Suryaa.co.in

Andhra Pradesh

సిగ్గుండే మాట్లాడుతున్నావా కాకాణి?

– రైతుల పొట్టలు కొట్టిన కాకాణి గోవర్థన్ రెడ్డి, చంద్రబాబుని తప్పుపట్టడం సిగ్గుచేటు
– టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

వ్యవసాయమంటే తెలియని, రైతులపై అభిమానంలేని, రైతుల పొట్టలు కొట్టిన కాకాణి గోవర్థన్ రెడ్డి, చంద్రబాబుని తప్పుపట్టడం సిగ్గుచేటు. గతంలో వ్యవసాయమంత్రిగా ఉన్న కన్నబాబు, ఇప్పుడు కాకాణి గోవర్థన్ రెడ్డి వరదలపాలైన రైతుల్ని ఎప్పుడైనా పలకరించారా? నాలుగేళ్ల జగన్ పాలనలో అకాలవర్షాలు, వరదలు, రెండేళ్లు కరోనాతో రైతులు చితికిపోయిన విషయం కాకాణి మర్చిపోయాడా?

పరిస్థితి ఎలా ఉందంటే నారు పోసేటప్పుడు నీరుఉండదు..వరికోతల సమయంలో వరదలు వస్తాయి. తడిచిన ధాన్యం కొనరు. బ్రోకర్లను అడ్డం పెట్టి దోచుకోవడం. ఇదీ పరిస్థితి. నాలుగేళ్ల జగన్ పాలనలో రైతులు పదేళ్లు వెనక్కుపోయారు కాకాణి.

వ్యవసాయ మంత్రిగా ఉన్న కాకాణి ధాన్యం కొనుగోళ్లపై ఏం సమాధానం చెబుతాడు? తెలంగాణ ప్రభుత్వం 2021-22 లో కోటి66లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొంటే, మీ ప్రభుత్వం రెండుపంటలు కలిపి 70లక్షల మెట్రిక్ టన్నుల లోపు కొన్నారు. ఆ ప్రభుత్వం ధాన్యం కొన్న మూడోరోజునే రైతులకు డబ్బులేస్తోంది. ఇక్కడ మీరు 6నెలలకు కూడా ఇవ్వడంలేదు. సిగ్గుండే మాట్లాడుతున్నావా కాకాణి?

కేంద్రప్రభుత్వ పథకాలు మూసేశారు. మైక్రో ఇరిగేషన్ కు రూ.4వేలకోట్లు ఖర్చుపెట్టాం. సూక్ష్మపోషకాల పంపిణీ ఆపేసిన మీరు వ్యవసాయం గురించి మాట్లాడితే ఎలా?కరువు రావడంకాదు. ..దాన్ని తట్టుకొని రైతుల్ని ఆదుకునే మగాడు కావాలి. పట్టిసీమ నిర్మించి, కృష్ణా డెల్టాకు నీళ్లిచ్చి, అదే నీటిని రాయలసీమకు, పులివెందులకు తీసుకెళ్లిన మగాడు చంద్రబాబు.

కరోనా సమయంలో ఎకరాకు 2బస్తాలు వసూలుచేసిన కాకాణి ఆ సొమ్ముతో ప్యాలెస్ కట్టుకున్నాడు. ఇలాంటి దరిద్రపు మంత్రిని జనం ఎప్పుడూచూడలేదు. కరువు సమయంలో హంద్రీనీవా ద్వారా సీమలోని పంటల్ని చంద్రబా బు కాపాడారు. మాహాయాంలో వ్యవసాయంలో 11శాతం గ్రోత్ రేట్ సాధించాము. మీరేంసాధించారో చెప్పండి?

మైక్రోఇరిగేషన్, మెకనైజేషన్ లో మేం జాతీయస్థాయిలో తొలిస్థానంలో నిలిచాం. దిగుబడిలో కృషికర్మన్అవార్డ్ సాధించాము. గిట్టుబాటు ధరలేదని పంటఉత్పత్తుల కొనుగోళ్లలో రైతులకు బోనస్ లు ఇచ్చాము. మిర్చి, పసుపు, మామిడి కొన్నాము. ఎన్.డీ.ఆర్.ఎఫ్ నార్మ్స్ కంటే అదనంగా రైతులకు సాయం అందించాము.

650ఎకరాల్లో రూ.600కోట్లతో అయోవా యూనివర్శిటీ సహకారంతో కర్నూల్లో మెగాసీడ్ పార్క్ ఏర్పాటుకు మేం ఒప్పందంచేసుకుంటే, దా న్ని ఆపేశారు.

రైతురథాలు లంచమా..? మరి మీ ఆగ్రోస్ కార్పొరేషన్ ఛైర్మన్, వైసీపీనేత, నీ బాగోతంపై ముఖ్యమంత్రికి రాసిన లేఖపై ఏం సమాధా నం చెబుతావు కాకాణి? కరోనా సమయంలో జనాన్ని ముంచిన కాకాణికి మంత్రి అని చెప్పు కునే అర్హత, చంద్రబాబుగురించి మాట్లాడే అర్హత ఉందా?

రైతుఆత్మహత్యల్లో రాష్ట్రాన్ని మూడోస్థానంలో నిలిపారు. కౌలురైతుల ఆత్మహత్యల్లో రెండోస్థానంలో నిలిపారు. జనాభాప్రాతిపదికన అయితే రైతు ఆత్మహత్యల్లో ఏపీనే నెంబర్-1.రైతుల సగటుఅప్పు జాతీయస్థాయిలో రూ.74,500లు ఉంటే, ఏపీలో మాత్రం దాన్ని రూ.2,45,000లకు చేర్చారు. ఇవీ మీరు సాధించిన ఘనతలు.

చంద్రబాబు వ్యవసాయరంగానికి చేసిన కృషి అనిర్వచనీయం. రైతుల కు 24గంటలు విద్యుత్ అందించిన చంద్రబాబు, వ్యవసాయ మోటా ర్లకు మీటర్లు పెట్టనన్నాడు. మీరు మాత్రం మీటర్లు పెట్టడానికి సిద్ధమయ్యారు. ఆర్.డీ.ఎస్.ఎస్ స్కీ మ్ కింద కేంద్రం ఒక్కో స్మార్ట్ మీటర్ కు రూ. 1500 ఇస్తుంటే, మీరు దాని ధరను రూ.36,950 గా నిర్ణయించారు.

కేంద్రమిచ్చేది రూ.900అయితే రైతులపై రూ.36వేలకోట్ల భారం. రూ.75వేలకోట్లు విద్యుత్ డిస్కంలకు బాకీపెట్టారు. ఇలా చెప్పుకుంటూపోతే జగన్మోహన్ రెడ్డి, కాకాణి గోవర్థన్ రెడ్డి వ్యవ సాయం రంగంలో చాలా ఘనతలు సాధించారు.

LEAVE A RESPONSE