్తే బ్రహ్మనందంకామెడీగుర్తుకొస్తుంది, నిజంగానే నవ్వొస్తుంది. జగన్ రెడ్డి, ఆయనప్రభుత్వం అవినీతిగురించి మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. కలెక్టర్లు, తహసీల్దార్లు, ఇతర చిరుద్యోగుల అవినీతి సంగతి దేవుడెరుగు, వైసీపీ ఎమ్మెల్యేల అవినీతిపై ముఖ్యమంత్రి ఏంసమాధానంచెబుతారు? అధికారపార్టీ అవినీతిని కప్పిపుచ్చుకు నేందుకు కంటితుడుపు చర్యగా యాప్ తీసుకొచ్చారు. అధికారుల అవినీతిపై ఫిర్యాదుకు యాప్ తీసుకొచ్చిన ప్రభుత్వం, మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతిపై ఒకకమిషన్ వేయాలి. జగన్మోహన్ రెడ్డి గతంలోచేసిన అవినీతి సంగతి కోర్టుల్లో నడుస్తోంది. దానిగురించి తాము ప్రశ్నించడంలేదు. ఈ మూడేళ్లలో ఆయన, ఆయనప్రభుత్వంలోని వారు చేసిన అవినీతి గుట్టుమట్లు ముఖ్యమంత్రి బయటపెట్టగలడా అని డిమాండ్ చేస్తున్నాం.

మద్యం, ఇసుక, మైనింగ్ అక్రమాలు, అవినీతికి సంబంధించి ముఖ్యమంత్రిపై వచ్చిన ఆరోపణలపై ఆయనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించుకొని తనచిత్తశుద్ధిని నిరూపించు కోవాలని డిమాండ్ చేస్తున్నాం. సీబీఐ ముఖ్యమంత్రిపైనే రూ.43వేలకోట్ల అవినీతి జరిగిందంటూ కోర్టులో కేసువేసింది. ప్రజలు వారిహక్కులు, స్వేచ్ఛకోసం ఇప్పటికే ప్రభుత్వంపై తిరగబడ్డారని, మహానాడు విజయవంతంతో రుజువైంది. ముమ్మాటికీ సాధారణ ఉధ్యోగులపై కక్షసాధించడానికే ప్రభుత్వం అవినీతి యాప్ తీసుకొచ్చింది. జగన్ అవినీతి యాప్ తీసుకురావడంపై సొంతపార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులే నవ్వుకుంటున్నారు. తాము, తమనాయకుడే అవినీతిలో పుట్టి, దానిలో మునిగితేలుతుంటే యాప్ లు, కాల్ సెంటర్లు, టోల్ ఫ్రీ నంబర్లు ఏంచేస్తాయంటున్నారు.

మద్యం, ఇసుక అమ్మకాల్లో జరిగే అవినీతిని మించింది ఇంకేమైనా ఉందా?
నాసిరకం బ్రాండ్లు, నగదుకు అమ్మడం.. అవినీతికాదా? చంద్రబాబుగారు ఉచితఇసుకవిధానం అమలుచేస్తే, దాన్నికూడా దోపిడీవనరుగా మార్చుకున్నారు. ఇసుకఅమ్మకాలకు సంబంధించి రసీదులు ఇవ్వడానికి కూడా ఈప్రభుత్వంలో దిక్కులేరు. ఇసుకరీచ్ లు ప్రైవేట్ వ్యక్తికి అప్పగించిన ప్రభుత్వం, నిత్యంవేలకోట్లు దోచేస్తోంది. నెల్లూరులో జరిగే సిలికా మైనింగ్ వ్యవహారం సంగతేమిటి? సిలికాతో తానుసంపాదించేదేమీ లేదు, ఎలహంక ప్యాలెస్ కు నెలానెలా మామూళ్లు పంపిస్తున్నానని సన్నిహితులవద్ద శేఖర్ రెడ్డి వాపోయింది నిజం కాదా? ప్రకాశంజిల్లాలో ఎన్ని మైనింగ్ లు మూతపడ్డాయో తెలియదా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలోని గనులశాఖలోజరిగే కుంభకోణాలు ముఖ్యమంత్రికి తెలియదా? ముఖ్యమంత్రి కుటుంబమే మద్యం, ఇసుక, సిలికాన్, గనుల్ని దోపిడీచేస్తుంటే, కిందిస్థాయి అధికారుల అవినీతిని ఎత్తిచూపుతారా?

వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఇసుక అక్రమాలపై, సొంతపార్టీ వారే గుంటూరు డీఆర్సీ మీటింగ్ లోమాట్లాడలేదా? వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ధాన్యంఅమ్మకాల్లోజరిగే దోపిడీని ఎత్తిచూపలేదా? నెల్లూరుజిల్లాలో వైసీపీనేతలు జరిపిన ధాన్యంకొనుగోళ్లతో రైతులు రూ.3వేలకోట్లు నష్టపోయారు. వారంతా ఏబటన్ నొక్కాలి? ధాన్యం కొనుగోళ్లలో జరిగిన అవినీతిపై పౌరసరఫరాలశాఖ, కలెక్టర్లు, ఏంచర్యలు తీసుకున్నారు? కృష్ణపట్నం పోర్టులోకి లారీపోవాలంటే కాకాణి టోల్ గేట్ లో డబ్బులుకట్టాలని ఏసీబీకి తెలియదా? బెంజి మంత్రిగా పేరున్న గుమ్మనూరు జయరాం అవినీతిపై, బూతులమంత్రిగా పేరున్న వ్యక్తి గుడివాడ కేసినో ఘటనపై ముఖ్యమంత్రి ఏంచర్యలు తీసుకున్నారు? విశాఖపట్నంలోజరిగిన అధికారపార్టీ భూకుంభకోణాలపై స్థానిక వైసీపీనేతలు సంయమనం పాటించాలన్న సందేశం ఎవరిచ్చారు?

జగన్మోహన్ రెడ్డిని నమ్మి ప్రజలు151స్థానాలిస్తే, వ్యవస్థల్ని సర్వనాశనంచేశాడు. ఆయన అవినీతిపరుడైతే సాటిఎమ్మెల్యేలు, మంతుల్ని కూడా ఇష్టమొచ్చినట్లు చేసుకోండని గాలికివదిలేస్తాడా? ప్రభుత్వం యాప్ లు పెట్టడాన్ని తప్పుపట్టడం లేదు. కానీ ఏసీబీ వ్యవస్థఎప్పటినుంచో ఉందని గుర్తుంచుకోండి. దానిపనిని స్వేఛ్చగా చేయనిస్తే ప్రభుత్వం ఎలాంటి యాప్ లు, ఫోన్ నెంబర్లు తీసుకురావాల్సిన అవసరంలేదు. అవినీతి నిరోధానికి యాప్ తీసుకొచ్చిన ప్రభుత్వం దానికి వచ్చే ఫిర్యాదుల వివరాలను ప్రతిరోజూ బహిర్గతంచేయాలి. అలానే అవినీతికి పాల్పడిన అధికారులపై తీసుకున్న చర్యల వివరాలకు సంబంధించి ప్రతినెలా యాక్షన్ టేకన్ రిపోర్ట్ ను ప్రజల ముందు ఉంచాలి. ముఖ్యమంత్రి నిజంగా అవినీతిని కట్టడిచేసేవాడే అయితే, ఆ ఆలోచన ఆయనకుంటే, ముందు ఈమూడేళ్లలో తనమంత్రులు, ఎమ్మెల్యేలు, తాను చేసిన అవినీతి గుట్టుమట్లు తేల్చడానికి తక్షణమే సిట్టింగ్ జడ్జీతో విచారణకు ఆదేశించి, తన నిజాయితీని నిరూపించుకోవాలి”

LEAVE A RESPONSE